Venus transit: శుక్రుడు సంచారం.. ఈ రాశుల జాతకులకు ఆరోగ్య సమస్యలు, అధిక ఖర్చులు
Venus transit: శుక్రుడు మీన రాశి సంచారం కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వబోతుంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
Venus transit: ప్రేమ, అందం, ఆనందం, శ్రేయస్సుకి కారకుడిగా శుక్రుడుని భావిస్తారు. శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఆనందానికి లోటుండదు. మార్చి నెలలో శుక్రుడు రెండుసార్లు తన రాశి చక్రం మార్చుకోనున్నాడు. ప్రస్తుతం మకర రాశి సంచారం చేస్తున్న శుక్రుడు మార్చి 7న కుంభ రాశి ప్రవేశం చేస్తాడు.

మార్చి 30 వరకు ఇదే రాశిలో ఉంటాడు. మార్చి 31వ తేదీన మీన రాశి ప్రవేశం చేస్తాడు. బృహస్పతి మీన రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఏప్రిల్ 24 వరకు మీన రాశిలోనే సంచరిస్తాడు. బుధుడు తర్వాత అత్యంత వేగంగా కదిలే గ్రహం శుక్రుడు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి దాదాపు 23 రోజులు పడుతుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సంచారం ప్రత్యేకంగా భావిస్తారు. శుక్రుడు మీన రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల జాతకులు వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మీన రాశిలో శుక్రుడు సంచారం మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ కాలంలో కొన్ని రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. ఏ ఏ రాశుల వాళ్ళు సమస్యలు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశికి గ్రహాల రాకుమారుడు బుధుడు పాలకుడుగా వ్యవహరిస్తాడు. శుక్రుడు, బుధుడు స్నేహపూర్వక గ్రహాలు. కానీ శుక్ర సంచారం మిథున రాశి జాతకులకు శుభప్రదంగా పరిగణించరు. శుక్రుడు ఈ రాశి పన్నెండు, ఐదో ఇంట్లో సంచరిస్తాడు. శుక్రుడు సంచారం వల్ల కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ పనుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండటమే మంచిది. మీ మాటలు, ప్రవర్తన వల్ల ఎదుటివారు బాధపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధం లో కూడా ఇబ్బందులు వస్తాయి. వ్యాపారస్తులకు ఇది కష్టకాలం విజయానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మీన రాశి
మీన రాశి రెండో ఇంట్లో శుక్ర సంచారం జరగనుంది. ఇది ఈ రాశి వారి జీవితాల పై వివిధ ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అతిథులు వచ్చే అవకాశం ఉంది. వారి వినోదం కోసం సమయం, డబ్బు వెచ్చిస్తారు. మాటలు అదుపులో ఉంచుకోవాలి లేదంటే బంధాలు క్షమించే ప్రమాదం ఉంది. మీన రాశిలో శుక్ర సంచారం వల్ల ఆరోగ్యానికి పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పంటి నొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. నోటిపూతకు సంబంధించిన ఆందోళన కూడా ఉంటాయి.
తులా రాశి
తులా రాశి వారికి శుక్రుడు ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. విజయం సాధించడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకొని ప్రశాంతంగా పని చేస్తే పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిక్ రోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి.