Karkataka Rasi 2024: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం కలిసొస్తుంది-karkataka rasi 2024 yearly predictions check your astrological sign cancer for new year in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karkataka Rasi 2024: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం కలిసొస్తుంది

Karkataka Rasi 2024: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం కలిసొస్తుంది

HT Telugu Desk HT Telugu
Dec 14, 2023 09:36 AM IST

Karkataka Rasi 2024: కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ 2024వ సంవత్సరం కలసివస్తుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారి సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Karkataka Rasi 2024: కర్కాటక రాశి సంవత్సర రాశి ఫలాలు
Karkataka Rasi 2024: కర్కాటక రాశి సంవత్సర రాశి ఫలాలు (Pixabay)

2024వ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ స్థానములో శని సంచారం వలన ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. అయినప్పటికి 2024లో కర్మాటక రాశి వారికి గురుని అనుకూల ప్రభావం చేత, వారి యొక్క సంకల్పంతో శుభ ఫలితాలు పొందు సూచనలు కనబడుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కర్మాటక రాశి 2024లో జనవరి నుండి ఏప్రిల్‌ వరకు శని అష్టమంలో, గురుడు దశమంలో సంచరించడం వలన మధ్యస్థ ఫలితాలు కలుగును. 2024 మే నుండి గురుడు లాభస్థానములో అనుకూలముగా వ్యవహరించడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా లాభములు చేకూరును.

కోర్టు వ్యవహారములు వంటి వాటిలో కొంత అనుకూల ఫలితాలు కలుగు సూచన. 2024 ప్రథమార్థంలో కర్కాటక రాశివారు అరోగ్య, కుటుంబ విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. మొత్తంమీద 2024 కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనబడుచున్నాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కర్కాటక రాశి 2024 పేమ జీవితం

2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంత కలసిరావు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు వేధించును. ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో 2024లో మీయొక్క భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగు సూచనలు అధికముగా ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఇబ్బందిపెట్టును. ఎదుటివారిని గుడ్డిగా నమ్మవద్దని సూచన.

కర్కాటక రాశి 2024 ఆర్థిక విషయాలు

2024 సంవత్సరం కర్కాటక రాశివారికి ఆర్థికపరముగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు. ద్వితీయార్థం జూన్‌ నుండి డిశంబర్‌ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 2024లో ఆర్థికపరముగా పురోగతిని పొందెదరు. ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేయాల్సి వచ్చును.

కర్కాటక రాశి 2024 కెరీర్

గత కొంత కాలముతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలించును. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి గురుని అనుకూలత వలన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి కలుగును. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్‌పరంగా అనుకూల ఫలితాలు కలిగించును.

కర్కాటక రాశి 2024 ఆరోగ్యం

2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశివారు ఆరోగ్య విషయాల యందు కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం వారి స్వంత ఆరోగ్యం కావచ్చు మరియు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కావచ్చు కచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ రాశివారు ఆరోగ్యాభివృద్ధి కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం మంచిది.

కర్కాటక రాశి 2024 పరిహారాలు

కర్కాటక రాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రేయస్కరం. వేంకటేశ్వరస్వామిని పూజించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే శివాలయంలో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel