Rahu blessings: రాహువు ఆశీర్వాదం పొందిన రాశులు ఇవే.. వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి-these zodiac signs get rahu blessings at all the time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Blessings: రాహువు ఆశీర్వాదం పొందిన రాశులు ఇవే.. వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

Rahu blessings: రాహువు ఆశీర్వాదం పొందిన రాశులు ఇవే.. వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

Gunti Soundarya HT Telugu
Mar 04, 2024 02:10 PM IST

Rahu blessings: ఛాయా గ్రహంగా పేరు పొందిన రాహువు కొన్ని రాశుల మీద తన ప్రత్యేక అనుగ్రహం కురిపిస్తాడు. ఏయే రాశుల మీద రాహువు అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం.

రాహువు అనుగ్రహం కలిగిన రాశులు ఇవే
రాహువు అనుగ్రహం కలిగిన రాశులు ఇవే

Rahuvu blessings: వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువు పాప, క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శక్తివంతమైన గ్రహాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే సంచరిస్తుంది. జాతకంలో రాహువు స్థానం శుభప్రదంగా ఉంటే మంచి జరుగుతుంది. అదే అశుభంగా ఉంటే మాత్రం జీవితంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. సవాళ్లు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

రాహువు కి సొంతంగా రాశి చక్రంలో ఇల్లు లేదు. ఏ రాశిలో రాహు సంచరిస్తే ఆ రాశి అధిపతిని ప్రభావితం చేస్తుంది.  ప్రస్తుతం రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటే ధనుస్సు రాశిలో బలహీనంగా ఉంటాడు. కన్య, కుంభ రాశి 3, 6, 11 గృహాలలో రాహు బలంగా ఉంటాడు. రాహువు శుభ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. 

మొత్తం 12 రాశి చక్రాల మీద రాహు ప్రభావం ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా ఉంటూనే ఉంటుంది. అయితే ఈ రాశులలో కొన్ని రాశుల వారికి మాత్రం రాహువు అనుగ్రహం ఉంటుంది. ఫలితంగా ఆయా రాశుల వాళ్ళు శుభ ఫలితాలు పొందుతారు. ఏయే రాశుల వారి మీద రాహువు అనుగ్రహం ఉంటుందో చూద్దాం. 

మిథున రాశి 

మిథునంలో రాహువు స్థానం బలంగా ఉండటం వల్ల ఈ రాశి జాతకులు తెలివైన వారుగా ఉంటారు. బహుముఖ ప్రజ్ఞావంతులుగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. కమ్యూనికేషన్స్, రైటింగ్, లెర్నింగ్ స్కిల్స్ లో అద్భుతంగా రాణిస్తారు. రాహువు ప్రభావంతో మిథున రాశి జాతకులు మీడియా, సాంకేతిక, వాణిజ్యానికి సంబంధించిన రంగాలలో కీర్తి, విజయం, సంపద పొందుతారు.

కన్యా రాశి 

కన్యా రాశిలో జాతకులు రాహువు ప్రభావంతో విశ్లేషణాత్మకంగా పనులు చేస్తారు.  పని సామర్థ్యాలకు అందరూ ముగ్ధులవుతారు. వీరి నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. వనరులు వీరికి అనుకూలంగా ఉంటాయి. రాహు ప్రభావంతో మీరు చేసే పనిలో ప్రావీణ్యం పొందుతారు. అది వారికి గుర్తింపుని ఇస్తుంది. ఆరోగ్యం, సేవా నిర్వహణకు సంబంధించిన రంగాలలో ఈ రాశుల జాతకులు అద్భుతంగా రాణిస్తారు. 

కుంభ రాశి

రాహు ప్రభావంతో కుంభరాశి జాతకులు ప్రగతిశీలులు, మానవతావాదులుగా ఉంటారు. సామాజిక న్యాయం, సంస్కరణ, ఆవిష్కరణల వంటి భావాలు కలిగి ఉంటారు. వీరి ప్రదర్శన అసాధారణంగా ఉంటుంది. సైన్స్, సోషల్ వర్క్, యాక్టివిజం వంటి రంగాలలో రాహు ప్రభావంతో ప్రజాదరణ పొందుతారు. వృత్తిలో వీరి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది.

మేష రాశి

రాహు ప్రభావంతో మేష రాశి జాతకులు ధైర్యంగా, సాహసోపేతంమైన స్వభావం కలిగి ఉంటారు. సంకల్ప బలంతో మంచి పేరు తెచ్చుకుంటారు. దూకుడుగా, పోటీ తత్వంతో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ధైర్యసాహసాలతో ముందుకు సాగుతారు. క్రీడలు, సైనిక, రాజకీయాలకు సంబంధించిన రంగాలలో ఈ రాశి జాతకులు రాహు ప్రభావంతో విజయం సాధిస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు.  

సింహ రాశి

సింహ రాశి జాతకులని రాహువు ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా మారుస్తాడు. నాటకం, కళ, వినోదం వంటి నైపుణ్యాలు ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు. కొద్దిగా గర్వమైన స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఉదారంగా కూడా ఉంటారు. వీరికి రాహువు కీర్తి, శక్తి ,అందాన్ని ఇస్తాడు.  విద్యకు సంబంధించిన రంగాలలో రాణిస్తారు.

WhatsApp channel