Holi Colours: హోలీ రంగులు చల్లుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఒక్కసారి ఇది చదవండి
Holi Colours: హోలీ వచ్చిందంటే పిల్లలకు పెద్దలకు పండగే. రంగులు చల్లుకొని... రంగుల నీళ్లలో డ్యాన్సులు చేస్తారు. హోలీ రంగులు చల్లుకునే ముందుకు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
Holi Colours: హోలీ పండుగ వచ్చేస్తోంది. హోలీ దగ్గర పడుతున్న కొద్ది వీధులన్నీ రంగులతో నిండిపోతాయి. ఎక్కడపడితే అక్కడే రంగులు అమ్ముతూ కనిపిస్తారు. వాటిని కొనే వారి సంఖ్య కూడా ఎక్కువే. హోలీ రోజు రంగులు చల్లుకునేందుకు సిద్ధమవుతున్నారా? ఒక్కసారి ఇది చదవండి. బయట అమ్మే రసాయనాలు కలిపిన హోలీ రంగులు వాడటం వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకోండి. ముఖ్యంగా పిల్లలను ఈ రసాయనాలు కలిపిన రంగులకు దూరంగా ఉంచడం ఎంత అవసరమో తెలుసుకోండి.
హోలీ అనగానే ప్రకాశవంతమైన రంగులే గుర్తొస్తాయి. ఆ రంగులు ముఖాలపై చల్లుకొని ఆనందించేవారు ఎంతోమంది. ఆ రంగులన్నీ కృత్రిమ రంగులనే విషయం గుర్తుపెట్టుకోండి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే ప్రమాదకరమైన రసాయనాలు మీ శరీరంలో చేరుతాయి. ఇది మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని జీవితాంతం వెంటాడే సమస్యలను ఇస్తాయి. కొందరికి ఎలర్జీలు త్వరగా వస్తాయి. చర్మం సున్నితంగా ఉండేవారు రసాయనాలు కలిపిన హోలీ రంగులను చల్లుకోవడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు జీవితాంతం వెంటాడుతాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానం.
హోలీ రంగులతో కంటి సమస్యలు
రసాయనాలు కలిసిన రంగుల్లో భారీ లోహాలు, సింథటిక్ సంకలనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మంపై దద్దుర్లు, దురదను కలిగిస్తాయి. ఇక కళ్ళల్లో పడితే అంతే సంగతులు. కొందరిలో కంటి సమస్యలు ఎక్కువైపోతాయి. కెమికల్ తో నిండిన రంగులు కంట్లో పడి చికాకును కలిగిస్తాయి. ఎర్రగా మారుస్తాయి. కార్నియాను దెబ్బతీస్తాయి. కాబట్టి హోలీ రోజు కచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. కళ్ళల్లో రంగులు పడకుండా జాగ్రత్త పడింది.
ముఖ్యంగా శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఈ హోలీ రంగుల వల్ల ఉంది. ఈ రంగుల్లో ఉండే రసాయనాలను పీల్చడం వల్ల ఆస్తమా అలర్జీలు వస్తాయి. అంతర్లీనంగా ఉన్న శ్వాసకోశ సమస్యలు కూడా పెద్దవవుతాయి. ఈ సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రంగా బాధపడతాయి
రసాయనాలు కలిపిన రంగులను వాడే కన్నా ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులతోనే హోలీ ఆడుకోవడం మంచిది. రసాయనాలు కలిపిన రంగులు చర్మం గుండా శరీరంలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల వికారం, కడుపునొప్పి, వాంతులు, అవయవాల దెబ్బ తినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ సహజమైన రంగులు వాడేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా కంటికి గ్లాసెస్ వంటివి పెట్టుకోండి. అలాగే చర్మానికి ఆవాల నూనె లేదా పెట్రోలియం జెల్లీని బాగా పట్టించండి. పొడవాటి చేతులున్న దుస్తులు వేసుకోండి. చర్మంపై ఈ రసాయనాలు కలిపిన రంగులు పడకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా మొటిమలతో బాధపడేవారు ఈ రసాయనాలు కలిపిన రంగులను ముఖంపై పడకుండా చూసుకోవడం చాలా మంచిది. లేకుంటే ఆ సమస్య ఇంకా పెరిగిపోతుంది. హోలీ ఆడాక రంగులను వెంటనే శుభ్రం చేసుకోండి. క్లెన్సర్లను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది. ఆ రంగులతోనే ఎక్కువసేపు ఉంటే అవి చర్మంలోకి మరింతగా ఇంకిపోయే అవకాశం ఉంటుంది.
టాపిక్