Motion Sickness : బస్సు, రైలు, విమానం...ఇలా ఎందులో ప్రయాణం చేసినా కొందరికి కడుపులో తిప్పుతుంది. వికారం, వాంతులు, తల తిరగడం సమస్యలు ఎదుర్కొంటారు. దీనిని మోషన్ సిక్ నెస్ అంటారు. 

pexels

By Bandaru Satyaprasad
Feb 17, 2024

Hindustan Times
Telugu

ప్రయాణాల్లో వికారం, వాంతుల సమస్యలను తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. 

pexels

పుదీనా ఆకులను నీటిలో మరిగించి ప్రయాణానికి ముందు తాగాలి. పుదీనా స్మెల్.. వికారం, మోషన్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది.   

pexels

యాపిల్ సైడర్ వెనిగర్ ను ఓ గ్లాసు నీటిలో కలిపి ప్రయాణానికి ముందు ఈ నీటితో నోటిని క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే వికారం, వాంతులు తగ్గుతాయి.   

pexels

దాల్చిన చెక్కను నీటిలో మరిగించాలి. ఆ గోరువచెచ్చని నీటిని తాగడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి.  

pexels

ప్రయాణాల్లో వాంతులు, వికారం తగ్గడానికి యాలకులు మంచి చిట్కా. రెండు యాలకులు నోట్లో వేసుకుని నమిలితే వికారం తగ్గుతుంది. యాలకులు, దాల్చిన చెక్కతో చేసిన టీ తాగవచ్చు. 

pexels

నిమ్మరసం, పెప్పర్ కలిసిన వాటర్ తాగితే తల బరువు, తల తిరగజం నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది . 

pexels

ప్రయాణాల్లో వికారం తగ్గడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. ప్రయాణానికి ముందు అల్లం టీ, అల్లంతో చేసిన పదార్థాలు తింటే వాంతులు, వికారం తగ్గుతుంది.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels