తెలుగు న్యూస్ / ఫోటో /
Diabetes: డయాబెటిస్ వల్ల మీ చర్మం, దంతాలలో కనిపించే మార్పులు ఇవే
- Diabetes: డయాబెటిస్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీని లక్షణాలు అందరికీ తెలిసినవే అనుకుంటారు. కానీ కొన్ని లక్షణాలను గుర్తుపట్టడం కష్టమే. ముఖ్యంగా కళ్ళు, చెవులు, దంతాలు, చర్మం వంటి అవయవాల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
- Diabetes: డయాబెటిస్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీని లక్షణాలు అందరికీ తెలిసినవే అనుకుంటారు. కానీ కొన్ని లక్షణాలను గుర్తుపట్టడం కష్టమే. ముఖ్యంగా కళ్ళు, చెవులు, దంతాలు, చర్మం వంటి అవయవాల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
(1 / 9)
డయాబెటిస్ ఒక సైలెంట్ కిల్లర్. దీని లక్షణాలు వచ్చిన వెంటనే కనిపించవు. మెల్లగా బయటపడుతూ ఉంటాయి. అయినా ఆ లక్షణాలను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అందుకే డయాబెటిస్ బాగా ముదిరాకే బయటపడుతుంది. డయాబెటిస్ వచ్చినవారికి ఎక్కువగా కనిపించే లక్షణం దాహం అతిగా వేయడం, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం. ఇవే కాదు మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాాయి.
(2 / 9)
డయాబెటిస్ వల్ల చర్మంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ చర్మంపై నల్ల మచ్చలు వచ్చినా, మెడ, అండర్ ఆర్మ్స్ వంటి ప్రాంతాలలో నల్లగా మచ్చలు ఏర్పిడినా అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి.
(3 / 9)
ఏదో ఒక ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే మీకు డయాబెటిస్ ఉందని అర్థం చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే, అది మీ శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు, చర్మ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురి చేస్తుంది.
(4 / 9)
పీరియాంటైటిస్ అనేది దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లలో ఒకటి. మధుమేహుల్లో ఇది ఒక సాధారణ సమస్య. చిగుళ్ల నుంచి రక్తం రావడం, దుర్వాసన వేయడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం… వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దంతవైద్యుడిని సంప్రదించండి.
(5 / 9)
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే… మీ చూపులో మార్పు రావచ్చు. వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. డయాబెటిస్ వల్ల మీ చూపులో మార్పు రావచ్చు. మీ కళ్ళను వైద్యులకు చూపించడం చాలా మంచిది.
(6 / 9)
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. శరీరంలోని చిన్న రక్త నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. లోపలి చెవిలోని నరాలు దెబ్బతిని… వినికిడి లోపానికి కారణమవుతాయి. మీకు వినికిడి లోపం ఉన్నా, డయాబెటిస్ కు సంబంధించి ఇతర లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
(7 / 9)
చిన్న పిల్లలు మంచాన్ని తడపడం సహజం. ఇది డయాబెటిస్ లక్షణాలలో ఒకటి. పిల్లలు ప్రతిరోజూ మంచంపైనే నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే వైద్యులను సంప్రదించడం చాాలా ముఖ్యం. ఎందుకంటే అది మధుమేహానికి సంకేతం. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే, అది మీకు తరచుగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది.
(8 / 9)
డయాబెటిస్ మీ శారీరక ఆరోగ్యాన్నే కాదు, మీ మానసిక స్థితిని కూడా మారుస్తుంది. ప్రశాంతంగా కూర్చోేనీయదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది. చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, భయం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇతర గ్యాలరీలు