Krishna mukunda murari serial march 12th: కృష్ణ కోసం ఆదర్శ్ మీద తిరగబడ్డ మురారి.. కుప్పకూలిన రేవతి, ముకుంద చనిపోయిందా?-krishna mukunda murari serial march 12th episode murari stands by krishna as adarsh accuses her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari Serial March 12th Episode Murari Stands By Krishna As Adarsh Accuses Her

Krishna mukunda murari serial march 12th: కృష్ణ కోసం ఆదర్శ్ మీద తిరగబడ్డ మురారి.. కుప్పకూలిన రేవతి, ముకుంద చనిపోయిందా?

Gunti Soundarya HT Telugu
Mar 12, 2024 07:20 AM IST

Krishna mukunda murari serial march 12th episode: కృష్ణ తీవ్రంగా అవమానించడంతో ముకుంద ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్లిపోవడానికి కారణం కృష్ణ అంటూ ఆదర్శ్ నిందిస్తాడు. దీంతో మురారి తిరగబడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 12వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 12వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 12th episode: ముకుంద అందరి ముందు తన మనసులో మాట చెప్పేస్తుంది. నీ కళ్ళన్నీ నా భర్త మీద ఉన్నాయని తెలుసు కానీ నిన్ను శత్రువులా చూడకుండా మారతావని నా ప్రయత్నాలు చేశాను అది తప్పా అంటే తప్పే అంటే తప్పే మీరు నాకు ఇష్టం లేని జీవితంలో నన్ను ఇరికించాలని చూశారు. ఎన్ని రోజులు ఓర్చుకోవాలి ఇక నా వల్ల కాదని అంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం నా భర్తని నీ చేతిలో పెట్టి నీతో పంపించాలా? చూశారా అత్తయ్య ఎలా సిగ్గు లేకుండా మాట్లాడుతుందో అని కృష్ణ అంటే నాకెందుకు సిగ్గు నీకు భర్త కాకముందు నాకు ప్రియుడని చండాలంగా మాట్లాడుతుంది.

ముకుందని అవమానించిన కృష్ణ

నా ప్రియుడిని నేను కావాలని కోరుకుంటున్నాను తప్పేంటి?మురారిని మనసులో ఉంచుకుని ఆదర్శ్ తో కాపురం చేస్తే అది తప్పు. అందుకే ఇన్నాళ్ళూ భరించి ఈరోజు బయట పడిపోయాను. ఏ నాటకాలు ఆడకుండా ఆదర్శ్ కి నిజం చెప్పేశాను. నేను చేసింది తప్పు కాదు నూటికి నూరు పాళ్ళు తప్పు కాదు. ముకుంద నిన్ను చూస్తుంటే అసహ్యం కాదు విరక్తి పుడుతుంది. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడైనా చూశారా? మొహం మీద ఉమ్మి వేయాలని అనిపించడం లేదా అంటే ముకుంద కృష్ణ అని గట్టిగా అరుస్తూ తన మీదకి చెయ్యి ఎత్తుతుంది. సిగ్గు, పరువు, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా నీకు నిన్ను చూస్తుంటే తేళ్ళు పాకుతున్నట్టు అనిపిస్తుంది. ఛీ నీది ఒక బతుకేనా? నీ సిగ్గు లేని బతుక్కి పౌరుషం కూడానా.. ఇలాంటి బతుకు బతికినా ఒకటే పోయినా ఒకటేనని తిడుతుంది.

తప్పు చేస్తున్నావ్ కృష్ణ ఇంతకింత అనుభవిస్తావని ముకుంద వారిస్తుంది. తప్పు చేసింది నువ్వు అయితే నేనెందుకు అనుభవిస్తాను అంటే అనుభవిస్తావ్. నన్ను ఇంతమంది ముందు కొట్టావ్ నానా మాటలు అన్నావ్. నువ్వు అనుభవిస్తావ్ కృష్ణ తప్పకుండా అనుభవిస్తావ్ ఆరోజు ముకుందని ఎందుకు అంతలా అవమానించావని బాధపడే రోజు వస్తుంది కృష్ణ బాగా గుర్తు పెట్టుకో అనేసి ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.వెళ్ళిపోయింది ఇదేగా నా జీవితంలో మీరు జరగాలని కోరుకుంది ఇప్పుడు సంతోషమేగా. నన్ను ఎందుకు తీసుకొచ్చారు. ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు. మీరు అసలు మనుషులేనా మీకు మనసు ఉందా? అనేసి ఆదర్శ్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు.

కృష్ణని సపోర్ట్ చేసిన మురారి

కృష్ణ బాధగా ఎలా మాట్లాడుతుందో చూశారా? ఇంతకు తెగిస్తుందని అనుకోలేదని అంటుంది. ఏదో ఒక రోజు ముకుంద ఇలా చేస్తుందని ఊహించాను కానీ ఈరోజు ఇలా చేస్తుందని అనుకోలేదు. ఇంతకముందులాగే ఏదో ఒక కారణం చెప్పి శోభనం ఆపేస్తుందని అనుకున్నాను. ఇప్పుడు ఆదర్శ్ ని ఎలా ఓదార్చాలో పెద్దమ్మకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదని మురారి అంటాడు. మధు వచ్చి పెద్దమ్మ చాలా బాధపడుతుందని చెప్తాడు. అటు ఆదర్శ్ కోపంగా బ్యాగ్ పట్టుకుని కిందకి వస్తాడు. తనని కృష్ణ, మురారి ఆపుతాడు. ఎక్కడికి వెళ్తున్నావని అంటే వెళ్లక ఇక్కడే ఉండాలా? నేను ముకుంద మనసులో ఉన్నానని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు తనే లేదు ఇంక నేనెందుకు ఉండాలని అంటాడు.

ముకుంద ఎక్కడికి వెళ్తుంది కోపం తగ్గాక తనే తిరిగి వస్తుందని కృష్ణ అంటుంది. తిరిగి వస్తే ఏం చేయాలి ఇంత జరిగినాక కూడా నీ మనసులో చోటు ఇవ్వమని అడుక్కోవాలా? అంటే అలా అనకు తను నీ భార్య తప్పు తెలుసుకుంటుందని చెప్తుంది. నువ్వు ఆ మాట అనొద్దు కృష్ణ ముకుంద ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది నువ్వు. నువ్వు తప్పు చేసి ముకుందని బయటకి తరిమేశావ్. తను వెళ్లిపోవడానికి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కృష్ణ కారణం అంటే మురారి గట్టిగా ఏయ్ ఆపు అంటాడు. కృష్ణని ఎందుకు అంటున్నావ్ నీకేం హక్కు ఉందని అంటున్నావని నిలదీస్తాడు. మళ్ళీ ఏంటి గొడవ జరిగింది చాలదా అని రేవతి అడ్డుపడుతుంది.

చవట, దద్దమ్మవని ఆదర్శ్ ని తిట్టిన మురారి

కృష్ణ తప్పు చేసిందని అంటే నేను ఎలా ఊరుకుంటాను. కృష్ణ చేసిన తప్పు ఏంటి విడిపోయిన మీ ఇద్దరినీ ఒక్కటి చేయాలని అనుకుంది అది తప్పా? పెద్దమ్మ మనవరాలిని ఇవ్వాలని అడిగినా మీరు ఒక్కటైతేనే మేము ఒక్కటి అవాలని తన శోభనం వద్దని అనుకుంది అది తను చేసిన తప్పా? నీ సంతోషంలో తన సంతోషం వెతుక్కున్న పిచ్చిది అదా తను చేసిన తప్పు. తప్పు ఏదైనా జరిగింది అంటే అది నా వల్ల జరిగింది. నువ్వు ముకుందని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నీకోసం ఆలోచించకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు. చెప్పకుండా తప్పు చేసింది నేను. నన్ను వదిలేసి ఏం జరిగినా కృష్ణ అంటావ్ ఏంటి? తను ఏ తప్పు చేయలేదు ముకుంద చేసిన తప్పులకు అడ్డుగా నిలబడింది.

అసలు దీనంతటికి కారణం నువ్వు. నువ్వు ఒక చేతకాని వాడివి చవట దద్దమ్మవి కావడం వల్లే ఇదంతా జరిగింది. రేయ్ ఆపండ్రా ముకుంద ఎక్కడికి వెళ్లిందోనని కంగారుగా ఉంటే మీ గొడవ ఏంటని రేవతి వారిస్తుంది. నా భార్య కారణం అంటున్నాడు నేను ఎలా ఊరుకుంటాను ఆరోజు పెళ్ళిలో ఫోన్లో మాట్లాడింది విని ఏం చేయకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయావ్. ఆరోజే ఇంట్లో విషయం చెప్పి ఉంటే.. ఏం జరిగేది చెప్పి ఉంటే ఏం జరిగేది ఇంతకన్నా గొప్పగా ఉండేదా అని ఆదర్శ్ అంటాడు. ఈ రెండు సంవత్సరాలు మా జీవితాలు వేరుగా ఉండేవి. ఆరోజు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఇప్పుడు నా భార్యని అంటావ్ ఏంటి? తప్పు చేసింది కృష్ణ అంటే మీరు నమ్ముతారా? అని రేవతి వాళ్ళని ప్రశ్నిస్తాడు.

ముకుంద కోసం టెన్షన్ పడుతున్న కృష్ణ

తప్పు నాదే మీరు నాకోసం చాలా చేశారు. కానీ అవన్నీ చేయకపోయి ఉంటే చాలా బాగుండేది. నేను అక్కడెక్కడో చేతకాని దద్దమ్మలా ఉండేవాడిని. ఇప్పటికైనా జరిగింది ఏం లేదు నేను వెళ్లిపోతానని అంటాడు. ఏయ్ ఆగు నువ్వు వెళ్ళిపోయి మమ్మల్ని దోషులుగా మిగులుద్దాం అనుకుంటున్నావా?నువ్వు వెళ్లిపోవడానికి మెమే కారణం అని పెద్దమ్మ ముందు తల దించుకునేలా చేస్తావా? ముకుంద వెళ్లిపోవడానికి కృష్ణ కారణం అంటున్నావ్ కదా. తను ఎక్కడ ఉన్నా మెమే వెతికి తీసుకోస్తాం పెద్దమ్మ వచ్చేవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అంటాడు. అప్పుడు ఆవేశంలో చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు ఏం జరిగినా ఇంట్లో నుంచి వెళ్లొద్దని పెద్దత్తయ్య చెప్పారు కదా తను అన్నింటికీ పరిష్కారం చెప్తారని కృష్ణ కూడా చెప్తుంది.

రేవతి తనని బలవంతంగా ఆదర్శ్ ని గదిలోకి తీసుకెళ్తుంది. ఆదర్శ్ మాటలకు కృష్ణ బాధపడుతుంది. తను బాధలో ఉన్నాడు పట్టించుకోవద్దని మురారి ఓదారుస్తాడు. మంచి చేస్తే చెడు ఎదురవుతుందని అనుకోలేదు. ముకుంద ఎక్కడికి వెళ్లిందో తెలియదు. పెద్దత్తయ్యకి తెలిస్తే ఏమవుతుందోనని టెన్షన్ గా ఉందని కృష్ణ అంటుంది. కోపంలో వెళ్ళింది తనే వచ్చేస్తుందని మురారి అంటాడు. తన కోపం తెలిసి కూడా ఎలా అంటున్నారు అంత ఈజిగా వస్తుందని అనుకోలేదని వెంటనే కృష్ణ ముకుందకి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుందని కృష్ణ ఆలోచిస్తుంది. తన ఇంటికి వెళ్ళి ఉంటుందని మురారి అంటాడు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి వాళ్ళు సంతోషంగా ఉండాలని కృష్ణ మళ్ళీ పాత పాట పాడుతుంది.

ఈ ఇంటిని వదిలి ముకుంద ఉండలేదు. వెళ్ళేది అయితే ఎప్పుడే వెళ్ళేది. పొద్దున్నే ముకుందని వెతకడానికి వెళ్దామని మురారి కన్వీన్స్ చేస్తాడు. ఆదర్శ్ జరిగింది తలుచుకుని ఇంట్లోనే మందు తాగుతాడు. మధు వద్దని వారిస్తున్నా కూడా ఆదర్శ్ తాగుతాడు. మురారి వాళ్ళు ముకుందని వెతకడానికి వెళ్లబోతు ఆదర్శ్ ని చూస్తారు.

తరువాయి భాగంలో..

30 ఏళ్లు ఉన్న ఒక అమ్మాయిని రైలు ఢీ కొట్టిందనే వార్త చూసి రేవతి కంగారుగా అది మన ముకుందేనని కుప్పకూలిపోతుంది. తన చావుకు కారణం నువ్వేనని ఒప్పుకుంటావా? నా భార్య ప్రాణాలు తీసింది నువ్వేనని ఆదర్శ్ మళ్ళీ కృష్ణని నిందిస్తాడు.

IPL_Entry_Point