Krishna mukunda murari march 6th: శోభనం గదిలో నిజం చెప్పేసిన ముకుంద.. మురారి మీద పిచ్చి కోపంతో ఊగిపోయిన ఆదర్శ్-krishna mukunda murari serial march 6th episode mukunda reveals the truth to adarsh about her love with murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari March 6th: శోభనం గదిలో నిజం చెప్పేసిన ముకుంద.. మురారి మీద పిచ్చి కోపంతో ఊగిపోయిన ఆదర్శ్

Krishna mukunda murari march 6th: శోభనం గదిలో నిజం చెప్పేసిన ముకుంద.. మురారి మీద పిచ్చి కోపంతో ఊగిపోయిన ఆదర్శ్

Gunti Soundarya HT Telugu
Mar 06, 2024 07:16 AM IST

Krishna mukunda murari serial march 6th episode: శోభనం గోల ఇంకా సాగుతూనే ఉంది. శోభనం ఎలాగైనా ఆపేయాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక గదిలోకి వెళ్ళిన ముకుంద ఆదర్శ్ కి నిజం చెప్పేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 6వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 6వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 6th episode: కృష్ణ డల్ గా ఉండటం చూసి ఏమైందని రేవతి అడుగుతుంది. ఏబీసీడీల అబ్బాయి నన్ను కొట్టాడని అంటుంది. మందు కొట్టి తనని కొట్టాడని చెప్పేసరికి మురారి బిత్తరపోతాడు. గుడిలో తీర్థం తీసుకున్నాను బార్ లో కాదు ఆఅని గాలి ఊదుతాడు. వాసన వస్తుందా మధు అంటే లేదు అయినా పట్టపగలు నీకు మందు కొట్టే ధైర్యం ఎక్కడఉందని అంటాడు. మందు కొట్టకపోయినా వాళ్ళు ఎలా కోడతారో అలా కొట్టాడని చెప్పేసి వెళ్ళిపోతుంది. మురారి కృష్ణని కొట్టే ఛాన్స్ లేదు ఏదో జరిగింది నాకు ఎందుకో ఈ శోభనం కూడా అని అనబోతుంటే డిప్ప పగులుతుందని రేవతి వార్నింగ్ ఇస్తుంది.

టెన్షన్ లో కృష్ణ, మురారి 

కృష్ణ గదిలోకి వచ్చి జుట్టు విరబోసుకుని కూర్చుంటుంది. మురారి వచ్చి ఏంటి ఇది, కింద అందరికీ నేను తాగి కొట్టానని చెప్పావని అడుగుతాడు. వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం అలా చెప్పాను ముకుంద ఇలా చేస్తుందని చెప్పలేను కదా అంటుంది. అవునులే నేనే కాసేపు ముకుంద సంగతి మర్చిపోయానని అంటాడు. రెస్టారెంట్ లో జరిగింది తలుచుకుని టెన్షన్ పడుతుంది. శోభనం గదిలో నువ్వంటే ఇష్టం లేదు ఇంకా మురారిని ప్రేమిస్తున్నానని చెప్పేస్తుందని మురారి అనేసరికి కృష్ణ భయపడుతుంది. నేను తనతో ఒకసారి మాట్లాడతాను మారిపోయానని చెప్పావ్ కదా ఏమైంది అదంతా అని అడుగుతానని కృష్ణ అంటుంది.

ఇప్పటి వరకు నాకు మాత్రమే తెలుసు. నీకు కూడా విషయం తెలుసని తెలిస్తే ఎంతకైనా తెగిస్తుందని మురారి అంటాడు. అయిన ఏదో ఆశ అంటే తను మారదు కృష్ణ ఆదర్శ్ తో ఇష్టం లేదని చెప్పేస్తుంది. దాన్ని ఆపగలనని అనిపించడం లేదు. ఆదర్శ కి ఏం తెలియకూడదని అంటే అయితే శోభనం ఆపేయాలని మురారి డిసైడ్ అవుతాడు. ఆదర్శ్ కి ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచిస్తారు. ముకుంద ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అద్దంలో తన అంతరాత్మ కనిపిస్తుంది. ఈరోజు నీ శోభనం అంట అందరూ హడావుడి చేస్తుంటే నీ మొహం చూడి మాడిపోయి ఉంది. కానీ ఇదే శోభనం మురారితో అయ్యి ఉంటే ఇలా ఉండేదానివా? అప్సరసలా అందంగా తయారై మెరిసిపోయే దానివి. ఏం పాపం చేసుకున్నావో నీకు ఈ ఖర్మ పట్టింది. శోభనం ఎలా ఆపాలో చూడమని హెచ్చరిస్తుంది.

శోభనాన్ని ఆపడానికి ప్రయత్నాలు 

గీతిక చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఆగిపోతుంది కానీ ఒకవేళ ఆగిపోకపోతే వాళ్ళ శోభనం జరిగిపోతే.. నో అలా జరగడానికి వీల్లేదు అందుకే ఇంకొక ప్లాన్ కూడా ఆలోచించుకోవాలి. ఎంత పని చేశావ్ మురారి అంతా నీవల్లేనని తిట్టుకుంటుంది. ఆదర్శ్ తో మాట్లాడటం కోసం మురారి వస్తాడు. ఫోన్లో శోభనం గురించి తెగ ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడు. మురారి చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ అడగలేక ఇబ్బంది పడతాడు. కాలు నొప్పి ఎలా ఉందని అంటాడు. బాగానే ఉంది కాలు నొప్పిగా ఉందని చెప్పి శోభనం క్యాన్సిల్ చేయమని చెప్పడానికి రాలేదు కదాని ఆదర్శ్ జోక్ గా అడిగేస్తాడు. అయినా నా శోభనాన్ని నువ్వు ఆపలేవు నాది ఆపితే మీది కూడా ఆగిపోతుంది. ముకుంద చాలా డిసప్పాయింట్ అవుతుంది. మొన్న రెస్టారెంట్ లో ఏమైందో చూశావ్ కదా అంటాడు.

ఏం చెప్పాలని వచ్చావని ఆదర్శ్ అడుగుతాడు. ముకుంద గురించి చెప్పడానికి వచ్చాను. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. కొన్ని సార్లు అనుకున్నవి జరగవు డిసప్పాయింట్ అవుతాం. వీలైతే వాటిని మనకి అనుకూలంగా మార్చుకోవాలని సలహా ఇస్తాడు. ఎదురుచూపులు ఎప్పుడు వృధాగా పోవు ముకుంద నాకు దక్కినట్టుగా అని ఆదర్శ్ పెళ్ళాం పిచ్చిలోనే మాట్లాడతాడు. మురారి చెప్పబోతుంటే తనని ఆపేస్తాడు. 

మురారి నువ్వు నాకు పునర్జన్మ ఇచ్చావ్ 

నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో నాకు అర్థం అయ్యింది. నువ్వు తండ్రిలా ఆలోచిస్తున్నావ్ నువ్వు నా లైఫ్ లో ఉండటం నా అదృష్టం. ముకుంద గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నావో నేను చెప్పనా. గతంలో జరిగింది మనసులో పెట్టుకుని తనని ఎక్కడ దూరం పెడతానోనని అలా చేయవద్దని చెప్పడానికి వచ్చావ్. ఒక మనిషికి పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు నాకు పునర్జన్మ ఇచ్చావ్. ముకుందకి నేనంటే ఇష్టం లేదని తెలిసి ఎక్కడో జీవశ్చవంలా బతుకుతుంటే నాకోసం తనని మార్చి నాకు పునర్జన్మ ఇచ్చావ్. ఇప్పుడు మళ్ళీ ముకుందని బాగా చూసుకోమని నాకు చెప్పాలా? తను నా ప్రాణం, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని ఆదర్శ్ మాట ఇస్తాడు. వీళ్ళ మాటలు దూరం నుంచి ముకుంద వింటుంది.

ముకుందని మురారి చూసేస్తాడు. తనని చూసి ఏం మాట్లాడకూడదని డిసైడ్ అవుతాడు. శోభనం వద్దని చెప్తే తనకోసమే చెప్పానని అనుకుంటాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ శోభనాలు జరగనివ్వను ఆపేస్తానని ముకుంద అనుకుంటుంది. సుమలత కృష్ణ దగ్గరకి వచ్చి శోభనం పెళ్లి కూతురివి ఇంకా రెడీ అవకుండా ఇలానే ఉన్నావ్ ఏంటని అడుగుతుంది. ఏమైంది నీకు అంటే భయంగా ఉందని కృష్ణ చెప్తుంది. అందరికీ భయం ఉంటుంది కానీ నీకు మాత్రం భయం ఉండకూడదు. నువ్వు మురారి ఏడాది నుంచి కలిసే ఉంటున్నారు కదా అంటుంది. ఏం చెప్పి శోభనం ఆపాలో అర్థం కావడం లేదని మురారి తలపట్టుకుని కూర్చుంటాడు.

కృష్ణ వచ్చి ఆదర్శ్ తో మాట్లాడారా? శోభనం క్యాన్సిల్ చేయడానికి ఒప్పుకున్నారా అని ఆత్రంగా అడుగుతుంది. ఏం మాట్లాడే పరిస్థితిలో లేనని నిరాశగా మాట్లాడతాడు. చెప్పడానికి వెళ్ళాను అప్పటికే ఫ్రెండ్స్ తో హుషారుగా మాట్లాడుతున్నాడని జరిగింది మొత్తం చెప్తాడు. వాడి ఉత్సాహం చూస్తే శోభనం ఆపడం పాపంఅని అనిపించింది. నేను చెప్పేద్దామని అనుకున్నాను కానీ దూరం నుంచి ముకుంద మమ్మల్నే చూస్తుందని చెప్తాడు.

తరువాయి భాగంలో..

శోభనం గదిలోకి అటు కృష్ణ, ఇటు ముకుంద వెళ్లిపోతారు. కృష్ణ ముకుంద ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతుంది. ఆదర్శ్ పాలు తాగి మిగతా సగం ముకుందకి ఇస్తే వద్దని చెప్తుంది. ఇవే పాలు మురారి ఇస్తే సంతోషంగా తీసుకుని ఉండేదాన్ని అనేసరికి ఆదర్శ్ షాక్ అవుతాడు. నేను జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది మురారితో కదా అంటుంది. ఆదర్శ్ కోపంగా మురారి బయటకి రారా అని పిలుస్తాడు.

Whats_app_banner