Krishna mukunda murari serial march 2nd: మనసు మార్చుకోమని వార్నింగ్ ఇచ్చిన మురారి.. మధుకి అడ్డంగా దొరికిపోయిన ముకుంద-krishna mukunda murari serial march 2nd episode mukunda argues with murari about adarsh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial March 2nd: మనసు మార్చుకోమని వార్నింగ్ ఇచ్చిన మురారి.. మధుకి అడ్డంగా దొరికిపోయిన ముకుంద

Krishna mukunda murari serial march 2nd: మనసు మార్చుకోమని వార్నింగ్ ఇచ్చిన మురారి.. మధుకి అడ్డంగా దొరికిపోయిన ముకుంద

Gunti Soundarya HT Telugu
Mar 02, 2024 07:29 AM IST

Krishna mukunda murari serial march 2nd episode: ఆదర్శ్ తో జరిగే శోభనాన్ని ఆపే ప్రసక్తే లేదని, మనసు మార్చుకుని కాపురం చేసుకోమని మురారి ముకుందకి వార్నింగ్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 2 వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 2 వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 2nd episode: ముకుంద మురారి ఫోన్ కి పంపించిన మెసేజ్ కృష్ణ చూస్తుంది. వెళ్ళి మాట్లాడి రమ్మని కృష్ణ చెప్తుంది. ఆ చెత్త అంతా వినే ఓపిక నాకు లేదు, తనతో మాట్లాడాలంటేనే చిరాకుగా ఉంది. తను పిచ్చి వాగుడు వాగితే కోపంలో ఏదో ఒకటి చేస్తానని భయంగా ఉందని అంటాడు. కృష్ణ కావాలని మురారిని రెచ్చగొడుతుంది ఇది కాదులే ఇంకేదో విషయం ఉందని అంటుంది. అంటే ఏంటి ముకుందని ఫేస్ చేసే ధైర్యం లేదని అనుకుంటున్నావా అంటాడు. నేను అంటుంది ఆ భయం కాదు తను ఏం మాట్లాడితే నేను బాధపడతానోనని మీరు ఆలోచిస్తున్నారు. ఏబీసీడీల అబ్బాయి ఒక్క ముకుంద కాదు వంద ముకుందలు వచ్చినా కూడా నా ఏసీపీ సర్ ని నన్ను దూరం చేయలేరని కృష్ణ అనగానే మురారి ప్రేమగా హగ్ చేసుకుంటాడు.

మనసు మార్చుకోమని వార్నింగ్ ఇచ్చిన మురారి

ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కావడం లేదు. ఎంత ప్రయత్నించినా ముకుంద మనసు మార్చలేకపోయాము. ఇవన్నీ ఆలోచిస్తుంటే నిజంగానే భయమేస్తుందంటాడు మురారి. ఏం చేయాలో ఒక ప్లాన్ వేసుకున్నాం కదా దాన్ని ఫాలో అవుదాం. వెళ్ళి తనతో మాట్లాడి మీరు ఏం చెప్పాలని అనుకున్నారో అది చెప్పి రమ్మని పంపిస్తుంది. ఏంటి మురారి ఏం చేస్తున్నావని ముకుంద కోపంగా అడుగుతుంది. ఆదర్శ్ ని ఇంట్లో నుంచి బయటకి పంపించేసి మా శోభనం ఆపమంటే మీ శోభనానికి ముహూర్తం పెట్టించుకుని వస్తావా? అంటుంది. అవును నేనే ముహూర్తం పెట్టించా? తప్పేముందని ఎదురుతిరుగుతాడు.

నాకు కోపం తెప్పించకు. ఎప్పటికైనా శోభనం అనేది జరిగితే అది నీకు నాకు మాత్రమే జరగాలి. మన ఇద్దరికీ వేరే వాళ్ళతో కాదని ముకుంద అంటుంది. అర్థం లేకుండా మాట్లాడొద్దని మురారి సీరియస్ అవుతాడు. నన్ను ప్రేమించిన వాడివి నా బాధని అర్థం చేసుకుంటావని నీతో పంచుకుంటే అది తీర్చాల్సింది పోయి నీకు నచ్చినట్టు చేస్తుంటే ఏమనుకోవాలి. నా బాధ నీకు అర్థం అవుతుందా?ఇది బాధ కాదు వెర్రితనం. మనం ఆలోచిస్తున్నామనే దాని వల్ల బాధ, సంతోషం కలుగుతాయి. నీ బాధ పోవాలంటే ముందు నీ ఆలోచనలు మార్చుకుని సంతోషంగా ఉండమని మురారి హెచ్చరిస్తాడు.

దేవ్ తిరిగి వస్తాడా?

ఒకప్పుడు నీ గురించి ఆలోచిస్తే సంతోషం కలిగేది కానీ ఇప్పుడు బాధ మిగులుస్తుంది. అంటే మారిపోయింది నువ్వు ఇప్పుడు మారాల్సింది కూడా నువ్వే. నా మాట విని ఆదర్శ్ ని పంపించేసి మనం ఒకటయ్యే దారి చూడమని చెప్తుంది. మారవా నువ్వు ఎంత చెప్పినా వినవా ఆదర్శ్ ని ఎక్కడికి పంపించమంటావ్? ఇది తన ఇల్లు ఏం తప్పు చేశాడని పంపించాలి. నిన్ను ప్రేమించడం నీతో కలిసి బతకడం తాను చేసిన నేరమా? అని ప్రశ్నిస్తాడు. కలిసి ప్రయాణం చేయాలని అనుకున్నాం కానీ ఇప్పుడు మన దారులు వేరు అయ్యాయి. చాలా దూరం ప్రయాణం చేశాం ఇక తిరిగి వెనక్కి రావడం కుదరదని తేల్చి చెప్పేస్తాడు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను, నువ్వు కూడా నాతోనే ఉన్నాను పరిస్థితులకు తల వంచి రాజీ పడుతున్నవని అంటుంది.

అవును బంధాలకు విలువ ఇచ్చి తలవంచుకుని బతుకుతున్నా నువ్వు కూడా నీ మూడు ముళ్ళ బంధానికి విలువ ఇచ్చి చూడమని చెప్తాడు. చాలు నా ప్రేమని బతికించుకోవాలని చూస్తున్నాను కానీ నీతో పాఠాలు చెప్పించుకోవాలని అనుకోవడం లేదు ఆఖరి సారి అడుగుతున్నా మన శోభనం అపుతున్నావా లేదాని అడుగుతుంది. ఆపనని తేల్చి చెప్పేస్తాడు. అయితే నేనే ఆపేస్తాను పైన దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడని ముకుంద అంటే దేవుడా మీ దేవ్ నా అని అడిగేసరికి ముకుంద షాక్ అవుతుంది. దేవ్ ఏంటి దేవుడు గుడికి వెళ్తున్నాం కదా ఆయనకే మొరపెట్టుకుంటాను ఆయనే తీరుస్తాడని అంటుంది. దేవుడు మంచి కోరికలు తీరుస్తాడు ఇలాంటి అర్థం లేని కోరికలు తీర్చాలంటే మీ దేవ్ అన్న దిగిరావాలని అంటాడు. ఈసారి నువ్వు అనుకున్నవి ఏవి జరగవు నీ మనసు మార్చుకుంటే ఈ ఇంటికి నీకు అందరికీ మంచిదని తెగేసి చెప్తాడు.

మురారి అడుగులో అడుగులు వేసిన ముకుంద

అందరూ కలిసి గుడికి వస్తారు. ఇద్దరి జంటలతో పూజ చేయిస్తున్నాను. మొదటి రాత్రి జరిగే రోజు జంటలతో ప్రత్యేక పూజలు చేయించడం మన ఆచారమని రేవతి చెప్తుంది. భార్యాభర్తలు కలిసి అడుగులు వేస్తారని అంటుంది. మళ్ళీ ఈ చెత్త ఏంటి నేను అడుగులు వేయాలన్న కలిసి బతకాలన్నా అది మురారితోనే అనుకుంటుంది. అందరూ వెళ్తుంటే ముకుంద కావాలని ఆగిపోతుంది. తర్వాత మురారి వేసిన అడుగులో అడుగులు వేసుకుంటూ సంతోషంగా గుడి మెట్లు ఎక్కుతుంది. అది మధు చూస్తాడు. మురారి అడుగులో అడుగు వేయాలని అబద్ధం చెప్పి తప్పించుకుంటావా అని మధు వెంటనే కృష్ణని తీసుకొచ్చి మెట్లు చూపిస్తాడు. ఎండకి కాలి ముద్రలు ఆరిపోయాయని మధు అనుకుని మ్యాటర్ డైవర్ట్ చేస్తాడు. కృష్ణ కాసేపు తనని తిత్తి వెళ్ళిపోతుంది.

మురారి మనసు మార్చి తమని ఒకటి చేయమని ముకుంద దేవుడిని కోరుకుంటుంది. కృష్ణ తనని చూసి ఇది ఎక్కడి న్యాయం స్వామి నా వల్ల కావడం లేదు ఏం చేసినా తన మనసు మార్చలేకపోతున్నాం. నువ్వే ఏదో ఒకటి చేసి తన మనసు మార్చమని కృష్ణ వేడుకుంటుంది. పూజలు చేయించమని రేవతి పూజారిని అడిగితే పొద్దునే చేయించానని ఇంకేమీ అవసరం లేదని చెప్తాడు. దేవుడు తన మొర అలకించాడని ముకుంద అనుకుంటుంది. అన్ని చేపించాను కానీ ఒకటి మిగిలి ఉంది. ఒక్కటి కావాలనుకున్న దంపతులని మరింత దగ్గర చేసే క్రతువు ఉంది. దంపతులు ఇద్దరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు అంటే పక్కన పక్కన ఒకరి పక్కన మరొకరు నడవడం కాదు. భార్యా భర్తకి ఎదురుగా నిలబడి తన పాదాల మీద పాదాలు పెట్టి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలని పంతులు చెప్తాడు. ముకుంద షాక్ అవుతుంది. కృష్ణ తనని గమనిస్తుంది.

Whats_app_banner