Krishna mukunda murari serial march 1st: ముకుంద తిక్క కుదర్చడానికి స్కెచ్ వేసిన కృష్ణ.. ఆదర్శ్ కి నిజం చెప్పేస్తారాా?
Krishna mukunda murari serial march 1st episode: ముకుంద శోభనం ఆపేందుకు కృష్ణ అదిరిపోయే ప్లాన్ వేస్తుంది. మురారి ఇచ్చిన షాక్ కు ముకుందకి ఏం అర్థం కాక తలపట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.
Krishna mukunda murari serial march 1st episode: రిసార్ట్ లో శోభనం తప్పించుకోవడం కోసం కాలు బెణికినట్టు నాటకం ఆడింది. అప్పుడే మీకు చెప్తే ఎక్కడ కంగారుపడతారోనని ఆగాను. తన మనసులో ఏముందో తెలుసుకుని చేప్దామని అనుకున్నాను. కానీఈ ఈలోపు మీ దగ్గరే బయట పడిందని అంటుంది. అప్పుడే టీవీలో ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అమ్మాయి ఆత్మహత్య అనే వార్త వస్తుంది. అది చూసి కృష్ణ కంగారుగా మీరు కూడా ఎక్కడ ముకుంద ఆత్మహత్య చేసుకుంటుందోనని భయపడుతున్నారు కదాని అడుగుతుంది. కాదు ఆ అమ్మాయి లాగా ముకుంద కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతే బాగుండు నాలుగు రోజులు ఏడ్చి మర్చిపోతాము. లేదంటే ఏంటి ఇది మారిపోయిందని అనుకుని వెళ్ళి ఆదర్శ్ తీసుకొచ్చి ఇద్దరినీ కలిపితే ఇప్పుడు మళ్ళీ నాకు నువ్వే కావాలి అంటుందని మురారి చిరాకుగా చెప్తాడు. చావు సమస్యకు పరిష్కారం కాదు అలా ఆలోచించకూడదని కృష్ణ సర్ది చెప్తుంది.
శోభనం ఆపాలని డిసైడ్ అయిన కృష్ణ
ముందు ఈ శోభనం ఆపాలి. కానీ తను ఆపితే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అందుకే మనమే శోభనం ఆపుదామని చెప్తుంది. ఎలా అంటే కృష్ణ ఐడియా అంటూ ఏదో చెప్తుంది. ఆదర్శ్ ముకుంద టిఫిన్ తీసుకొస్తుందని అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటాడు. రేవతి వెళ్ళి ముకుందని అడుగుతుంది. అవును కదా ఆ సంగతి మర్చిపోయానని అనుకుని పిండి పులిసిపోయిందని పని అమ్మాయి బయట పడేసిందని అబద్ధం చెప్తుంది. ఇదేదో ముందే చెప్పవచ్చు కదాని రేవతి తిడుతుంది. సరే అనియన్ దోస ఇవ్వు తింటానని అంటే అది వద్దులే అంటుంది. కృష్ణ వాళ్ళు రాగానే వాళ్ళని వంక పెట్టుకుని టిఫిన్ చేస్తానని తప్పించుకుంటుంది.
ఇద్దరూ ఎక్కడికి వెళ్లారని రేవతి అడుగుతుంది. ఏసీపీ సర్ పంతులు దగ్గరకి వెళ్లారు, ఆయన నాకు ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళాను. శోభనానికి మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని అన్నారు కదా అందుకని తొందర ఎక్కువ కదా ముహూర్తం కనుక్కోవడానికి వెళ్లారని చెప్తుంది. అదేంటి తింగరి ఇన్నాళ్ళూ రెండు జంటలకు శోభనం జరగాలని కదా అనుకుంది. ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ముహూర్తం పెడితే ఏం మాట్లాడలేక ఊరుకున్నారు. ఇన్నాళ్ళూ మన కోసం వాళ్ళు ఆగితే ఇప్పుడు మాకు మాత్రమే శోభనం జరిగిపోతుందని మనసులో లోటు ఉండిపోతుందని మురారి ముకుందని చూస్తూ అవునా కాదాని అడుగుతాడు.
ముకుందకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మురారి
ఆదర్శ్ వచ్చి ఏం జరిగింది ముహూర్తం కుదురిందా అంటాడు. అవును నీకు కుదిరిన ముహూర్తానికి నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నానని మురారి చెప్తాడు. మా శోభనం జరగకుండా ఆపమంటే వీళ్ళు శోభనం ముహూర్తం పెట్టించుకుని వచ్చారా? నేను ఎవరి సొంతం కాకూడదని అనుకుంటున్నానో మురారి కూడా కృష్ణ సొంతం కాకూడదు ఈ శోభనం జరగకూడదని ముకుంద మనసులో అనుకుంటుంది. ఏంటి ముకుంద ఆలోచిస్తున్నావ్ అని ఆదర్శ్ అడిగితే షాక్ అయినట్టు ఉందని కృష్ణ కౌంటర్ వేస్తుంది. ఆశ్చర్యం కాదు అనుమానం ఆ పంతులు దగ్గర కుదరని ముహూర్తం ఈ పంతులు దగ్గర ఎలా కుదిరిందని అడుగుతుంది.
ఇది నీ తిక్క కుదర్చడానికి మేము ఆడుతున్న నాటకమని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఆ పంతులు గోచారం ప్రకారం ముహూర్తం చూశారు అందుకే కుదరలేదు ఈ పంతులు గ్రహచారం ప్రకారం చూశారు ముహూర్తం కుదిరిందని కృష్ణ చెప్తుంది. పంతులు చెప్పాక ఇక కాదనడానికి ఏముంది మీరు తొందరగా రెడీ అవండి రెండు జంటలని గుడికి తీసుకెళ్ళి పూజ చేయించాలని రేవతి చెప్తుంది. శోభనం జరగక ముందే ఏదో జరిగేలా ఉందని మధు డౌట్ పడతాడు. రూమ్ కి వచ్చిన తర్వాత కృష్ణని మురారి మెచ్చుకుంటాడు. నువ్వు ఇచ్చిన ట్విస్ట్ తో ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయాయని అంటాడు. మురారి మళ్ళీ శోభనం గోల మొదలుపెడతాడు. తను చెప్పినట్టు చేయడం జరగదని దీంతో క్లారిటీ వస్తుంది మీతో మాట్లాడాలని ట్రై చేస్తుంది.
ఆదర్శ్ కి నిజం చెప్పాలన్న కృష్ణ
తన ప్రమేయం లేకుండానే తనకి నచ్చినట్టు జరగాలని అనుకుంటుందని కృష్ణ అంటే ఏం చేసినా తను అనుకున్నది జరగదు. ఆదర్శ్ తోనే తన జీవితం అనేసి ఆగిపోతాడు. ముకుంద గురించి ఆలోచిస్తూ ఆదర్శ్ సంగతి మర్చిపోయాము. రిసార్ట్ లో శోభనం ఆగిపోయినట్టు ఇక్కడ ఆగిపోతే ఆదర్శ్ కి అనుమానం వస్తుంది కదా అంటాడు. పరిస్థితి అంతవరకు తీసుకురాకూడదు. ముకుంద ఎలా ప్రవర్తించినా తట్టుకునేలా తనని మనం ప్రిపేర్ చేయాలని అంటుంది. నిజం చెప్తే తట్టుకుంటాడా? ముకుంద మారకుండా మారిందని చెప్పి తన జీవితాన్ని ఎందుకు ఇలా చేశారని అడిగితే ఏం చెప్తాం. మనమేమీ కావాలని చెప్పలేదు కదా. ముకుంద మారుతుందని ఆదర్శ్ కి అర్థం అయ్యేలా చెప్పాలని కృష్ణ ధైర్యంగా చెప్తుంది.
ముకుంద కృష్ణ వాళ్ళ శోభనం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆదర్శ్ వస్తాడు. ముకుంద చిరాకుగా మాట్లాడుతుంది. ఏమైంది అంతా ఒకే కదా పొద్దుటి నుంచి అసహనంగా కనిపిస్తున్నావని ఆదర్శ్ అడుగుతాడు. మురారి ఇచ్చింది మామూలు షాక్ కాదు కదా ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా ఫీలింగ్స్ బయటకి కనిపిస్తున్నాయని అనుకుంటూ అదేం లేదని చెప్తుంది. మనం ఇద్దరం దగ్గర అయ్యే వరకు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారంటే వాళ్ళు మన కోసం ఎంతగా ఆలోచించారో నువ్వు ఆలోచించు. అలాంటిది మనకి ముహూర్తం కుదిరి వాళ్ళకి కుదరలేదంటే ఏదో వెలితిగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ముహూర్తం కుదిరింది హ్యాపీగా ఉందని చెప్తాడు.
నాకు మండిపోతుంది నిన్ను దూరంగా పంపించి నేను మురారికి దగ్గర కావాలని అనుకుంటే తను కృష్ణకి దగ్గర కావాలని అనుకుంటాడా? ఈ శోభనం జరగనివ్వనని అనుకుంటుంది. మురారితో మాట్లాడాలని అనుకుని ఫోన్ చేసి ఆగిపోయి మెసేజ్ చేస్తుంది. గార్డెన్ లోకి రా నీతో మాట్లాడాలని మెసేజ్ చేస్తే అది కృష్ణ చూస్తుంది.
తరువాయి భాగంలో..
రేవతి అందరినీ గుడికి తీసుకెళ్తుంది. మొదటి రాత్రి జరిగే ముందు భార్యాభర్తలతో ఇక్కడ పూజ చేయించడం ఆనవాయితీ భార్యాభర్తలు కలిసి అడుగులు వేయాలని చెప్తుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మురారి అడుగులో అడుగు వేస్తూ ముకుంద సంతోషంగా నడుస్తుంటే అది మధు కృష్ణకి చూపిస్తాడు.