Krishna mukunda murari february 28th episode: ముకుంద మీద చెయ్యెత్తిన మురారి.. ఊహించని ఝలక్ ఇచ్చిన కృష్ణ-krishna mukunda murari serial february 28th episode krishna gets stunned as she discovers mukunda feelings for murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 28th Episode: ముకుంద మీద చెయ్యెత్తిన మురారి.. ఊహించని ఝలక్ ఇచ్చిన కృష్ణ

Krishna mukunda murari february 28th episode: ముకుంద మీద చెయ్యెత్తిన మురారి.. ఊహించని ఝలక్ ఇచ్చిన కృష్ణ

Gunti Soundarya HT Telugu
Feb 28, 2024 04:00 PM IST

Krishna mukunda murari february 28th episode: కృష్ణని పంపించేస్తే మనం ఇద్దరం హ్యాపీగా ఉందామని ముకుంద అనేసరికి మురారి తన మీదకి చేయెత్తుతాడు. నిజం తెలుసుకున్న కృష్ణ అదిరిపోయే ప్లాన్ వేసింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 28వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 28వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial february 28th episode: మురారి ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆదర్శ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు, ముకుంద ఆలోచనలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అసలు తను ఎందుకు ఇలా ఆలోచిస్తుందని అనుకుంటాడు. అటు కృష్ణ కూడా ముకుంద ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శోభనం నిజంగా తప్పించుకోవాలని చూసిందా లేదంటే నేను పొరపాటు పడుతున్నానా? ఇప్పుడు కాఫీ షేర్ చేసుకున్నారు. రోజురోజుకీ అనుమానం పెరిగిపోతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా సెట్ రైట్ చేయాలని అనుకుంటుంది.

కృష్ణ మీద అరిచిన మురారి 

కృష్ణ గదిలోకి వచ్చేసరికి మురారి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేసరికి తను వెళ్ళి చక్కలిగిలి పెడుతుంది. దీంతో గట్టిగా అరుస్తాడు. ఏంటి నీ పిచ్చి పనులు, నీ పిచ్చి చేష్టలు మానవా అని అరిచేస్తాడు. కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎందుకు అంత సీరియస్ అయ్యారని అడుగుతుంది. ఏదో ఆలోచిస్తూ అరిచాను ఐయామ్ సోరి అంటాడు. ఏంటి సీరియస్ గా ఆలోచిస్తున్నారని నిలదీస్తుంది. ఇంతకముందు ఇలాగే ఆలోచనలోకే వెళ్లారు, డిస్ట్రబ్ చేస్తే ఇలాగే అరిచారు మళ్ళీ అలాగే చేస్తున్నారని అంటే మళ్ళీ ఏదో అని అంటుంటే అదేం లేదని కవర్ చేస్తాడు. శోభనం గురించి ఆలోచిస్తున్నానని అంటున్నాడు. ముకుంద ఆలోచన గురించి చెప్తే డిస్ట్రబ్ అవుతారని కృష్ణ మనసులో అనుకుంటుంది.

శోభనం గురించి అయితే నా కొంగు పట్టుకుని తిరుగుతారు కానీ ఇలా సీరియస్ గా ఆలోచిస్తారా అని గట్టిగా నిలదీస్తుంది. టిఫిన్ గురించి ఆలోచిస్తున్నా నాకు ఇష్టమైన ఉల్లిపాయ దోస పెట్టావా అని అడుగుతాడు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను నువ్వు చక్కలిగిలి పెట్టావని అంటాడు. రేపు చేస్తానని చెప్తుంది. ముకుందని ఎలా హ్యాండిల్ చేయాలి ఇది ఇంట్లో తెలిసి సీరియస్ కాకుండా ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవుతాడు. మధు బయటకి వెళ్తున్నాడని తెలిసి ఇంట్లో కార్యక్రమం పెట్టుకుని య్ ఎక్కడికి వెళ్ళేదని చీవాట్లు పెడుతుంది. అయినా జరగని వాటి గురించి ఆలోచించడం ఎందుకు? ముకుంద పాల గ్లాసు పట్టుకుని శోభనం గదిలోకి వెళ్తుందని అనుకుంటున్నారా? అసలు జరగదని అంటాడు.

ముకుందకి టెస్ట్ పెట్టిన కృష్ణ 

మధు మాటలతో రేవతి కంగారు పెరుగుతుంది. ముహూర్తం పెట్టేటప్పుడు తన మొహం చూడలేదా తర్వాత ఏదైనా షాక్ ఇస్తే మీరు తట్టుకోలేరని అనేసి వెళ్ళిపోతాడు. ముకుంద మురారితో రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ వేస్తుంది. కృష్ణ అది చూసి పొద్దుపొద్దునే ఏంటి ఇంత హుషారుగా ఉంది, ఖచ్చితంగా ఇది శోభనం గురించి అయితే కాదు. ఇంకేదో విషయం ఉంది ముకుంద మారిపోయిందని అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది ఏంటి? అసలు ఆదర్శ్ అంటే ఇష్టం లేదా లేదంటే ఇంకా మురారి మీద ఇష్టం పోలేదా తేల్చుకోవాలని కృష్ణ అనుకుంటుంది.

ముకుంద ఊహల్లో డాన్స్ చేస్తూ ఊగుతూ ఉంటుంది. కృష్ణ వచ్చి తనని పిలుస్తుంది. వెంటనే ఊహలో నుంచి బయటకి వచ్చేస్తుంది. నిజ జీవితంలోనే కాదు ఊహాలో కూడా మురారి నా పక్కన ఉండకుండా చేస్తున్నావని ముకుంద తిట్టుకుంటుంది. తనకి కాస్త బద్ధకంగా ఉందని బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయమని కృష్ణ అడుగుతుంది. ముకుంద హుషారుగా చేస్తానని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఏసీపీ సర్ కి ఇష్టమైన ఉల్లిపాయ దోస వేస్తే ఆయన అంటే ఇంకా ఇష్టం ఉన్నట్టు, ఆదర్శ్ కి ఇష్టమైన ఉప్మా పెసరట్టు వేస్తే నువ్వు మారినట్టు, శోభనం జరగడం కూడా ఇష్టం ఉన్నట్టని కృష్ణ మనసులో అనుకుంటుంది. కృష్ణ దీర్ఘ ఆలోచనలో ఉంటే మురారి వచ్చి కదిలించి ఏంటి సీరియస్ గా ఆలోచిస్తున్నావని అడుగుతాడు.

ముకుంద నిజస్వరూపం తెలుసుకున్న కృష్ణ 

ముకుంద, ఆదర్శ్ శోభనం గురించని అంటుంది. కాసేపు ఇద్దరూ దోస, శోభనం అనుకుంటూ సోది పెడతారు. ఈపూట టిఫిన్ ముకుంద చేస్తుందని చెప్పడంతో మురారి సీరియస్ గా తనని ఎందుకు చేయమన్నావని అంటాడు. ముకుంద ఎలాగైనా తనకి ఇష్టమైన ఉల్లిపాయ దోస వేయకుండా ఆపాలని మురారి అనుకుని కిచెన్ లోకి వెళతాడు. ఎవరూ లేరనుకుని ముకుంద మామూలుగా మాట్లాడుతుంది. ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు శోభనం ఆపేస్తున్నావ్ కదా. ఆదర్శ్ ని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావ్ కదా అని అడుగుతుంది. వాళ్ళ మాటలు కృష్ణ వింటుంది.

నీకు ఉల్లిపాయ దోస అంటే ఇష్టం కదా ఈరోజు నాకు వేసే ఛాన్స్ వచ్చింది. దాంట్లో మన ప్రేమని కలిపి మరింత ఇష్టంగా చేస్తున్నానని చెప్తుంది. నువ్వు వేయాల్సిన పని లేదు వెళ్లిపొమ్మని చెప్తాడు. నువ్వు ఎప్పుడు ఇంతే నీ ఇష్టం ప్రకారం ఆదర్శ్ ని పెళ్లి చేసుకున్నాను. అదే నా ఇష్ట ప్రకారం మనం పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాట్లు పడే అవకాశం వచ్చేది కాదు కదా. ప్రతిరోజు నీకు నా చేతులతో తినిపించేదాన్ని కదాని అంటే తన చేతిని మురారి తోసేస్తాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ శోభనం ఆపి ఆదర్శ్ ని పంపించేయి, కృష్ణకి ఎలాగూ సర్ది చెప్పి మనం ఒకటి అయిపోదామని అనేసరికి మురారి నోర్ముయ్ అని చెయ్యి ఎత్తుతాడు.

ముకుంద మీద చెయ్యి ఎత్తిన మురారి 

పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. కొట్టు మురారి నామీద చెయ్యి చేసుకునే అధికారం నీకు కాకుండా ఎవరికి ఉంటుంది. నువ్వు మారావు అనుకుని పొరపాటుపడ్డాను కానీ నువ్వు ఇంత కూడా మారలేదు. నేను మారలేదు మురారి నేను మారానని ఎప్పుడు చెప్పాను. నీమీద ఇష్టం, ప్రేమ మారలేదు. జస్ట్ మౌనంగా ఉన్నాను. నువ్వు నా ముందు ఉంటే చాలని అనుకుని నీమీద ప్రేమని గుండెల్లో దాచుకున్నాను. కానీ ఈ మౌనం నన్ను మరొక మనిషికి దగ్గర చేసి నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తుందంటే అది నా వల్ల కాదు. ఈ మౌనం వీడుతున్నా నాకు నచ్చింది జరగాలని డిమాండ్ చేస్తున్నాను.

తప్పు చేస్తున్నావ్ ముకుంద, ఈ కుటుంబం నీ చుట్టూ ఉన్న జీవితాలు ఏమవుతాయో ఆలోచించకుండా తప్పు చేస్తున్నావ్. నేనేం తప్పు చేయడం లేదు మురారి. ప్లీజ్ తప్పు చేస్తున్నా అనొద్దు. నా ప్రేమ కోసం పోరాటం చేస్తున్నా, నా ప్రేమ బతికించుకోవడానికి ఆరాట పడుతున్నా. ఇంత చెప్తున్నా అర్థం కావడం లేదా? నేను ఏ తప్పు చేయడం లేదు. ఇప్పుడు నేను ఉల్లిపాయ దోస వేస్తే నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానని తెలిసిపోతుందని అనుకుంటున్నావా? తెలియనివ్వు ఈరోజు కాకపోతే రేపు అయినా తెలియాలి కదా.

తరువాయి భాగంలో..

ఇన్నాళ్ళూ మా శోభనం కోసం వీళ్ళు శోభనం ఆపుకున్నారు. ఇప్పుడు మాకు జరుగుతుంది కానీ మీకు జరగడం లేదు కదాని ఆలోచిస్తున్నావ్ కదా ముకుంద అని మురారి అడుగుతాడు. నీకు కుదిరిన ముహూర్తానికి నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేయించుకున్నాను. అంటే నువ్వు సూపర్ అని ఆదర్శ్ ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే న్యూస్ చెప్పావని అంటాడు. ఆ పంతులు దగ్గర కుదరని ముహూర్తం ఈ పంతులు దగ్గర ఎలా కుదిరిందని నా అనుమానమని ముకుంద అడుగుతుంది. ఆయన గోచారం ప్రకారం చూశారు అది కుదరలేదు ఈ పంతులు గ్రహచారం ప్రకారం చూశారని కృష్ణ చెప్తుంది. పంతులు చెప్పాక ఇక ఆలోచించేది ఏముందని రేవతి అంటుంది. ఇది నీ తిక్క కుదర్చడానికి మేము ఆడుతున్న నాటకమని కృష్ణ మనసులో అనుకుంటుంది.

Whats_app_banner