Garlic Pepper Rice : గార్లిక్‌ పెప్పర్‌ రైస్‌.. రెండు నిమిషాల్లో టిఫిన్‌ రెడీ-how to make garlic pepper rice in 2 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Garlic Pepper Rice : గార్లిక్‌ పెప్పర్‌ రైస్‌.. రెండు నిమిషాల్లో టిఫిన్‌ రెడీ

Garlic Pepper Rice : గార్లిక్‌ పెప్పర్‌ రైస్‌.. రెండు నిమిషాల్లో టిఫిన్‌ రెడీ

Anand Sai HT Telugu
Jan 15, 2024 06:30 AM IST

Garlic Pepper Rice In Telugu : ఎప్పుడూ ఒకేలాగా తినేవారు.. కొన్నిసార్లు కొత్తగా ట్రై చేయండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి గార్లిక్ పెప్పర్ రైస్ తయారు చేయండి. ఆరోగ్యానికి మంచిది.

గార్లిక్ పెప్పర్ రైస్
గార్లిక్ పెప్పర్ రైస్ (Unsplash)

ఉల్లి, వెలుల్లి ఆరోగ్యాన్ని కాపాడానికి సైనికుల్లా ముందుంటాయి. వెల్లుల్లిలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వంటల్లో వెలుల్లిని ఎంత వాడినా తప్పులేదని పెద్దలు చెబుతుంటారు. తాలింపుల్లో వెలుల్లి వేస్తే ఆ వాసనకే ఆకలి రెట్టింపు అవుతుంది. ఈరోజు వెల్లుల్లితో గార్లిక్‌ పెప్పర్‌ రైస్‌ ఎలా చేయాలో తెలుసుకుందాం.

మంచి ఆహారమే ఔషధం అంటారు. అది నిరూపించే వంటకం గార్లిక్ పెప్పర్ రైస్. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇది సులభమైన, రుచికరమైన వంటకం. ఈ గార్లిక్ పెప్పర్ రైస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడే వారికి ఇది ఉత్తమమైన ఆహారం. ఇంట్లో లభించే కొద్దిపాటి పదార్థాలతో ఈ రైస్‌ను నిమిషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు.

గార్లిక్‌ పెప్పర్‌ రైస్‌కు కావల్సినవి :

అన్నం - 2 కప్పులు

ఉల్లిపాయలు - 1/2 కప్పు

నూనె - 2 చెంచాలు

ఆవాలు - 1 చెంచా

శెనగలు - 1 చెంచా

ఎండు మిర్చి - 2 జీడిపప్పు - 10

లవంగాలు- 10

మిరియాలు - 1/2 tsp ఉప్పు

ఉప్పు - 1/2 tsp

మెంతులు - 1/2 చెంచా

గార్లిక్‌ పెప్పర్‌ రైస్‌ తయారు చేసే విధానం

ముందుగా బాణలిలో నూనె వేయాలి. తర్వాత వేడి నూనెలో ఆవాలు, ఎండు మిర్చి, శనగపప్పు, జీడిపప్పు వేసి వేయించాలి.

వెల్లుల్లిని పొట్టు తీసి సన్నగా తరిగి పాన్‌లో వేసి కరకరలాడే వరకు వేయించాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత అవసరమైన మొత్తంలో ఉప్పు వేయాలి. ఇప్పుడు అందులో వండిన బియ్యం వేసి మిరియాలు వేయాలి. అన్నం వేడెక్కే వరకు ఉంచి దింపేయండి. అంతే రుచికరమైన గార్లిక్ పెప్పర్ రైస్ రెడీ.

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లిలో కేలరీలు తక్కువ, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.

వెల్లుల్లి మీ కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది.

Whats_app_banner