చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు.. ఆయా కార్డులు అందించే రివార్డులు, ప్రయోజనాలను పరిశీలించిన తరువతనే వాటి కోసం అప్లై చేస్తారు. వినియోగదారులు ఎక్కువగా తమ క్రెడిట్ కార్డు ఖర్చులపై ఈ రివార్డులను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. ఇటీవల క్రెడిట్ కార్డు యూజర్లు క్రెడిట్ కార్డ్ చర్నింగ్ అనే టెక్నిక్ తో భారీగా రివార్డులు పొందుతున్నారు.
క్రెడిట్ కార్డ్ చర్నింగ్ అనేది క్రెడిట్ కార్డులు అందించే రివార్డులు, బోనస్ లు, ఇతర ఆఫర్లను పూర్తిగా ఉపయోగించుకునే ఒక వ్యూహం. ఇందులో వ్యూహాత్మకంగా క్రెడిట్ కార్డులను తీసుకోవడం, రివార్డులు పొందిన తరువాత వాటిని క్లోజ్ చేయడం చేస్తుంటారు. క్రెడిట్ కార్డు (credit cards) ల ద్వారా ఎక్కువ రివార్డులు సంపాదించడం, డబ్బు ఆదా చేయడం దీని లక్ష్యం. రివార్డులలో బోనస్ లు, పాయింట్లు, క్యాష్ బ్యాక్ లు ఉండవచ్చు. వీటిని ప్రయాణం, భోజనం లేదా షాపింగ్ కోసం రిడీమ్ చేసుకోవచ్చు. ఏదేమైనా, ఇందులో కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. వాటితో డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది.
2. సరైన కార్డు పొందండి
సరైన క్రెడిట్ కార్డులను ఎంచుకున్న తర్వాత, ఆ క్రెడిట్ కార్డు కోసం త్వరగా దరఖాస్తు చేయండి.
3. రివార్డులను అన్ లాక్ చేయండి
చాలా క్రెడిట్ కార్డులు మీరు ప్రయోజనాలను పొందడానికి ఒక పరిమితిని, కనీస ఖర్చు మొత్తం వంటి షరతులను నిర్ధారిస్తాయి. మీ కార్డు ప్రయోజనాలను అన్ లాక్ చేయడానికి ఆ షరతులను నెరవేర్చండి.
4. రివార్డులను ఆస్వాదించండి
మీకు అందిన రివార్డులను మీ అవసరాలకు అనుగుణంగా వినియోగించండి. ఆ తరువాత మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయండి.
5. ఇప్పుడు ప్రక్రియను పునరావృతం చేయండి
ఇక్కడ ముఖ్యమై విషయం ఏమిటంటే, రివార్డుల కోసమో, ఇతర ప్రయోజనాల కోసమో అనవసర ఖర్చులు చేయకండి. మీరు చెల్లించగలం అనుకున్న మొత్తమే ఖర్చు చేయండి. అసవరమైన వాటికే ఖర్చు చేయండి. కార్డు కోసం అప్లై చేసే ముందు, వివిధ రుసుములను పరిగణనలోకి తీసుకోండి. కొన్ని హిడెన్ చార్జెస్ ఉంటాయి. వాటిని గురించి తెలుసుకోండి. అవసరమైతే, ఆ క్రెడిట్ కార్డ్ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్ చేసి రుసుములకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి.
ఎప్పటికప్పుడు మీ అన్ని కార్డులను మళ్లీ మూల్యాంకనం చేయండి. ఇకపై ప్రయోజనకరంగా లేని క్రెడిట్ కార్డు ఖాతాలను మూసివేసి, ఇంకా ఎక్కువ రివార్డులు పొందే వాటితో కొనసాగండి. క్రెడిట్ కార్డుల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.
చాలా క్రెడిట్ కార్డులు వార్షిక రుసుములు, జాయినింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను వసూలు చేస్తాయి, ముఖ్యంగా సైన్-అప్ బోనస్లను అందించేవి. కొన్ని సందర్భాల్లో, ఇతర ఫీజులు చెల్లించడం వల్ల సైన్-అప్ బోనస్ పొందడం అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.
2. క్రెడిట్ స్కోర్
తక్కువ సమయంలో బహుళ క్రెడిట్ కార్డులను తీసుకోవడం, కొన్ని రోజులకే వాటిని క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోరును కొంతకాలం తగ్గుతుంది.
3. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్
క్రెడిట్ కార్డ్ చర్నింగ్ జాగ్రత్తగా చేయకపోతే తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. క్రెడిట్ కార్డ్ చర్నింగ్ కు చాలా అనుభవం, అధ్యయనం, జ్ఞానం అవసరం. అదనంగా, సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం మరింత ఆందోళనలకు దారితీస్తుంది.
5. అతి ఖర్చు
మీ క్రెడిట్ కార్డుల గరిష్ట ప్రయోజనాలను పొందడానికి, మీరు అతిగా ఖర్చు చేయవచ్చు. ఇది మీ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. బోనస్ లు, రివార్డులతో సంబంధం లేకుండా మీ బడ్జెట్ కు అనుగుణంగా ఖర్చు చేయాలని నిర్ధారించుకోండి. తప్పుగా చేస్తే, మీరు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతింటుంది.