అద్భుతమైన ఆఫర్! ఫుడ్ ఆర్డర్ చేయండి- క్యాష్‌బ్యాక్ పొందండి.. ఏడాదికి రూ. 42వేలు ఆదా..!
మీరు స్విగ్గీలో ఎక్కువగా ఫుడ్‌ని ఆర్డర్ చేస్తుంటారా? అయితే ఇది మీకోసమే! స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో మీరు ఫుడ్ ఆర్డర్ చేయడంతో పాటు డబ్బును ఆదా చేసుకోవచ్చు కూడా! పూర్తి వివరాల్లోకి వెళితే..
మీరు ఆన్లైన్లో తరచూ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? పెరిగిపోతున్న ఛార్జీలు చూసి బాధపడుతున్నారా? ఫుడ్ ఆర్డర్ చేసినా, డబ్బు ఆదా అయ్యే మార్గం ఏదైనా ఉందా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో టై-అప్ అయిన దిగ్గజ ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ.. కస్టమర్స్‌కి భారీ ఉరటను ఇచ్చింది! స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో మీరు ఫుడ్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు డబ్బును ఆదా కూడా చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఏడాదికి రూ.42,000 వరకు ఆదా చేసుకోవచ్చు! ఈ కార్డు ఫీచర్లు, ప్రయోజనాలు ఏంటి? అర్హత, ఫీజులు ఏంటి? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఫీచర్లు, ప్రయోజనాలు..
స్విగ్గీ సహకారంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఇది. కార్డు ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది:
1. స్విగ్గీ అప్లికేషన్
10% క్యాష్‌బ్యాక్. ఈ క్యాష్‌బ్యాక్ ఫుడ్ ఆర్డరింగ్, ఇన్‌స్టామార్ట్, డైన్ అవుట్, జీనీలకు వర్తిస్తుంది. స్విగ్గీ లిక్కర్, స్విగ్గీ మినీస్, స్విగ్గీ మనీ వాలెట్ ఖర్చులను మినహాయించారు. 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో ఒక్కో బిల్లింగ్ సైకిల్‌పై రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ కేటగిరీ కింద ఏడాదికి గరిష్టంగా రూ.18,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు!
2. ఆన్లైన్ కొనుగోళ్లు..
5% క్యాష్ బ్యాక్. వీటిలో ఇవి ఉన్నాయి:
- అపారెల్స్
- డిపార్ట్మెంట్ స్టోర్
- ఎలక్ట్రానిక్స్
- వినోదం
- హోమ్ డెకోర్
- ఫార్మసీలు
- పర్సనల్ కేర్
- స్థానిక క్యాబ్‌లు
- ఆన్లైన్ పెట్ స్టోర్స్
- డిస్కౌంట్ స్టోర్లు (ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మీషో, అజియో మొదలైనవి)
పై కేటగిరీల కోసం మర్చంట్ కేటగిరీ కోడ్స్ కింద ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద 5% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. పై కేటగిరీలకు సంబంధించిన ఎంసీసీల జాబితా కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్‌సైట్‌ని చూడండి.
5% క్యాష్ బ్యాక్ ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు రూ. 1,500 పరిమితిని కలిగి ఉంది. ఈ కేటగిరీ కింద ఏడాదికి గరిష్టంగా రూ.18,000 క్యాష్ బ్యాక్ పొందొచ్చు!
3. ఇతర కేటగిరీలు..
ఇతర ఖర్చులకు 1% క్యాష్‌బ్యాక్ వస్తుంది! ఇంధనం, అద్దె, ఈఎంఐలు, వాలెట్ లోడింగ్, ఆభరణాలు, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై ఖర్చులను ఇందులో మినహాయించారు. 1% క్యాష్‌బ్యాక్‌పై ఒక్కో బిల్లింగ్ సైకిల్‌పై రూ.500 పరిమితి ఉంది. ఈ కేటగిరీ కింద ఏడాదికి గరిష్టంగా రూ.6,000 క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో, మీరు సంవత్సరానికి రూ.42,000 వరకు ఆదా చేయవచ్చు:
- స్విగ్గీ యాప్‌పై 10% క్యాష్ బ్యాక్ ద్వారా రూ.18,000
- ఆన్లైన్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ద్వారా రూ.18,000
- 1% క్యాష్‌బ్యాక్ ద్వారా ఇతర కేటగిరీలపై రూ.6,000
4. కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ మెంబర్ షిప్..
వెల్కమ్ బెనిఫిట్ కింద కార్డుదారుడు కార్డు యాక్టివేషన్‌పై మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని పొందుతాడు! కార్డు యాక్టివేట్ అయిన 2-3 రోజుల్లో స్విగ్గీ యాప్‌లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
స్విగ్గీ వన్ మెంబర్షిప్ ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టామార్ట్, జెనీ మొదలైన వాటి కోసం స్విగ్గీ యాప్‌లో ఉచిత డెలివరీలు, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తుంది.
అర్హత, రుసుము..
21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు కార్డు కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు. నికర నెలసరి ఆదాయం రూ.15,000 కంటే ఎక్కువగా ఉండాలి! 21 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) రూ.6 లక్షలకు మించి ఉండాలి.
కార్డు జాయినింగ్, వార్షిక రుసుము రూ. 500+ పన్నులను కలిగి ఉంటుంది. వార్షికంగా రూ.2,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే వార్షిక రుసుము మాఫీ అవుతుంది!
లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డ్- లిమిటెడ్ ఆఫర్..
ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా, స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును పరిమిత కాలానికి జీవితకాల ఉచిత ప్రాతిపదికన అందిస్తున్నారు. కాబట్టి, ప్రస్తుతం జాయినింగ్ ఫీజు లేదా వార్షిక రుసుము లేదు. అక్టోబర్ 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 మధ్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఫిజికల్ అప్లికేషన్ల ద్వారా చేసిన దరఖాస్తులకు జీవితకాల ఉచిత ఆఫర్ లభిస్తుంది.
సంబంధిత కథనం