Hyderabad : ఫుడ్ డెలివరీ యాప్‌లో చికెన్ ఫ్రై ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే పురుగు!-worms found in fried chicken ordered on food delivery app in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : ఫుడ్ డెలివరీ యాప్‌లో చికెన్ ఫ్రై ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే పురుగు!

Hyderabad : ఫుడ్ డెలివరీ యాప్‌లో చికెన్ ఫ్రై ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే పురుగు!

Basani Shiva Kumar HT Telugu
Nov 04, 2024 11:22 AM IST

Hyderabad : ఉరుకుల పరుగుల జీవితంలో నచ్చినవి వండుకునే టైం ఉండటం లేదు. దీంతో చాలామంది ఫుడ్ డెలివరీ యాప్‌లపై ఆధారపడుతున్నారు. ఆఫర్లు ఉండటంతో ఆసక్తి చూపి.. ఆర్డర్ చేస్తున్నారు. అలానే చికెన్ ఫ్రై తినాలనిపించి ఓ వ్యక్తి ఆర్డర్ చేశారు. అందులో అతనికి చికెన్‌తో పాటు పురుగులు బోనస్‌గా వచ్చాయి.

చికెన్ ఫ్రైలో పురుగులు
చికెన్ ఫ్రైలో పురుగులు

హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి.. అనిరుధ్ అనే వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్‌ ద్వారా చికెన్ ఫ్రై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. పార్సిల డెలివరీ అయ్యింది. ఓపెన్ చేసి తింటుండగా.. అందులో పురుగు వచ్చింది. దీంతో అనిరుధ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే జీహెచ్ఏంసీకి ఫిర్యాదు చేశాడు.

దోశ తింటుండగా..

ఇదే కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇటీవల సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో రాఘవేంద్ర కుమార్ అనే వ్యక్తి దోశ తింటున్నారు. అందులో బొద్దింక వచ్చింది. దీంతో షాక్ అయ్యాడు. బొద్దింక రావటంపై హోటల్ యజమాన్యాన్ని ప్రశ్నించారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. అతను కూడా వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇలా ఎన్నో..

ఈ రెండు ఘటనలే కాదు.. ఇలాంటివి ఎన్నో హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి. ఎన్నో బహిర్గతం కావడం లేదు. అటు అధికారుల చర్యలు కూడా నామమాత్రంగా ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఉన్నాయి. హోటళ్ల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

వదిలేయకండి..

మీరు ఫుడ్ ను రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసినా లేదంటే.. వీధి పక్కన కల్తీ లేదా నాణ్యత తక్కువగా ఉన్న ఫుడ్ అనిపించినా.. వాళ్ల ఖర్మ అని వదిలేయకండి. మీరు చేసే కంప్లైంట్‌తో మిగతా వాళ్లు అలర్ట్ అవుతారు. నాణ్యమైన ఫుడ్ అందిస్తారు. ఇలాంటి విషయాల్లో కొందరు త్వరగా అధికారులను అప్రమత్తం చేయగా, మరికొందరు ఫిర్యాదును ఎలా లేవనెత్తాలో తెలియకుండా ఉంటారు.

ఫుడ్ సేఫ్టీ వీల్స్..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌ని ప్రారంభించింది. దీని ద్వారా ఈజీగా ఫిర్యాదు చేయొచ్చు. ఆహార పదార్థాల కల్తీని అక్కడికక్కడే పరీక్షించేందుకు అవసరమైన సామాగ్రిని వాహనాల్లో అమర్చారు. ఆహారం నాణ్యతను పరిశీలించేందుకు నగరమంతా టీమ్స్ తిరుగుతాయి.

ప్రతి మొబైల్ వ్యాన్‌లో ఎఫ్‌ఎస్‌ఓ, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్ ఉంటారు. ఈ మొబైల్ ల్యాబ్‌లు, 50కి పైగా ఆహార పదార్థాలను పరీక్షిస్తాయి. రోజువారీ వినియోగించే పాలు, నీరు, ఎడిబుల్ ఆయిల్, ఇతర ఆహార పదార్థాలలో కల్తీలను గుర్తించడానికి సాధారణ పరీక్షలను నిర్వహిస్తారు.

ఎవరైనా తమకు వచ్చిన ఆహారం అపరిశుభ్రంగా ఉందని గుర్తిస్తే 040-21111111కు డయల్ చేయండి. దీని ద్వారా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. స్వచ్ఛమైన నీరు సరఫరా చేయకపోవడం, కల్తీ ఆహారం, నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం వంటి ఉల్లంఘనలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Whats_app_banner