తెలుగు న్యూస్ / ఫోటో /
Banned Movies | థియేటర్లలో కనిపించని ఈ నిషేధిత సినిమాలను ఓటీటీల్లో చూడొచ్చు!
ఇండియాలో ఇప్పటి వరకూ కొన్ని సినిమాలపై తీవ్ర వివాదం రేగింది. ఈ మూవీలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. సెన్సార్ బోర్డు వీటి విడుదలకు నో చెప్పింది. కానీ ఇప్పుడీ సినిమాలన్నీ OTTల్లో చూసే వీలుంది.
ఇండియాలో ఇప్పటి వరకూ కొన్ని సినిమాలపై తీవ్ర వివాదం రేగింది. ఈ మూవీలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. సెన్సార్ బోర్డు వీటి విడుదలకు నో చెప్పింది. కానీ ఇప్పుడీ సినిమాలన్నీ OTTల్లో చూసే వీలుంది.
(1 / 10)
ఇప్పుడు OTTలు అశ్లీలానికి వేదికలుగా మారాయి. ఎలాంటి సెన్సార్ కత్తిరింపులు దీనికి వర్తించకపోవడంతో ఇవి నిర్మించే అన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో సెక్స్ ఏరులై పారుతోంది. గతంలో సెన్సార్ బోర్డు మరీ బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని థియేటర్లలో విడుదలకు నిరాకరించిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
(2 / 10)
Un-Freedom: హోమోసెక్సువాలిటీ, ఉగ్రవాదం నేపథ్యంలో ఈ అన్‌ఫ్రీడమ్ సినిమా రూపొందింది. రాజ్ అమిత్ కుమార్ ఈ బోల్డ్ మూవీని తీశారు. అయితే సీబీఎఫ్‌సీ మాత్రం థియేటర్లలో రిలీజ్ కోసం సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడీ మూవీ Netflixలో అందుబాటులో ఉంది. విక్టర్ బంద్యోపాధ్యాయ, ఆదిల్ హుస్సేన్, ప్రీతి గుప్తా లీడ్ రోల్స్‌లో నటించారు.
(3 / 10)
Angry Indian Goddess : ఈ మూవీ రిలీజ్‌కు సెన్సార్ బోర్డు అడ్డుచెప్పలేదు. కానీ చాలా వరకు సీన్లను కత్తిరించాలని స్పష్టం చేసింది. దీనికి మూవీ మేకర్స్ అంగీకరించలేదు. ఈ సినిమాలో కాళీ మాత ఫొటోలను వాడటంపై బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోయినా.. ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది.
(4 / 10)
Fire:దీపా మెహతా తెరకెక్కించిన ఈ సినిమా 1997లో రిలీజైంది. హోమోసెక్సువాలిటీ ప్రధానంగా ఉన్న సినిమా కావడంతో అప్పట్లో పెను దుమారమే రేగింది. పలు హిందూ సంస్థలు సినిమా ప్రదర్శించిన థియేటర్లను ధ్వంసం చేశాయి. దీంతో ఈ మూవీని ఇండియాలో నిషేధించారు. నందితా దాస్, షబానా అజ్మీ నటించిన ఈ మూవీ ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.
(5 / 10)
Water: ఈ సినిమాను కూడా దీపా మెహతానే తెరకెక్కించారు. పితృస్వామ్య వ్యవస్థలో వితంతువులుగా మారిన వారి దుస్థితిపై ఈ సినిమా రూపొందింది. స్వాతంత్ర్యం రాక ముందు వారణాసి ఆశ్రమంలో ఉండే ఓ వితంతువు జీవితకథను తెరకెక్కించారు. ఈ సినిమా వివాదం రేపడంతో రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడీ మూవీని యూట్యూబ్‌లో చూడొచ్చు.
(6 / 10)
LOEV: ఈ సినిమా కూడా స్వలింగ సంపర్కంపై రూపొందింది. సుధాన్షు సరియా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కూడా రిలీజ్‌కు నోచుకోలేదు. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది.
(7 / 10)
Gandu: హద్దులు లేని శృంగారాన్ని స్క్రీన్‌పై విచ్చలవిడిగా చూపించిన ఈ మూవీని కూడా థియేటర్లలో ప్రదర్శించకుండా నిషేధించారు. బెంగాల్‌కు చెందిన డైరెక్టర్ కౌషిక్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కించారు. న్యూయార్క్‌లో జరిగిన సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ఈ మూవీని ప్రదర్శించినా.. ఇండియాలో థియేటర్లలో మాత్రం రిలీజ్ కాలేదు. ఈ మూవీ ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది.
(8 / 10)
Paanch:బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తొలి మూవీ ఇది. ఇప్పటికీ థియేటర్లలో రిలీజ్ కాలేదు. 2003లో ఈ మూవీ తెరకెక్కింది. డ్రగ్స్‌కు బానిసైన వారిపై ఈ సినిమాను రూపొందించారు. డ్రగ్స్, సెక్స్‌ని చాలా బోల్డ్‌గా ఈ మూవీలో చూపించారు. కేకే మీనన్‌లాంటి నటుడు ఇందులో ఉన్నా.. ఇండియాలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ సినిమా చూడొచ్చు.
(9 / 10)
Black Friday: ఇది కూడా అనురాగ్ కశ్యప్ రూపొందించిన సినిమానే. దీనికి కూడా సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. ముంబై పేలుళ్లపై ఈ సినిమా తీశారు. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాకపోయినా.. డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు