
(1 / 6)
హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

(2 / 6)
ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీతో...జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ వాసులను అప్రమత్తం చేశారు. భారీ వర్షం నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. నగరంలో ఈదురుగాలుల గంటకు 41 నుంచి 61 కి.మీ వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలుల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోయే అవకాశం ఉన్నందున నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
(3 / 6)
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్, ఇంకా చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల తాకిడికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విరిగిన చెట్లను డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు.

(4 / 6)
భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఐటీ కారిడార్, బంజారాహిల్స్, ఇతర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసర సేవల కోసం 040-21111111, 9000113667 సంప్రదించాలని చెప్పారు.

(5 / 6)
మరో 2 గంటల పాటు హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

(6 / 6)
రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇతర గ్యాలరీలు