పడుకున్న మనిషి ముక్కులోకి దూరిన బొద్దింక- ఈ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్​ అవుతారు!-cockroach enters sleeping mans nose what happened next will shock you ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పడుకున్న మనిషి ముక్కులోకి దూరిన బొద్దింక- ఈ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్​ అవుతారు!

పడుకున్న మనిషి ముక్కులోకి దూరిన బొద్దింక- ఈ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్​ అవుతారు!

Sharath Chitturi HT Telugu
Sep 08, 2024 10:18 AM IST

Man inhaled cockroach : నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తి పొరపాటున బొద్దింకను ముక్కు ద్వారా లోపలికి పీల్చేశాడు. అది అతని గొంతు లోకి ప్రవేశించింది. శ్వాస, నోటి నుంచి దుర్వాసన మొదలైంది. చైనాలో జరిగిన ఈ ఘటనలో ఆ తర్వాత ఏం జరిగిందంటే..

షాకింగ్​- మనిషి ముక్కులోకి దూరిన బొద్దింక!
షాకింగ్​- మనిషి ముక్కులోకి దూరిన బొద్దింక! (Unsplash)

బొద్దింకను చూస్తేనే చాలా మంది భయపడిపోతుంటారు. అలాంటిది.. బొద్దింక మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే? చైనాలోని ఓ వ్యక్తికి ఇదే జరిగింది! నిద్రుస్తున్న ఆ వ్యక్తి ముక్కులోకి బొద్దింక దూరింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్​కి గురవుతారు.

మనిషి ముక్కులోకి దూరిన బొద్దింక- ఆ తర్వాత..

చైనాలోని హెనాన్ ప్రావిన్స్​లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైకౌ అనే 58ఏళ్ల వ్యక్తి పడుకుని ఉన్న సమయంలో అనుకోకుండా బొద్దింకను ముక్క ద్వారా పీల్చాడు. అది అతడి ముక్కులోకి ప్రవేశించింది. కొంతసేపటికి లోపల ఏదో పాకుతున్నట్టు ఆయనకు అనిపించింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు నొప్పి మొదలైంది. కానీ పట్టించుకోకుండా రోజువారీ పనులు పూర్తి చేశాడు. కానీ ఆ నొప్పి విపరీతంగా పెరిగిపోయింది.

ఇంతకీ ఆ వ్యక్తికి ఏమైంది?

సదరు వ్యక్తి ముక్కు ద్వారా పీల్చిన బొద్దింక అతని గొంతులోకి వెళ్లింది. శ్వాస దుర్వాసన మొదలైంది. మూడు రోజుల తర్వాత కూడా శ్వాస దుర్వాసన వస్తూనే ఉండడంతో పాటు పసుపు కఫం దగ్గడం మొదలైంది. అప్పుడు అతను వైద్యులను సంప్రదించాడు. ఆ వ్యక్తి మొదట హైనాన్ ఆసుపత్రిలోని ఈఎన్​టీ స్పెషలిష్ట్​ని కలిశాడు. ఎగువ శ్వాసనాళాన్ని పరీక్షించినప్పుడు అసాధారణంగా ఏమీ కనిపించలేదు.

మరి డాక్టర్ బొద్దింకను ఎలా కనుగొన్నారు?

అయితే, తన శరీరంలో ఏదో తేడాగా ఉందని రోగికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి తరువాత, అతను ఆసుపత్రిలో శ్వాసకోశ- క్రిటికల్ కేర్ ఫిజీషియన్ డాక్టర్ లిన్ లింగ్​కి దగ్గరికి వెళ్లాడు. అతను ఛాతీకి సిటి స్కాన్ చేశాడు. కుడి దిగువ లోబ్ వెనుక బేసల్ ప్రాంతంలో షాడోలా ఉన్నదాన్ని గుర్తించాడు. అది సాధారణంగా శరీరంలో కనిపించదు. ఏదో బయటి నుంచి వచ్చిందని వైద్యుడికి అర్థమైంది. బ్రోంకోస్కోపీ అనే చికిత్స చేయించుకోవాలని రోగికి సూచించాడు.

ఇదీ చూడండి:- Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు - వీడియో వైరల్

ఘటనపై డాక్టర్ ఏమన్నారంటే..?

డాక్టర్ లిన్ లింగ్ Seehua.com మాట్లాడుతూ, “మరుసటి రోజు ఆపరేషన్ సమయంలో, శ్వాసనాళంలో రెక్కలతో ఏదో స్పష్టంగా చూశాను. దానికి చాలా కఫంతో చుట్టి ఉంది. చుట్టుపక్కల ఉన్న కఫాన్ని తొలగించిన తర్వాత, అది బహిర్గతమైంది. అది బొద్దింక అని తేలింది. అదే సమయంలో బొద్దింక చుట్టూ ఉన్న స్రావాలు పూర్తిగా శుభ్రపడే వరకు పదేపదే కడిగాము. శస్త్రచికిత్స తర్వాత, రోగి చాలా రిలాక్స్ అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. దగ్గు, పసుపు కఫం తగ్గాయని, ఇంకా కొంచెం దుర్వాసన వస్తోందన్నాడు,” అని చెప్పాడు.

మనిషి ముక్కులోకి బొద్దింక దూరింది అన్న వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ కథ విన్న వారందరు షాక్​కి గురవుతున్నారు. కొందరు భయపడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బొద్దింకలను ఇంట్లో ఉండనివ్వకూడదని, ఎప్పటికప్పుడు క్లీనింగ్​ చేయించుకోవాలని అంటున్నారు.

మరి ఈ ఘటనపై మీ స్పందన ఏంటి? మీ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా?

సంబంధిత కథనం