రన్నింగ్ నోస్ లేదా రైనోరియా వర్షాకాలం సర్వసాధారణంగా కలిగే ఆరోగ్య సమస్య. జలుబు ప్రారంభానికి ముందు ముక్కు కారడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. రన్నింగ్ నోస్ ను 7 ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
విశ్రాంతి- తగినంత విశ్రాంతి మీ శరీరం జలుబు, ఫ్లూ లేదా అలర్జీతో కలిగే ముక్కు కారడాన్ని ఎదుర్కోవడంపై తన శక్తిని కేంద్రీకరిస్తుంది. తగినంత విశ్రాంతి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి రికవరీని వేగవంతం చేస్తుంది.
pexels
నీరు ఎక్కువగా తాగాలి- హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల శ్లేష్మం పలచబడుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ముక్కు భాగాలను తేమగా ఉంచుతుంది. ఇది చికాకు నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
pexels
ఆవిరి పట్టండి - ఆవిరి పీల్చడం వల్ల రన్నింగ్ నోస్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. మరిగించిన నీళ్లలో యూకలిప్టస్ లేదా పెప్పర్ మింట్ కొన్ని చుక్కలు వేసి ఆవిరి పీల్చితే ముక్క కారడాన్ని కాస్త నివారిస్తుంది.
pexels
హెర్బల్ టీ -చమోమిలే, అల్లం లేదా పెప్పర్ మింట్ వంటి హెర్బల్ టీలు గొంతు, ముక్కు భాగాలకు ఉపశమనం కల్పి్స్తాయి. అవి హైడ్రేటెడ్‌గా ఉండేందుకు సహాయపడతాయి. హెర్బల్ టీలో రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి.
pexels
హాట్ షవర్ - ముక్కు కారటం నుంచి మీకు త్వరగా ఉపశమనం కావాలంటే వేడి నీటితో స్నానం చేయండి. వెచ్చని, తేమ కలిగిన గాలి మ్యూకస్ పల్చబడేలా చేసి తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తుంది.
pexels
హ్యూమిడిఫైయర్- హ్యూమిడిఫైయర్‌తో గాలికి తేమను జోడించడం వలన మీ ముక్కు భాగాలు తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది చికాకును తగ్గిస్తుంది.
pexels
నాసల్ స్ప్రే - నాసల్ స్ప్రేలు అలెర్జీ కారకాలను, శ్లేష్మాన్ని శుభ్రచేయడానికి సహాయపడతాయి. నాసల్ స్ప్రేని ఉపయోగించడం వలన ముక్కు కారటం నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.
pexels
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.