తెలుగు న్యూస్ / ఫోటో /
AP Heavy Rains : ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- AP Heavy Rains : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో.. మూడు జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.

(1 / 5)
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు నెల్లూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుంది.
(2 / 5)
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. బుధవారం తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాతి 2 రోజుల్లో ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ.. శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది.
(3 / 5)
దీని ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర,రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, గురు, శుక్ర, శని వారాల్లో (28-30తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది.
(4 / 5)
భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
(5 / 5)
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీ వర్షాలు, సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు