Dhana trayodashi: రేపే ధన త్రయోదశి- పూజకు శుభ సమయం, షాపింగ్ చేసేందుకు ఉత్తమ సమయం తెలుసుకోండి-tomorrow dhana trayodashi auspicious time to shopping and puja ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhana Trayodashi: రేపే ధన త్రయోదశి- పూజకు శుభ సమయం, షాపింగ్ చేసేందుకు ఉత్తమ సమయం తెలుసుకోండి

Dhana trayodashi: రేపే ధన త్రయోదశి- పూజకు శుభ సమయం, షాపింగ్ చేసేందుకు ఉత్తమ సమయం తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Published Oct 28, 2024 05:51 PM IST

Dhana trayodashi: రేపు ధన త్రయోదశి జరుపుకోనున్నారు. ఈరోజు షాపింగ్ చేసేందుకు శుభ సమయం, పూజ ఏ సమయంలో చేసుకోవాలి. ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి? యమ దీపం ఏ దిశలో పెట్టాలో తెలుసుకుందాం.

రేపే ధన త్రయోదశి
రేపే ధన త్రయోదశి

శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని కోరుకునే ధన్‌తేరాస్‌ను అక్టోబర్ 29న జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, ధన్వంతరిని ప్రత్యేకంగా పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున వెండి, బంగారం, పాత్రలను కొనుగోలు చేయడం వల్ల ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది. 

అక్టోబరు 29న ధన్‌తేరస్‌ నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఈ సంవత్సరం ధన్‌తేరస్‌కు మరింత ప్రాధాన్యత పెరిగింది. ధన్‌తేరస్‌లో మధ్యాహ్నం, సాయంత్రం షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం ఉంది.  పూజ సమయం, అక్టోబర్ 30న ఎప్పుడు షాపింగ్ చేయాలో తెలుసుకుందాం. 

ధన త్రయోదశికి శుభ యోగం

ఈసారి ధన త్రయోదశి పండుగను అక్టోబర్ 29న ఉత్తర ఫాల్గుణి, హస్తా నక్షత్రాలలో జరుపుకుంటారు. ఇది వ్యాపారం, షాపింగ్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున త్రిపుష్కర యోగం కూడా ఏర్పడుతోంది. ఇది ప్రయాణాలకు, షాపింగ్‌కు చాలా శుభప్రదమైనది. త్రిపుష్కర యోగ ప్రభావం కారణంగా ఈ రోజు చేసే కొనుగోళ్లు అనేక రెట్లు ప్రయోజనాలను అందిస్తాయి. ఈ సంవత్సరం సూర్యోదయం తర్వాత ప్రారంభమయ్యే ధన త్రయోదశి నాడు ఇంద్రయోగం, వైధృతి యోగాలు కూడా ఏర్పడుతున్నాయి.

ధన్‌తేరస్‌లో ఏది కొనడం శ్రేయస్కరం

పూర్వం ప్రజలు ధన్‌తేరస్‌లో పాత్రలను కొనుగోలు చేసేవారు. ప్రజలు బంగారం, వెండి వస్తువుల కొనుగోలుతో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ధంతేరస్ రోజున వెండిని కొనుగోలు చేయడం లేదా శుభ సమయంలో దాని ఆభరణాలను ధరించడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుందని నమ్ముతారు.

షాపింగ్ కు అనుకూల సమయం 

సాయంత్రం 6.20 నుండి ధన్‌తేరస్‌లో షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయంగా పండితులు సూచిస్తున్నారు. అక్టోబర్ 29న ధన్‌తేరస్‌లో 11 గంటల తర్వాత కొనుగోలు, అమ్మకానికి అనుకూలమైన సమయం. అదే రోజు సాయంత్రం 6.20 నుంచి 8.15 గంటల వరకు విశేష శుభ ముహూర్తాలు ఉంటాయి. అలాగే అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 1.05 గంటల వరకు కొనుగోలు, అమ్మకం లాభదాయకంగా ఉంటుంది.

ధన త్రయోదశి పూజ శుభ సమయం

త్రయోదశి తిథి ప్రారంభం - అక్టోబర్ 29, 2024 ఉదయం 10:31 గంటలకు

త్రయోదశి తేదీ ముగుస్తుంది - అక్టోబర్ 30, 2024 మధ్యాహ్నం 01:15 గంటలకు

ధన్తేరస్ పూజ ముహూర్తం- 06:31 PM నుండి 08:13 PM వరకు

వ్యవధి - 01 గంట 41 నిమిషాలు

ప్రదోష కాలం - 05:38 PM నుండి 08:13 PM వరకు

వృషభ రాశి - సాయంత్రం 06:31 నుండి 08:27 వరకు

యమ దీపం వెలిగించేందుకు శుభ సమయం 

ధన త్రయోదశి రోజు యముడి పేరుతో దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే అకాల మృత్యు భయం నుంచి ఉపశమనం కలుగుతుందని నమమూవతారు. ఇంటికి దక్షిణ దిశలో నాలుగు ముఖాల యమ దీపం వెలిగించాలి. ఇది వెలిగించేందుకు సాయంత్రం 6.30 గంటల నుంచి 8.12 వరకు మంచి సమయం. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

Whats_app_banner