చలికాలంలో పాలకూరను కచ్చితంగా ఎందుకు తినాలి? కారణాలు ఇవే
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Nov 26, 2024
Hindustan Times Telugu
చలికాలంలో పాలకూరను తప్పకుండా రెగ్యులర్‌గా తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల రిస్క్ ఎక్కువగా ఉండే ఈ కాలంలో పోషకాలు ఎక్కువగా ఈ ఆకుకూరను కచ్చితంగా తినాలి. పాలకూరతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏవంటే..
Photo: Pexels
పాలకూరలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, బీటా కరోటిన్స్ అధికంగా ఉంటాయి. దీంతో ఇవి రెగ్యులర్‌గా తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
Photo: Pexels
రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేసి చలికాలంలో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పాలకూర తగ్గిస్తుంది. రోగాల నుంచి శరీరం బలంగా పోరాడేందుకు తోడ్పాటునందిస్తుంది.
Photo: Pexels
పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియను ఇది మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
పాలకూరలో ఐరన్ పుష్కలం. శరీరంలో రక్తం ఉత్పత్తి మెరుగ్గా అయ్యేలా చేయగలదు. రక్త ప్రసరణకు కూడా మేలు చేస్తుంది. దీనివల్ల అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
Photo: Pexels
పాలకూరలో కెరటోనాయిడ్స్ మెండుగా ఉంటాయి. దీంతో ఇవి రెగ్యులర్‌గా తింటే కళ్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
పాలకూరలో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రణలో ఉండేలా తోడ్పడుతుంది. శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా సహకరిస్తుంది.
Photo: Pexels
ఈ చలికాలంలో ఉల్లిపాయ తింటున్నారా..! వీటిని తెలుసుకోండి