Krishna mukunda murari february 14th: వాలెంటైన్స్ డే రోజు మురారితో డాన్స్ చేసిన ముకుంద.. ఆదర్శ్ కి నిజం చెప్పేస్తుందా?-krishna mukunda murari serial february 14th episodemadhu devises a plant to expose mukunda behaviour to the family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 14th: వాలెంటైన్స్ డే రోజు మురారితో డాన్స్ చేసిన ముకుంద.. ఆదర్శ్ కి నిజం చెప్పేస్తుందా?

Krishna mukunda murari february 14th: వాలెంటైన్స్ డే రోజు మురారితో డాన్స్ చేసిన ముకుంద.. ఆదర్శ్ కి నిజం చెప్పేస్తుందా?

Gunti Soundarya HT Telugu
Feb 14, 2024 07:11 AM IST

Krishna mukunda murari serial february 14th episode: వాలెంటైన్స్ డే రోజు కూడా ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకుంటూ ముకుంద తనతో డాన్స్ చేస్తుంది. ఇక ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుని ఆదర్శ్ తో నిజం చెప్పాలని డిసైడ్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial february 14th episode: వాలెంటైన్స్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆదర్శ్ ఫోటోస్ చూసే ఉంటాడని అందుకే ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడని ముకుంద భయపడుతుంది. ఇంతకీ సర్ ప్రైజ్ ఏంటని నందిని అడుగుతుంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో తమకి కూడా తెలియదని కృష్ణ అనేసరికి అందరూ బిత్తరపోతారు. అవును మాకు కూడ తెలియదు మొత్తం కాన్సెప్ట్ మధు చెప్తాడు అనేసరికి నందిని వాళ్ళు నవ్వుతారు. తన టాలెంట్ చూపించడానిKriకి టైమ్ వచ్చిందని మధు అంటాడు. ముందు కాన్సెప్ట్ ఏంటో చెప్పమని ఆదర్శ్ అంటే ఇప్పుడే చెప్తే ఏముంది అప్పటికప్పుడు చెప్తేనే అసలు నిజాలు బయట పడతాయని ముకుంద వైపు చూస్తూ చెప్తాడు. 

ప్రోగ్రామ్ లో ముందుగా డాన్స్ చేయాలి. ఏ పాటకి డాన్స్ చేస్తారని కృష్ణ వాళ్ళని అడిగితే జలజల పాతం పాట అని చెప్తారు. అయితే ఈ పాటకు ఆదర్శ్, ముకుంద డాన్స్ చేస్తారని మధు చెప్పేసరికి ముకుంద టెన్షన్ పడుతుంది. అదేంటి కృష్ణ వాళ్ళు డాన్స్ చేస్తామని అన్నారు కదా అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే ఏం బాగుంటుంది పక్కన వాళ్ళు చేస్తేనే రొమాంటిక్ గా ఉంటుందని మధు అంటాడు. డాన్స్ అనుకుంటే మళ్ళీ రొమాంటిక్ డాన్స్ చేయాలా అని ముకుంద టెన్షన్ పడుతుంది. ఇప్పుడు తన అసలు రంగు బయట పడిపోతుందని మధు మనసులో అనుకుంటాడు. 

ముకుంద, ఆదర్శ్ డాన్స్ చేస్తారు. డాన్స్ మధ్యలో ఆదర్శ్ గులాబీ పువ్వు హార్ట్ సింబల్ బెలూన్ ఇస్తాడు. తన స్థానంలో మురారిని ఊహించుకుని వాటిని తీసుకుని సంతోషంగా తనతో చేతిని కలుపుతుంది. వాళ్ళని చూసి మధు బిత్తరపోతాడు. ఆదర్శ్ అంటే ఇష్టం లేదు సరిగా డాన్స్ చేయదని అనుకుంటే ఇంత బాగా డాన్స్ చేసింది ఏంటని మధు డౌట్ పడతాడు. నన్ను క్షమించు ఆదర్శ్ నువ్వు నాతో కలిసి డాన్స్ చేశావ్ ఏమో కానీ నేను ప్రతి క్షణం మురారిని తలుచుకుంటూ డాన్స్ చేశానని ముకుంద మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ముకుంద సెలెక్ట్ చేసే సాంగ్ కి కృష్ణ వాళ్ళు డాన్స్ చేస్తారని మధు చెప్తాడు. రొమాంటిక్ సాంగ్ చెప్పకూడదని ముకుంద అనుకుని ఏదో సాడ్ సాంగ్ చెప్తుంది. అది కాదని మధునే పాట సెలెక్ట్ చేస్తాడు. 

ఇక కాన్సెప్ట్ ఏంటో మధు చెప్తాడు. భర్త తాగి ఇంటికి వస్తే భార్య ఎలా స్పందిస్తుందో చేయాలని అంటాడు. మందు తాగినట్టు యాక్ట్ చేయడం కష్టమని మురారి అంటే అంత వద్దు ఇక్కడ మీ గురించి అందరికీ తెలుసులే అని గాలి తీసేస్తాడు. ఇక ముందుగా ముకుంద వాళ్ళని పర్ఫామెన్స్ చేయమని చెప్తాడు. డాన్స్ అంటే ఎలాగో చేశాను ఇప్పుడు ఇది చేస్తే అత్తయ్యకి నామీద ఉన్న అనుమానం పోతుందని ముకుంద మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ తాగి వచ్చినట్టు నటిస్తాడు. ముక్కు బంగారం అని పిలుస్తూ యాక్టింగ్ ఇరగదీస్తాడు. మీకు తాగాలని ఉంటే ఇంట్లోనే తాగమని చెప్పాను కదా మీకోసం ఇంట్లోనే మందు తెచ్చి పెట్టానని ముకుంద అనేసరికి అందరూ షాక్ అవుతారు. 

ఇంత అందంగా ఎలా పుట్టావ్ ముక్కు బంగారం అనేసరికి ఏమ్ కావాలని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఇంట్లో మందు ఉందని అన్నావ్ కదా అది కాస్త ఇస్తావా అంటే మందు ఇచ్చినట్టు తాగినట్టు యాక్ట్ చేస్తారు. తాగుబోతులని ఇలా అర్థం చేసుకునే భార్యలు ఉంటే లోకంలో భార్యాభర్తల మధ్య గొడవలే ఉండవని మధు మెచ్చుకుంటాడు. ఇక మురారి, కృష్ణ వంతు వస్తుంది. మురారి తాగి వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు. మురారి తూలి పడబోతుంటే కృష్ణ పట్టుకున్నట్టే పట్టుకుని చటుక్కున వదిలేస్తుంది. ఇంట్లో నుంచి గెంటేయలేదు సంతోషించమని అంటుంది. అన్నం పెట్టమని అడిగితే తినేశానని చెప్తుంది. ఇద్దరి యాక్టింగ్ చాలా ఫన్నీగా ఉంటుంది. 

ఎవరైనా మొగుడు తాగి వస్తే తిండి పెట్టి పడుకోబెడతారు నువ్వు ఏంటే ఇలా ఉన్నావని అంటాడు. మందు తాగి వస్తే ఇలాగే ఉంటుందని కౌంటర్ వేస్తుంది. మురారి ఆకలేస్తుంది బతిమలాడతాడు కానీ కృష్ణ మాత్రం ఏం కాదులే మీకు బెడ్ రూమ్ లోకి ఎంట్రీ లేదు అనేస్తుంది. ఇలా టార్చర్ పెడితే ఎవడూ జన్మలో మందు తాగడని మురారి అంటాడు. అందరూ సూపర్ గా ఉందని మెచ్చుకుంటారు. ఎవరు బాగా చేశారో డిసైడ్ చేయాల్సింది పెద్ద పెద్దమ్మ అని మధు అంటాడు. చూస్తే భవానీ అక్కడ ఉండదు. 

తరువాయి భాగంలో..

రెండు జంటలు అవుటింగ్ కి బయటకు వెళతారు. థాంక్యూ ముకుంద బాగా ప్లాన్ చేశావని కృష్ణ అంటుంది. ఈ అవుటింగ్ ప్లాన్ చేసింది మీకోసం కాదు నాకోసం ఎలాగైనా ఆదర్శ్ కి నిజం చెప్పాలని అనుకుంటునట్టు ముకుంద మనసులో అనుకుంటుంది. ఇక వెనుక సీట్లో కూర్చున్న మురారి కృష్ణతో సరదాగా ఉండటం చూసి ముకుంద అనవసరంగా వీళ్ళని వెనక కూర్చోబెట్టానని అనుకుంటుంది. 

Whats_app_banner