Krishna mukunda murari december 7th episode: కృష్ణతో మురారీ డాన్స్- నిజం చెప్పేసిన భవానీ, ముకుంద టెన్షన్
Krishna mukunda murari december 7th episode: మురారీ కృష్ణ దగ్గరకి వెళ్ళకుండా చేయాలని భవానీ ప్లాన్ వేస్తుంది. కృష్ణకి పెళ్లి అయిపోయిందని మురారీకి చెప్పడంతో కృష్ణ ముకుందా మురారీ సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
భవానీ ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. ముకుందకి రేవతి పసుపు రాస్తుంటే అటు కృష్ణ ఇంట్లో అందరికీ గంధం పూస్తూ ఉంటుంది. మురారీకి గంధం రాస్తూ తన వైపు బాధగా చూస్తుంది. అది చూసి భవానీ కావాలని మాట మారుస్తుంది. వేణి రాకతో ఇంట్లో పెళ్లి కళ వచ్చిందని రేవతి అనేసరికి భవానీ తనవైపు గుర్రుగా చూస్తుంది.
మురారీ ఒంటరిగా నిలబడి పసుపు దంచే కార్యక్రమ విశిష్టత గురించి చెప్పింది తలుచుకుని సంతోషపడతాడు. డాక్టర్ అయి ఉండి ఇలా ఫార్మాలిటీస్ వెనుక ఉన్న హిస్టరీ చెప్పి భర్తల గురించి ఎంత గొప్పగా చెప్పారు. వేణి గారిని భార్యగా నేను ఊహించుకున్నాను కానీ గతంలో నా ప్రేమ నాకు భవిష్యత్ లేకుండా చేస్తుందని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మధుకర్ వచ్చి పలకరిస్తాడు.
మధుని రీల్స్ చూపించమన్న మురారీ
పసుపు కొట్టే ప్రోగ్రామ్ రీల్స్ చేస్తాను వాటిని అప్ లోడ్ చేస్తే సూపర్ వ్యూస్ వస్తాయని మధు చెప్తాడు. ఆ మాట విని మురారీ ఇది వరకు రీల్స్ చేసేవాడివి కదా అని అడిగేసరికి మధు షాక్ అవుతాడు. సరిగా అప్పుడే కృష్ణ వచ్చి పసుపు కొట్టేది వీడియో తీశావా అని అడుగుతుంది.
రీల్స్ గురించి గుర్తుకు వస్తుంది కదా ఇంకొంచెం గుర్తు వచ్చేలా చేయాలని అనుకుంటుంది కృష్ణ. వీళ్ళని దూరం నుంచి సుమలత టెన్షన్ పడుతుంది. గతంలో చేసిన రీల్స్ చూస్తే మురారీకి కథ మొత్తం అడ్డం తిరుగుతుందని టెన్షన్ పడుతుంది. మురారీ కూడా రీల్స్ చూపించమని అనేసరికి మధు మీరు చెప్పండి వేణి గారు చూపించమంటారా? అని అడుగుతాడు.
మురారీతో డాన్స్ చేసిన కృష్ణ
కృష్ణ కంగారుగా వద్దని చెప్తుంది. సర్ తో ఒక రీల్ చేయమని అంటుంది. అయితే మీరిద్దరూ ఒక పాట రెండు స్టెప్పులు వేయండి వీడియో తీస్తానంటాడు మధు. మంచి అవకాశం కల్పించావని కృష్ణ మనసులో అనుకుంటుంది. మురారీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కృష్ణ డాన్స్ చేస్తుంది.
మధు అటుగా భవానీ వెళ్ళడం చూసి సూపర్ గా వచ్చిందని వీడియోకి కట్ చెప్తాడు. ఏం చేస్తున్నారు అక్కడని భవానీ అడుగుతుంది. మధు రీల్స్ చేస్తున్నాడని మురారీ చెప్తే అవన్నీ తర్వాత అని చెప్పి పిలుస్తుంది.
కృష్ణ పెళ్లి ఆపేస్తుంది
రేవతి సంతోషంగా ఉండటం చూసి ఏమైంది మురారీకి నిజం చెప్పేశావా అని అడుగుతాడు. నేను ఇప్పుడు ఆదర్శవంతురాలైన అక్కకి చెల్లిని కాదు ధైర్యవంతురాలైన కోడలు కృష్ణకి అత్తయ్యని చెప్పి రేవతి మురిసిపోతుంది. కృష్ణ ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపేస్తానని ధైర్యం చెప్తాడు మధు. ఇక కృష్ణకి ముకుంద ఎదురుపడి వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతుంది.
ముకుంద మాటలకి కృష్ణ కౌంటర్
ఏంటి పసుపు కొట్టే దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నావని కోపంగా అడుగుతుంది. అది ఓవర్ యాక్షన్ కాదు రియాక్షన్. ఇప్పుడే ఏం చూశావ్. ముందు ముందు మరింత చూపిస్తాను. ఏంటి భయపడ్డావా? అని కృష్ణ అనేసరికి ముకుంద తనకేమి భయం లేదని కవర్ చేసుకుంటుంది.
నా వెనుక మా అత్తయ్య ఉంది. నీకు ఎవరు ఉన్నారు. మీ చిన్నాన్న జైలులో ఉన్నారని హేళనగా మాట్లాడుతుంది. నా వెనుక ఎవరూ లేరు.. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావే ఆయనే నా బలం, ధైర్యం. ఆదర్శ్ కోసం వెయిట్ చెయ్యి ముకుంద అంటూ దిమ్మతిరిగేలా సమాధానం ఇస్తుంది కృష్ణ.
కృష్ణని వెళ్లిపొమ్మన్న భవానీ
మధు ఇంతక ముందు ఏవో రీల్స్ చేశాడు కదా వాటిని చూపించమంటే చూపించడం లేదని భవానీకి చెప్తాడు. ఆ మాటకి భవానీ షాక్ అవుతుంది. రీల్స్ చూపించమని మురారీ మరోసారి అడిగితే భవానీ అవన్నీ పిచ్చి రీల్స్ వాటిని డిలీట్ చేయమన్నానని కవర్ చేస్తుంది. ఆ మాట విని ముకుంద సంతోషపడుతుంది.
నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం ఉండదు. ఈరోజు పసుపు కొట్టడం రెండు రోజుల్లో మురారీ నా మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది. అదీ లెక్క. ఏసీపీ సర్ అండగా ఉన్నారని ఇందాక అన్నావ్ కదా మా అత్తయ్య మాటకి మురారీ సైలెంట్ అయిపోయాడని అనేసరికి కృష్ణ బాధగా మొహం పెడుతుంది.
వేణి గురించి తెలుసుకోవాలనుకున్న మురారీ
ఫంక్షన్ హాలు చూడటానికి వెళ్తున్నానని భవానీ ఇంట్లో వాళ్ళతో చెప్తుంది. పని అయిపోయింది కదా వేణి ఇంక వెళ్లిపో అనేసరికి మురారీ బాధపడతాడు. ఎందుకు పెద్దమ్మ వేణిగారిని అంత చులకనగా చూస్తుందని మనసులో అనుకుంటాడు.
జైలుకి వెళ్ళి వాళ్ళ చిన్నాన్నతో మాట్లాడితే క్లారిటీ వస్తుందని అనుకుంటాడు. వెళ్తాను మేడమ్ రేపు రాత్రికి కోనేటిలో దీపాలు వదిలే పని ఉంది చిన్న మేడమ్ మీరు వస్తారా? అని కృష్ణ రేవతిని అడుగుతుంది. రారు మేము కూడా వెళ్ళి దీపాలు వదలాలని ముకుంద సీరియస్ గా చెప్పేసరికి కృష్ణ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కృష్ణ ప్లాన్ కి చెక్ పెట్టిన భవానీ
కోనేటిలో దీపాలు ఎందుకు వదులుతారని మురారీ రేవతిని అడుగుతాడు. కార్తీక మాసం కదా అదొక ఆచారమని చెప్తుంది. దీన్ని అవకాశంగా తీసుకుని కృష్ణ వెంట మురారీ పడకుండా చేయాలని భవానీ ప్లాన్ వేస్తుంది.
ఆచారం కాదు అలా వదిలితే భర్త సంతోషంగా ఉంటాడని ఆడవాళ్ళు దీపాలు వదులుతారు. వేణి కూడా తన భర్త కోసం వదులుతుంది అనేసరికి మురారీ షాక్ అవుతాడు. అంటే వేణి గారికి పెళ్లి అయిందా అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గదిలో ఒక్కడే కూర్చుని కృష్ణతో డాన్స్ వేసింది గుర్తు చేసుకుంటాడు. మురారీ తలపట్టుకుని ఉండటం చూసి నందు కంగారుగా ఏమైంది వేణి గారిని పిలవనా అని అంటుంది. వద్దు నేనొకటి అడుగుతాను నిజం చెప్పమని అడుగుతాడు.
వేణి గారికి పెళ్లి అయ్యిందని పెద్దమ్మ చెప్తుంది. కదా భర్త కోసం దీపాలు వదులుతుందని పెద్దమ్మ అంటుంది అదంతా నిజమేనా అని మురారీ ప్రశ్నిస్తాడు.
ఈరాత్రికి దీపాలు వదిలే కోనేటి దగ్గరకి వెళ్ళు. వేణి నిన్ను ఇన్ డైరెక్ట్ గా రమ్మని పిలిచింది. అక్కడికి వెళ్తే నీకే అంతా తెలుస్తుందని నందు బదులిస్తుంది. ఎందుకు పిలిచిందని మురారీ టెన్షన్ పడతాడు.
భయపడుతున్న ముకుంద
ముకుంద భవానీ దగ్గరకి వెళ్ళి తన భయాన్ని చెప్పుకుంటుంది. మీకు ఎలా ఉందో కానీ నాకు చాలా టెన్షన్ గా ఉంది. మొన్న కృష్ణ అని కలవరించాడు. నిన్న రెస్టారెంట్ దగ్గర గొడవ చేశాడు. రేపు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది.
ఒకవేళ మురారీకి గతం గుర్తుకు వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు గతం గుర్తుకు రాలేదని సేఫ్ అనుకుంటున్నాం. గతం గుర్తుకు వస్తే మురారీని ఆపడం ఎవరి వల్ల కాదు. గతం గుర్తు లేకపోయినా కృష్ణకి ఎంత దగ్గరగా ఉంటున్నాడో మీకు తెలుసు. కానీ గతం గుర్తుకు వస్తే ఏంటి పరిస్థితని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. భయపడొద్దని ఏం జరగదని భవానీ ధైర్యం చెప్తుంది.