Krishna mukunda murari february 12th: మురారి పెట్టిన ఉంగరం పోగొట్టుకున్న కృష్ణ.. ముకుంద నాటకం ఆదర్శ్ కి తెలిసిపోతుందా?
Krishna mukunda murari serial today febrary 12th: మురారి తన వేలికి పెట్టిన ఉంగరం కృష్ణ పోగొట్టుకుంటుంది. దీంతో తన ప్రేమ మీద మళ్ళీ ఆశలు పెట్టుకోవచ్చా అని ముకుంద ఆలోచనలో పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial today february 12th episode: మురారి వాళ్ళు తాగారో లేదో తెలుసుకోవడానికి కృష్ణ ట్రై చేస్తుంది. తప్పించుకోవడం కోసం మురారి తిక్క తిక్క వేషాలు వేస్తాడు. గాలి ఊదమని అంటే మురారి లోపలికి పీల్చుకుంటాడు. మధు వస్తే తెలిసిపోతుందని నందిని అంటుంది. మధు రాలేని పరిస్థితిలో ఉన్నాడని వాలెంటైన్స్ డే పనుల మీద పంపించామని అబద్దం చెప్తాడు. వాలెంటైన్స్ డే కాన్సెప్ట్ ఏంటి? ఎవరు పార్టిసిపెట్ చేస్తున్నారని ముకుంద అడుగుతుంది. కాన్సెప్ట్ సర్ ప్రైజ్, రేపటి వరకు ఓపిక పట్టాల్సిందే. మేము ఇచ్చే సర్ ప్రైజ్ కి మీరందరూ థ్రిల్ అవుతారని కృష్ణ అంటుంది. దీంతో ముకుంద టెన్షన్ పడుతుంది.
కృష్ణ సర్ ప్రైజ్.. ముకుంద షాక్
ముకుంద నువ్వేం టెన్షన్ పడకు రేపు మేము ఇచ్చే సర్ ప్రైజ్ మీ ప్రేమకు పరీక్ష అనుకో అందులో మీరిద్దరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని కృష్ణ అంటుంది. అది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ మీకే ఫస్ట్ ప్రైజ్ రావచ్చు ఏమో కదా అని రేవతి అంటుంది. మాది ఏముంది పాత జంట ముకుంద వాళ్ళది కొత్త జంట. వాళ్ళ ప్రేమకి, అన్యోన్యతకి పెద్దత్తయ్య ఫ్లాట్ అయిపోతుందని కృష్ణ చెప్తుంది. ముకుంద గదికి వచ్చి సర్ ప్రైజ్ ఏముంటుందా అని ఆలోచనలోపడుతుంది. సర్ ప్రైజ్ అంటుంది మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో, ఎందులో ఇరికిస్తుందో. ప్రేమకి పరీక్ష అంటుంది అంటే ఆదర్శ్ తో క్లోజ్ గా ఉండాలి. ఇందులో నుంచి ఎలాగైన తప్పించుకోవాలి. కృష్ణ ఏం చేయబోతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ వస్తే కృష్ణ ప్లాన్ చేసిన సర్ ప్రైజ్ ఏంటో తెలుసా అని అడుగుతుంది.
మురారి ఏం చెప్పలేదా అని అంటాడు. మురారిని అడిగితే సస్పెన్స్ అంటున్నాడు. అయినా అదేంటో రేపు ఫంక్షన్లో తెలిసిపోతుంది కదా ఇంకెందుకు టెన్షన్ అంటాడు. టెన్షన్ ఏం లేదు తెలిస్తే ప్రిపేర్ అవ్వచ్చు కదాని కవర్ చేస్తుంది. మనమే గెలుస్తామని కృష్ణ అంటుంది కదా తనకి మన మీద ఉన్న నమ్మకం మనకి మన మీద ఉండకపోతే ఎలా? నీమీద నాకు అంతులేని ప్రేమ ఉంది. నీకు కూడా నా మీద ప్రేమ ఉంది అది ఈరోజు తెలిసింది కదా. మన మధ్య ఉన్న ప్రేమ నిజమైతే అదే మనలని గెలిపిస్తుందని చెప్తాడు. ఆ ప్రేమ నిజమయితే కదా గెలవడానికి కాదు కాబట్టి ఒడిపోతాం, అప్పుడు ఇంట్లో అందరికీ నామీద అనుమానం వచ్చేస్తుంది య్ ఏం చేయాలని ఆలోచనలో పడుతుంది.
మన ప్రేమ నిజమైందే కదాని అడిగిన ఆదర్శ్
ఏం ఆలోచిస్తున్నావ్ ముకుంద మన ప్రేమ నిజం అయినప్పుడు మన ప్రేమ మనల్ని గెలిపిస్తుందా లేదాని ఆదర్శ్ అడిగితే ఊ అని తలాడిస్తుంది. ఏం జరిగినా ఫేస్ చేయాల్సిందే తప్పించుకునే దారి లేదు. ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకోవడమేనని ముకుంద అనుకుంటుంది. మురారి చాప నేల మీద వేసుకుని పడుకోబోతుంటే కృష్ణ వచ్చి వద్దని సీరియస్ అవుతుంది. తనని రెచ్చగొట్టదని కాసేపు బిల్డప్ ఇచ్చి మురారి కాళ్ళ మీద పడుతుంది.
తింగరి ఇలా భయపెట్టేస్తావ్ ఏంటని చెప్పి తనని హగ్ చేసుకుంటాడు. ఇంట్లో అందరూ ఫోన్లు చూసుకుంటూ ఉంటుంటే మధు వస్తాడు. వాలెంటైన్స్ డే కదా సెలెబ్రేషన్స్ ఉన్నాయన్నారు కనీసం ఆ సందడి లేదు కనీసం ఒకరికొకరు ఐలవ్యూ అయినా చెప్పుకున్నారా అని అడుగుతాడు. కృష్ణ కాఫీ పట్టుకుని వస్తుంది. అన్నీ నీకు చెప్పే చేస్తారా అంటుంది.
కృష్ణ రింగ్ మిస్.. ముకుందలో చిగురించిన ఆశలు
నందిని కృష్ణ చేతిని చూసి రింగ్ ఏదని అడుగుతుంది. తన చేతికి రింగ్ లేకపోవడం గమనించుకున్న కృష్ణ భయపడుతుంది. చివరి సారిగా ఎప్పుడు చేతికి చూసుకున్నావని ముకుం అడుగుతుంది. పొద్దున చూసుకున్నప్పుడు ఉన్నాను ఉంది ముగ్గు వేశాను ఆ తర్వాత ఏ పని చేయలేదని అంటుంది. అక్కడే జారిపోయి ఉంటుంది వెళ్ళి చూడమని రేవతి చెప్తుంది. కృష్ణ కంగారుగా వెతుకుతుంది. అటు ఇంట్లో వాళ్ళు కూడా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. రింగ్ దొరకలేదని అంటుంది. గది మొత్తం వెతికినా కూడా కనిపించదు. ఎలా మిస్ అయ్యిందో అర్థం కావడం లేదని ఏడుస్తుంది. చూసుకోవాలి కదా అది అన్నయ్య ప్రేమగా తొడిగిన రింగ్ వాలెంటైన్స్ డే రోజు పోయిందంటే ఎంత బాధగా ఉంటుందని నందిని అంటుంటే కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
కొంచెం లూజ్ గా ఉండి ఎక్కడో జారి పడిపోయి ఉంటుందని మురారి అంటాడు. మురారికి కృష్ణ వేలికి తొడగమని నేనే కదా ఇచ్చాను. అది ప్రేమికుల రోజు చేజారిపోయిందని అంటే నేను నా ప్రేమ మీద ఆశలు పెంచుకోవచ్చని అర్థమా? మురారి కృష్ణకి చెందిన వాడు కాదు నావాడు అని అనుకోవాలా? ఛీ ఛీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయ్ ఏంటి. కృష్ణకి నావల్ల అన్యాయం జరగకూడదని ముకుంద అనుకుంటుంది. కావాలంటే అలాంటి రింగ్ మళ్ళీ కొంటానని మురారి అంటాడు. నువ్వు డల్ గా ఉంటే ఇంట్లో సందడి ఉండదని ముకుంద అంటుంది. అయితే ఈవెంట్ క్యాన్సిల్ చేద్దామని అంటే వద్దని చెప్తుంది. డెకరేషన్ వాళ్ళు వస్తారు. ముకుంద లాస్ట్ వాలెంటైన్స్ డే ఎంత బాగా జరిగింది, మురారి ఫోటో ఒకటి తీసుకోవాలి మళ్ళీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఏమోనని మురారికి తెలియకుండా తనతో సెల్ఫీ తీసుకుంటుంది.
తరువాయి భాగంలో..
కృష్ణ, మురారి వాలెంటైన్స్ డే ఏర్పాటు చూసుకుంటూ ఉంటారు. ఆదర్శ్ తన గదిలో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేస్తే అందులో మురారి, ముకుంద కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. మరొక ఫోటోలో మురారి, ఆదర్శ్ ఉంటే ఆదర్శ్ మొహం కనిపించకుండా మడత పెట్టి ఉంటుంది. అది ఆదర్శ్ చూసేస్తాడు. ముకుందకి ఫోటోలు ఉన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే పరుగున వెళ్తుంది. ఈ ఫోటోలో నేను ఉన్న పార్ట్ మాత్రమే ఎందుకు మడత పెట్టి ఉందని ఆలోచిస్తూ ఉంటాడు.