Happy Hug Day 2024 : ప్రేమతో నీ ఒక్క కౌగిలింత.. వెయ్యి బాధలు దూరమవుతాయంట-happy hug day 2024 greetings quotes whatsapp status facebook messages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Hug Day 2024 : ప్రేమతో నీ ఒక్క కౌగిలింత.. వెయ్యి బాధలు దూరమవుతాయంట

Happy Hug Day 2024 : ప్రేమతో నీ ఒక్క కౌగిలింత.. వెయ్యి బాధలు దూరమవుతాయంట

Anand Sai HT Telugu
Feb 12, 2024 07:00 AM IST

Happy Hug Day 2024 : మనం ప్రేమించిన వారి ఒక్క కౌగిలింత చాలు అన్ని బాధలూ పోయేందుకు. ఎంతటి యుద్ధమైనా గెలిచేందుకు.. ఇలా కౌగిలి గురించి హగ్ డే రోజున మీ ప్రియమైన వారికి చెప్పండి. అందుకోసం కింద కొన్ని విషెస్ ఉన్నాయి.

హగ్ డే శుభాకాంక్షలు
హగ్ డే శుభాకాంక్షలు (Unsplash)

వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 12ని హగ్ డేగా జరుపుకొంటారు. మన భాగస్వామిని ప్రేమతో కౌగిలించుకోవడం మన బాధలన్నింటినీ తుడిచివేస్తుంది. అలాంటి శక్తి కౌగిలిలో ఉంటుంది. ప్రేమతో కౌగిలించుకోవడం వల్ల నేను నీతో ఉన్నాను అని చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కౌగిలిలో మనం ఒక్క క్షణం అన్నింటినీ మర్చిపోయి లీనమైపోతాం. చాలా ప్రేమ జంటలు ఈ హగ్ డే కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. కౌగిలికి చాలా శక్తి ఉంది. ప్రేమగా ఇచ్చే ఒక్క కౌగిలింత వెయ్యి బాధలను కూడా దూరం చేస్తుంది.

తల్లి బిడ్డలకు కౌగిలించవచ్చు, స్నేహితులు కౌగిలి ఇవ్వగలరు.. కానీ ప్రేమికులు ఇచ్చుకునే కౌగిలికి భిన్నంగా ఉంటుంది. నేను నీకోసం ఉన్నాను అనే భరోసానిస్తుంది. భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ప్రేమికులు గట్టిగా కౌగిలించుకున్నప్పుడు తిరిగే గడియారం, కదిలే భూమి, అంతా నిశ్శబ్ధం అవుతుంది. ఆ కౌగిలిలో తప్పిపోతామేమో అనిపిస్తుంది. అంతటి గొప్ప అనుభూతి కౌగిలింత. ఈ హగ్ డే రోజున మీ ప్రియమైనవారికి కొన్ని రకాల విషెస్ చెప్పండి. దెబ్బకి ఫిదా అయిపోతారు.

నువ్వు దూరమైనా నీ వెచ్చని ఆలింగనం.. జ్ఞాపకంగా రోజంతా గడుపుతున్నాను. ప్రతి క్షణం నీ రాక కోసం ఎదురు చూస్తున్నా.. నేను నీ వెచ్చని కౌగిలిలో పడిపోవాలనుకుంటున్నాను.. త్వరగా రా... హ్యాపీ హగ్ డే

ప్రేమతో ఆలింగనం చేసుకుంటే.. దానికి ఏ బహుమతి సమానం కాదు.. నీ ప్రేమతో కూడిన కౌగిలిలో ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ హగ్ డే

చాలా ప్రేమతో నా నుండి నీకు పెద్ద కౌగిలింత. నువ్ వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తూ ఉంటా. నీ కౌగిలింత ఎల్లప్పుడూ నాకు గుర్తుండిపోవాలి. హ్యాపీ హగ్ డే మై డియర్

ప్రతి క్షణం నీ కౌగిలిలో గడపాలని కోరుకుంటున్నాను.. నువ్వే నా జీవితం, నీవే నా భవిష్యత్తు.. నేను నిన్ను ఎప్పటికీ కోల్పోలేను.. హ్యాపీ హగ్ డే

నిన్ను చూడగానే మనసు నిండా ప్రేమ.. పెదవుల నిండా చిరునవ్వు.. నువ్వు పరిగెత్తుకొచ్చి ఇచ్చే కౌగిలింతలకి నేను బానిసను.. Happy Hug Day

నేను నీ కౌగిలిని ఎంత మిస్ అయ్యానో ఎలా చెప్పాలి? నీ కౌగిలి నాకు నీ ప్రేమను తెలియజేసింది.. నా మనసును శాంతపరిచి నన్ను నీలో కలిపేసుకుంది.

నీ కౌగిలింత నా సమస్యలను మాయం చేసే మెడిసిన్.. ఆ మెడిసిన్ మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది.. నీ కౌగిలిలో నా మనసును శాంతపరుచుకుంటా.. హ్యాపీ హగ్ డే

ఈ హగ్ డే నాడు మీ భాగస్వామికి మీరు ఇవ్వగల అత్యంత విలువైన బహుమతి వెచ్చని కౌగిలింత. వారికి ప్రత్యేకమైన బహుమతిని కొనండి. వారిని ప్రేమగా కౌగిలించుకోండి. ఇలా చేస్తే వారు చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కసారి వారిని ప్రేమగా కౌగిలించుకోండి. నీ జీవితంలోని ప్రతీ విషయంలో నేను ఉంటానని భరోసా ఇవ్వండి. మాటలు చెప్పలేని విషయాలు కౌగిలింతలు చెప్పగలవు. ఎందుకుంటే మీరు వారికి ఉన్నారనే భరోసాను ఇవ్వగలవు. అందుకే వెచ్చని కౌగిలితో నుదిటిపై ఒక ముద్దుతో హగ్ డేను మీ ప్రియమైన వారు సంతోషంగా ఉండేలా చేయండి.