Krishna mukunda murari serial january 26th: రెండు జంటలని ఒకటి చేసేందుకు రేవతి ప్లాన్.. నటించలేక అల్లాడిపోతున్న ముకుంద
Krishna mukunda murari serial today january 26th episode: ఆదర్శ్, ముకుందని ఇటు కృష్ణ, మురారిని ఒక్కటి చేయాలని రేవతి శోభనం కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial today january 26th episode: భవానీ ఆదర్శ్ కి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఇంత సడెన్ గా రిజైన్ చేశావని అడుగుతుంది. ఆదర్శ్ సమాధానంగా చెప్పకుండా ఇప్పుడు అవన్నీ ఎందుకులే అంటాడు. నేను చెప్తాను అత్తయ్య రిస్క్ ఆపరేషన్స్ అంటే ముందు ఉంటున్నారట ఈయన దూకుడు వల్ల తను ఎక్కడ రిస్క్ లో పడతారోనని అడ్మినిస్ట్రేషన్ లో వేశారు అది నచ్చక రిజైన్ చేశారని అంటుంది. రిస్క్ ఆపరేషన్స్ చేస్తాడు ఎందుకు చేయడు అమ్మ ఉందని గుర్తు ఉంటే కదా అని బాధపడుతుంది. అయినా ఎందుకు వేయించుకున్నావో నాకు తెలుసు.. అమ్మ నీకోసం ఎదురుచూస్తుందని గుర్తు ఉంటే రిస్క్ ఆపరేషన్స్ చేయవని అంటుంది.
ఆపరేషన్ ముకుంద గురించి చెప్పిన ఆదర్శ్
ఇక ఆ అవసరం లేదులే రిజైన్ చేశాడు కదాని మురారి నచ్చజెప్తాడు. పెద్దత్తయ్య ఏంటి ఎదురుచూసే అమ్మ ఉంటుందని అంటుంది కానీ ఎదురు చూసే భార్య ఉంటుందని చెప్పడం లేదు. ఈవిడకి ఇంకా ముకుంద మీద కోపం తగ్గలేదా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ముకుంద కూడా అత్తయ్య ఏంటి నా ప్రస్తావనే తీసుకురాలేదు నా మనసులో ఏముందో అత్తయ్య పసిగట్టిందా? వామ్మో తెలిస్తే ఈ ఇంట్లో ఉండనివ్వదు. తెలియకుండా నటించాలని అనుకుంటుంది.
మధుకర్ బోర్డర్ లో ఏం ఆపరేషన్ చేశావ్ దాని పేరు ఏంటని అడుగుతాడు. పేరు ఏదైతే ఏముంది వదిలేయమని అంటాడు. కానీ మురారి మాత్రం చెప్పమంటాడు. ఆపరేషన్ ముకుంద అనేసరికి అందరూ తనని మెచ్చుకుంటారు. ఆదర్శ్ నువ్వు సూపర్ భార్య పేరు మిలటరీ ఆపరేషన్ కి పెట్టిన మొట్టమొదటి ఆఫీసర్ వి నువ్వేనని మురారి మెచ్చుకుంటాడు. ముకుంద మీద ఆదర్శ్ కి ఉన్న ప్రేమకి ఇది నిదర్శనం. ఇక ఆలస్యం ఎందుకు పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టిద్దామని రేవతి అంటుంది. దీంతో ముకుంద షాక్ అయిపోతుంది. భవానీ సరేనని ఒప్పుకునే సరికి కృష్ణ మురారి ఒకరి మొహం ఒకరు చూసుకుని సిగ్గుపడతారు.
కృష్ణ గొప్పతనాన్ని మెచ్చుకున్న రేవతి
భవానీ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి వచ్చి పలకరిస్తుంది. సమస్యలన్నీ తీరిపోయాయి ముకుంద ఆదర్శ్ కూడా కలిసిపోయారు కదా అంటుంది. ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర ముకుంద, కృష్ణ పూజ చేస్తూ కనిపిస్తారు. అది భవానీకి చూపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని రేవతి అంటుంది. బద్ధ శత్రువులుగా ఉండే వీళ్ళు అక్కాచెల్లెళ్లులాగా కలిసిపోయారు, దీనికి అంతా కృష్ణ కారణం. తన కృషి వల్లే ఇది సాధ్యమయింది తన బతుకు పణంగా పెట్టిందని నందిని మెచ్చుకుంటుంది.
కృష్ణ చొరవ తీసుకపోతే ఆదర్శ్ తిరిగి వచ్చేవాడు కాదని రేవతి కూడా కోడలిని ఆకాశానికి ఎత్తేస్తుంది. కృష్ణ మన ఇంటికి కోడలిగా కాదు మన ఇంటికి సంతోషాన్ని ఇచ్చే దేవతలా వచ్చిందని నందిని అంటుంది. వాళ్ళని చూస్తే చాలా బాగుంది ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండని అనిపిస్తుందని రేవతి అంటే ఎప్పుడు అలాంటి కోరికలు కోరుకోవద్దని భవానీ చెప్తుంది. ఎవరి జీవితమైన ఎప్పుడు సంతోషంగా సాగదు లోటు పాట్లు ఉంటేనే జీవితం విలువ తెలుస్తుందని అంటుంది. దేని మీద చాలా ఆశలు పెంచుకుని అలా జరగకపోతే మనసు డిస్ట్రబ్ అవుతుందని చెప్తుంది. ముకుంద మీద నమ్మకం కలిగినట్టు అనిపించలేదని నందిని డౌట్ గా అడిగితే నాకు ఎవరి మీద నమ్మకం లేదు ఈరోజు మంచిగా కనిపించిన వాళ్ళు రేపు చెడుగా కనిపిస్తారని చక్కగా చెప్తుంది.
కృష్ణని ఆశీర్వదించిన భవానీ
కృష్ణ, ముకుంద పూజ పూర్తి చేసుకుని హారతి పట్టుకుని ఇంట్లోకి వస్తారు. ముకుంద ఇచ్చిన హారతి భవానీ తీసుకోదు. హారతి తీసుకోమని ముకుంద అడుగుతుంది కానీ భవానీ మాత్రం తనవైపు సీరియస్ గా చూస్తుంది. అత్తయ్య హారతి తీసుకుంటే నా మీద కోపం అనుమానం పోయినట్టేనని ముకుంద మనసులో అనుకుంటుంది. భవానీ హారతి తీసుకోవడంతో అందరూ సంతోషిస్తారు. తన హారతి కూడా తీసుకోమని కృష్ణ అడుగుతుంది.
కృష్ణ భవానీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే పండంటి బిడ్డకి జన్మనిచ్చి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమని దీవిస్తుంది. మధుకర్ వచ్చి ఏదో ఒక కథని సినిమాగా తీయడం ఎందుకు మన ఇంటి కథని సినిమా తీస్తానని అంటాడు. మొహం పగిలిపోద్ది సినిమా తీసి మన ఫ్యామిలీ విషయాలు బజారున పడేస్తావా అని చీవాట్లు పెడుతుంది. నాలుగు గోడల మధ్య జరిగింది బయటకి తెలిస్తే పరువు పోతుందని భవానీ తిడుతుంది.
ఇంటి కథ సినిమా తీస్తానన్న మధు
అందరికీ తెలిస్తే పరువు పోతుందని అత్తయ్య అంది అంటే తను గతం ఏది మర్చిపోలేదు నా గురించే అన్నది, నా మీద కోపం పోదని ముకుంద మనసులో అనుకుంటుంది. మురారి తన జాబ్ గురించి ఆలోచించాలని అనుకుంటూ ఉండగా కృష్ణ వస్తుంది. ముకుందలో చాలా మార్పు వచ్చింది పూజ చేయడానికి వచ్చింది నాకు చాలా హ్యపీగా ఉందని కృష్ణ అంటుంది. రేవతి పంతులు కోసం టెన్షన్ గా ఎదురుచూస్తూ ఉంటుంది. మధుకర్ వచ్చి కాసేపు సెటైర్లు వేస్తాడు. నీకేం తెలుసు నా టెన్షన్ నా బిడ్డల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్తుంది.
ఎందుకు ప్రతి చిన్నదానికి కంగారుపడతావ్ పెద్దపెద్దమ్మని చూసి నేర్చుకో లోపల అగ్ని పర్వతాలు పగిలిపోతున్న పైకి మాత్రం కూల్ గా కనిపిస్తారని మధు అంటాడు. పంతులు వచ్చేసరికి అందరినీ పిలుచుకురమ్మని చెప్తుంది. అప్పుడే ముకుంద వస్తుంది. ఆదర్శ్ ని తీసుకురమ్మని చెప్తుంది. ఇప్పుడు ఆదర్శ్ ఎందుకు తనతో పని ఏంటి? చెప్పింది చేయకపోతే నా మీద డౌట్ వస్తుంది అలాగని మనసు చంపుకుని పని చేయలేకపోతున్నానని ముకుంద మనసులోనే బాధపడుతుంది.