Krishna mukunda murari serial february 9th episode: ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకుంటూ అందరినీ మోసం చేస్తున్న ముకుంద
Krishna mukunda murari serial february 9th episode: అందరినీ నమ్మించడం కోసం ఆదర్శ్ తో బయటకి వస్తుంది ముకుంద. కృష్ణ వాళ్ళకి అనుమానం రాకుండా ఆదర్శ్ మీద ప్రేమ చూపించే ప్రతిసారి తన స్థానంలో మురారి ఉన్నట్టు ఊహించుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial february 9th: కృష్ణ దిగులుగా ఉంటే వల్ల దగ్గరకి ముకుంద వాళ్ళు వస్తారు. పాత ధ్వజ స్తంభం కాబట్టి గంట ఊడిపోయింది. దాని గురించి ఆలోచించడం అనవసరం. ఇప్పుడు మన బాధ పోయి సంతోషంగా ఉండాలంటే ప్రసాదం తినాలని చెప్పి కొబ్బరి కాయ కొట్టబోతుంటే ఆదర్శ్ వేలు నలిగిపోతుంది. ముకుంద మాత్రం ఏం పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ తనని పిలిచి ఆదర్శ్ చెయ్యి నలిగిపోయింది చూడమని చెప్తుంది. వెంటనే ముకుందకి ఆదర్శ్ ప్లేస్ లో మురారి ఉన్నట్టు ఊహించుకుంటుంది. చూసుకోవాలి కదా చూడు ఎలా నలిగిపోయిందో గంట పడిపోయినప్పుడే ఏదో కీడు జరుగుతుందని మనసు శంకించిందని ముకుంద బాధగా అంటుంది.
ముకుంద ప్రేమ నిజమని నమ్మిన కృష్ణ
ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళమీద పెద్దమ్మ ఎందుకు డౌట్ పడిందని మురారి వాళ్ళు అనుకుంటారు. హాస్పిటల్ కి వెళ్దామా అని ఆత్రంగా అడుగుతుంది. వెంటనే కృష్ణ మనసులో అంత ప్రేమ దాచుకుని బయట పడవే అని అంటుంది. దీంతో తాను పట్టుకుంది ఆదర్శ్ చెయ్యి అని గుర్తుకు వచ్చి వదిలిపెట్టేస్తుంది. నచ్చిన వాళ్ళ చేతి స్పర్శ తగిలితే ఏ మందులు పనికిరావని కృష్ణ అంటుంది.
ఆదర్శ్ కారులో కూర్చుని ముకుంద చూపించిన ప్రేమని గురించి తలుచుకుంటూ మురిసిపోతాడు. రోడ్డు పక్కన పూలు ఉంటే అక్కడ కారు ఆపమని కృష్ణ చెప్తుంది. ఇప్పుడు ఎందుకని ముకుంద అంటుంది. మీ లేడీస్ ని చూసుకుంటే సరిపోతుందా మా లేడీస్ ని కూడా మేము చూసుకుంటామని ఆదర్శ్ అంటాడు. అబ్బా నీకు వేలు నలిగింది కదా వద్దులే కూర్చోమని చెప్పి మురారి, కృష్ణ వెళతారు.
ఆదర్శ్ తో పూలు పెట్టించుకున్న ముకుంద
ముకుంద ఇంటికి వెళ్లేవరకు ఈ టెన్షన్ పడాల్సిందేనని మనసులో అనుకుంటుంది. పూలు కొని కృష్ణ ఆదర్శ్ చేతికి ఇచ్చి ముకుందకి తలలో పెట్టమని చెప్తుంది. రోడ్డు మీద ఎందుకని ఆదర్శ్ చెప్పినా కూడా పెట్టాల్సిందేనని అంటారు. ఆదర్శ్ పూలు పెట్టబోతుంటే ముకుంద వద్దు నేనే పెట్టుకుంటానని అంటుంది. ఎందుకు వద్దని కృష్ణ అడుగుతుంది. తనకి ఇబ్బందిగా ఉంటే వద్దులే అంటాడు. నాకేం ఇబ్బంది మీకు ఇబ్బంది అవుతుందేమో చేతికి దెబ్బ తగిలింది కదాని ముకుంద కవర్ చేస్తుంది. అబ్బా మొగుడిని ఎంత సుకుమారంగా చూసుకుంటున్నావ్ పూలు తగిలితే వేలు ఏమి కందిపోదులే అని ఆదర్శ్ ని పూలు పెట్టమని కృష్ణ చెప్తుంది.
నా జీవితంలో ఉండాలన్నా, నా జడలో పూలు పెట్టాలన్నా అది నువ్వే కావాలి మురారి అలాగని ఇప్పుడు కాదని తప్పించుకోలేను నిన్ను ఊహించుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ కి బదులు మురారి అక్కడ ఉన్నట్టు ఊహించుకుని నవ్వుతుంది. ఆదర్శ్ ముకుంద తలలో పూలు పెడతాడు. ఈ సీన్ పెద్దత్తయ్య చూస్తే బాగుండేదని కృష్ణ అంటే చూడక్కర్లేదు తెలిస్తే చాలని మురారి అంటాడు. తర్వాత మురారి సంతోషంగా కృష్ణ తలలో పూలు పెడతాడు. ఇక రెండు జంటలు రెస్టారెంట్ కి వస్తారు. అందరూ ఏం తింటారని కృష్ణ హడావుడి చేస్తుంది. ముకుంద ఏం తింటే ఆదర్శ్ కూడా అదే తింటాడని మురారి అంటాడు. మనకి ఇష్టమైన వాళ్ళు ఏం తినాలని అంటే అదే ఇష్టంగా తింటామని ముకుందని అడుగుతాడు.
మురారికి ఫుడ్ తినిపించిన ముకుంద
ముకుంద అడిగింది మురారిగా ఊహించుకుని అవును మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది. రెస్టారెంట్ లో పని చేసే బ్యారర్ వచ్చి మురారిని పలకరించి ముకుంద వైపు చూపించి మేడమ్ అనబోతుంటే కృష్ణ ఆపుతుంది. ఏసీపీ సర్ మేడమ్ ని నేనని చెప్తుంది. రెస్టారెంట్ లో బ్యారర్ కి కూడా నేను మురారి జంటగా కనిపిస్తున్నాం, మరి భగవంతుడికి ఎందుకు జంటగా చేయలేదు. అసలు ఆదర్శ్ నన్ను ఎందుకు ప్రేమించాలి? ఆదర్శ్ మురారి బ్రదర్స్ ఎందుకు అవాలి. తనకోసం మురారి నన్ను ఎందుకు త్యాగం చేయాలి. నాకు ఇచ్చిన మాట పక్కన పెట్టి కృష్ణని ఎందుకు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మాకు కృష్ణ కదా అడ్డు లేదంటే మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఆ అడ్డం కూడా తొలగించలేని పరిస్థితి ఏర్పడిందని ముకుంద మనసులో అనుకుంటుంది.
ఆదర్శ్ చేతికి దెబ్బ తగలడం వల్ల తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీంతో మురారి తినిపించనా అని అడుగుతాడు. నువ్వు కాదు పెళ్ళాం తినిపించాలని కృష్ణ అంటుంది. ముకుందని తినిపించమని చెప్తుంది. ప్రతిసారి ఎందుకు మనసుకి నచ్చని పనులు చేసేలా చేస్తావని దేవుడిని తిట్టుకుంటుంది. కృష్ణ తినిపించమని అనేసరికి తినిపిస్తాను కానీ నా మురారికి అని ముకుంద మళ్ళీ ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకుంటుంది. మురారికి అన్నం తినిపిస్తున్నట్టుగా ఫీల్అవుతుంది. నన్ను క్షమించు ఆదర్శ్ నాకు మురారి మీద ఉన్న ప్రేమ అంతా నీ మీద ఉన్నట్టు భ్రమ కల్పిస్తున్నాను. నిన్ను దారుణంగా మోసం చేస్తున్నానని ముకుంద మనసులో బాధపడుతుంది. వాళ్ళని చూసి కృష్ణ, మురారి సంతోషిస్తారు. వీళ్ళని ఇక టెస్ట్ చేయాలసిన అవసరం లేదు పెద్దత్తయ్యకి మనమే అర్థం అయ్యేలా చెప్పాలని అంటుంది.