Krishna mukunda murari serial january 12th: కృష్ణకి ఐలవ్యూ చెప్పిన మురారి.. ముకుందతో జాగ్రత్తగా ఉండమన్న మధు-krishna mukunda murari serial january 12th episode krsihna feels elated murari express his love for her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial January 12th: కృష్ణకి ఐలవ్యూ చెప్పిన మురారి.. ముకుందతో జాగ్రత్తగా ఉండమన్న మధు

Krishna mukunda murari serial january 12th: కృష్ణకి ఐలవ్యూ చెప్పిన మురారి.. ముకుందతో జాగ్రత్తగా ఉండమన్న మధు

Gunti Soundarya HT Telugu
Jan 12, 2024 07:18 AM IST

Krishna mukunda murari serial january 12th: కృష్ణ,మురారి ఒక్కటి కావడంతో సిరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇక ముకుంద మారిపోయి అందరిలో కలివిడిగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి  12 ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 12 ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial january 12th: సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయని కృష్ణ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇక ముకుంద కూడా మారినట్టుగా ప్రవర్తిస్తూ వాళ్ళలో కలిసిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే.. కృష్ణ, మురారి సరదాగా ఒక ఆట ఆడుకుంటారు. ఏసీపీ సర్ మీ వీపు మీద కొన్ని లెటర్స్ రాస్తాను అవి ఏంటో చెప్పాలని కృష్ణ అంటుంది. సరేనని ఇద్దరూ సరదాగా ఉంటారు. 

ముకుందతో జాగ్రత్తగా ఉండమన్న మధుకర్

శకుంతల జైల్లో ఉన్న ప్రభాకర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. జైల్లో ఎందుకు లొల్లి పెట్టుకున్నావంట అని తిడుతుంది. ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉండగా కృష్ణ, మురారి, రేవతి, ముకుంద వస్తారు. మావయ్య త్వరలోనే వచ్చేస్తాడని మురారి చెప్పడంతో శకుంతల సరే అంటుంది. ఇక సంక్రాంతి పండుగ అందరం కలిసి బాగా సెలెబ్రేట్ చేసుకుందామని దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ తనే చూసుకుంటానని ముకుంద అంటుంది. తన మాటలు విన్న మధుకర్ ముకుంద నిజంగానే మారిందా లేదా అనుకుంటారు. 

తను ఇంట్లోకి వెళ్ళగానే రేవతి, మధు కూడా ఇదే విషయం గురించి శకుంతలకి చెప్తారు. మధు ముకుంద మారలేదు నటిస్తుందని అంటున్నాడని రేవతి చెప్తుంది. మీరు తన ముందు అనుమానంగా ఉండొద్దు మామూలుగానే ఉండండి లేదంటే తనకి డౌట్ వస్తుందని జాగ్రత్తగా ఉండమని శకుంతలకి మధు చెప్తాడు. 

ఆదర్శ్ ఆచూకీ కోసం కృష్ణ ప్రయత్నాలు 

ఇదే అనుమానం సుమలతకి కూడా వచ్చి తన భర్త ప్రసాద్ ని అడుగుతుంది. ముకుంద నిజంగా మారిందా లేదంటే నటిస్తుందా అని అడుగుతుంది. ముకుంద మారినట్టు నటిస్తే తనకి ఏం వస్తుంది?ఇంకోసారి తప్పు చేయదనే అనిపిస్తుందని ప్రసాద్ చెప్తాడు. ముకుంద మారితే సంతోషమే కదాని సుమలత కూడా అంటుంది. 

కృష్ణ వాళ్ళు ఒక వ్యక్తిని కలవడానికి బయటకి వెళ్తారు. ఆదర్శ్ ఆచూకీ గురించి ఎలాగైనా తెలుసుకుని తమకి చెప్పమని కృష్ణ అతనితో చెప్తుంది. ఆదర్శ్ కి ప్రమోషన్ వచ్చిందని తన పని చేసే ప్రదేశం కూడా మారిందని అతను చెప్తాడు . ఇప్పుడు ఆదర్శ్ ఎక్కడున్నాడో తెలియదని అంటాడు. వీలైనంత త్వరగా ఆదర్శ్ గురించి చెప్పమని కృష్ణ అతనికి చెప్తుంది. ఆదర్శ్ కావాలని వెళ్ళిపోయాడు కాబట్టే తను మళ్ళీ తిరిగి రాడని అనిపిస్తుందని మురారి అంటాడు. కానీ కృష్ణ మాత్రం ఆదర్శ్ ఆచూకీ తెలిస్తే ఎలాగైన తీసుకొచ్చి ముకుందతో ఒక్కటి చేయాలని చెప్తుంది. 

కృష్ణ, మురారికి కార్యం జరిపించాలనుకుంటున్న రేవతి 

రేవతి భవానీ దగ్గరకు వెళ్లి కృష్ణ మురారి లకు శోభనం జరిపించాలని అందుకు సంబంధించి ముహూర్తం పెట్టడం కోసం పంతుల్ని పిలిపిస్తున్నట్టు చెప్పాలని అనుకుంటుంది . భవాని రేవతిని చూసి ప్రభాకర్ ని విడిపించడానికి ఏర్పాటు చేశానని వారం పది రోజుల్లో అతని మీద ఎటువంటి కేసులు లేకుండా జైలు నుంచి బయటికి వచ్చేస్తాడని చెప్పడంతో రేవతి సంతోషిస్తుంది. 

పంతుల్ని పిలిపించాలని అనుకుంటున్న విషయం రేవతి చెప్పగానే గుడ్ అలాగే చేయమని భవానీ అంటుంది. మురారి వాళ్ళ మధ్య ఉన్న అగ్రిమెంట్ బంధం శాశ్వతం చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మంచి ముహూర్తం చూసి జరిపించేద్దామని చెప్తుంది. అక్క మీరు మాట్లాడేది వాళ్ళ కార్యం గురించి కదా అంటే అవును దాని గురించే నీకు నచ్చినట్టు చేయమని రేవతికి చెప్తుంది. భవాని మాటలకు రేవతి చాలా సంతోషంగా విషయం చెప్పడం కోసం శకుంతల దగ్గరికి వెళ్తుంది. 

కృష్ణ జీవితం జోలికి రానని ముకుంద ప్రామిస్ 

ముకుంద శకుంతలకి మరొకసారి క్షమాపణ చెప్తుంది. ఇక కృష్ణ జీవితంలోకి తను ఎప్పటికీ రానని శకుంతలకి ప్రామిస్ చేస్తుంది. ఇక రేవతి వచ్చి ప్రభాకర్ అన్నయ్యని విడిపించేందుకు భవాని అక్కయ్య ఏర్పాట్లు చేసిందని వారం రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తాడని చెప్పడంతో చాలా మంచి మాట చెప్పావు వదిన అని శకుంతల ఆనందపడుతుంది. మధుకర్ నందిని కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్లకి విషయం చెప్పడంతో సంతోషిస్తారు. అప్పుడే పంతులు ఫోన్ చేసి పండగ తర్వాత మంచి ముహూర్తం ఉందని అప్పుడు జరిపించుకోవచ్చు అని చెప్పడంతో రేవతి సంతోషిస్తుంది. ఇన్ని సమస్యలకి కారణం తనేనంటూ ముకుంద కన్నీళ్లు పెట్టుకుంటుంది .అది చూసి ముకుంద నటిస్తుందా? అని మధు డౌట్ పడతాడు. 

అదేమీ  లేదని జరిగింది ఏదో జరిగిపోయింది అంతా మర్చిపొమ్మని చెప్పి మధుకర్ నందిని ముకుందతో కలిసి బయటికి వెళ్ళిపోతారు. ముకుందని చూస్తుంటే మారినట్టే అనిపిస్తుంది కానీ తనని నమ్మడానికి వీల్లేదు తన వల్లే కృష్ణ మురారి వాళ్ళ కార్యం త్వరగా జరిపించే వాళ్లని తొందరపడుతున్నట్టు రేవతి మనసులో అనుకుంటుంది. కృష్ణ మురారి బైక్ మీద సరదాగా తిరుగుతూ ఉంటారు ఒక చోట రోడ్డుమీద ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుందని చెప్తుంది. ఇక అక్కడ కృష్ణ చేసిన చిలిపి అల్లరి చూసి తనకి మురారి ఐలవ్యూ చెప్తాడు. ఆ మాటకి కృష్ణ ఎమోషనల్ అవుతూ సిగ్గుపడుతుంది. 

 

Whats_app_banner