Krishna mukunda murari serial february 10:ముకుందకి సోరి చెప్పిన ఆదర్శ్.. మందు తాగి కృష్ణ ముందు తిక్క వేషాలు వేసిన మురారి
Krishna mukunda murari serial february 10 episode: ముకుంద మురారిని ఊహించుకుంటూ ఆదర్శ్ మీద ప్రేమ చూపిస్తూ మోసం చేస్తుంది. అది నిజమని ఆదర్శ్ పూర్తిగా నమ్మేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial february 10 episode: రెండు జంటలు రెస్టారెంట్ కి వెళతారు. ఆదర్శ్ చేతికి దెబ్బ తగలడంతో తనకి అన్నం తినిపించమని కృష్ణ చెప్తుంది. కానీ ముకుంద మురారిని ఊహించుకుంటూ ఆదర్శ్ కి తినిపిస్తుంది. నన్ను క్షమించు ఆదర్శ్ నాకు మురారి మీద ఉన్న ప్రేమని నీమీద చూపించి నిన్ను దారుణంగా మోసం చేస్తున్నానని అనుకుంటుంది. ఇక కృష్ణ ముకుందని ఆదర్శ్ ప్లేట్ లోనే తినమని చెప్తుంది. ముకుంద ఇబ్బంది పడుతుంటే ఆదర్శ్ పర్లేదులే తన ప్లేట్ లోనే తిననివ్వమని అంటాడు.
కృష్ణ ముందు మరో అపశకునం
కృష్ణ గదిలో వాళ్ళ నాన్న ఫోటోకి వేసిన దండ వాడిపోయి కిందపడిపోయి కనిపిస్తుంది. దీంతో కృష్ణ చాలా కంగారుపడుతుంది. పొద్దున వేశాను కదా అప్పుడే ఇలా వాడిపోయింది ఏంటని అనుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అపశకునాలు ఎదురవుతున్నాయి. ఏం జరగబోతుందని కృష్ణ టెన్షన్ పడుతుంది. మురారి వచ్చి ఏమైందని అడుగుతాడు. పొద్దున మార్చిన దండ అప్పుడే వాడిపోయింది ఏమవుతుందోనని భయంగా ఉందని అంటుంది. ఇది వాడిపోవడం కాదు మాడిపోయింది మొన్న అలా జరిగింది. ఈరోజు గంట పడింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగా భయం వేస్తుందని చెప్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి లింకు పెట్టుకుంటే ఇలాగే అనిపిస్తుందని అంటాడు. కానీ కృష్ణ మాత్రం ఒప్పుకోదు. కారణం తెలియకుండా ఏదో జరుగుతుందని భయపడటం ఎందుకని ధైర్యం చెప్తాడు.
ఇంతమంచి అమ్మాయికి దేవుడు అన్యాయం చేయడని అంటాడు. గతంలో జరిగింది కదా మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందోనని భయంగా ఉందని చెప్తుంది. మనం ఎప్పుడు దూరంగా లేము. దగ్గర కావడానికి కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నాము అంతే. నువ్వు ఇలా భయపడటానికి కారణం నీకు నామీద ఉన్న అమితమైన ప్రేమ. కానీ ఏం ప్రయోజనం దగ్గరకి రానివ్వడం లేదని మళ్ళీ శోభనం టాపిక్ తీసుకొస్తాడు. ఏం మాట్లాడినా మళ్ళీ అక్కడికే వస్తారని కృష్ణ అంటుంది. ముహూర్తాలు పెట్టె వరకు ఓపిక పట్టాల్సిందేనని చెప్తుంది. ముకుంద మీద పెద్దత్తయ్యకి అనుమానం తీరితే సమస్యలు తీరిపోతాయి. హోటల్ లో తినిపించిందని చెప్పినా కూడా పెద్దమ్మకి నమ్మకం కలగలేదు. వల్ల అన్యోన్యత కళ్ళారా చూసే కాని నమ్మేలా లేదు. దానికి ఒకటే దారి వాలెంటైన్స్ డే రోజు మనం పెట్టె పరీక్షలు వాళ్ళ మీద ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ బయట పడేలా చేయాలి అది పెద్దమ్మ కంట పడేలా చేయాలని అంటాడు. ఐడియా సూపర్ గా ఉందని చెప్పి కృష్ణ మురారిని హగ్ చేసుకుంటుంది.
ముకుందని క్షమించమని అడిగిన ఆదర్శ్
ముకుంద గదిలో కూర్చుని ఆదర్శ్ తనకి పూలు పెట్టింది గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఆదర్శ్ ప్లేస్ లో మురారిని ఊహించుకుని తనని మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఇప్పుడున్న చనువుతో మరింత దగ్గరయితే మురారిని ఊహించుకుని మౌనంగా ఉండలేను కదా. నిజం చెప్తే ఇంట్లో స్థానం ఉండదని భయం. చెప్పకపోతే అసలు ఏమైపోతానో అనే భయం... ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆదర్శ్ వస్తాడు.
ఆదర్శ్: నన్ను క్షమించు ముకుంద. నిన్ను అర్థం చేసుకోలేకపోవడం నా తప్పు. నువ్వు మురారి ప్రేమించుకున్నారు. నిన్ను పెళ్లి చేసుకోగానే వెంటనే మురారిని మర్చిపోయి నీ మనసులో స్థానం దక్కాలని ఆశపడటం నా తప్పు అవుతుంది కానీ నీ తప్పు ఎలా అవుతుంది. మనసులో నుంచి ప్రేమని తీసేయడం అంత సులువు కాదు. దేనికైనా టైమ్ పడుతుంది. ఓపికగా ఎదురుచూడాలి. ఈరోజు నువ్వు నామీద చూపించిన ప్రేమ చూసిన తర్వాత నేను నిన్ను వదిలి వెళ్ళి ఎంత పెద్ద తప్పు చేశానో అర్థం అయ్యింది. నన్ను నేనే నిందించుకున్నాను. నీలాంటి అమ్మాయిని వదిలేసి ఎందుకు ఒంటరిగా ఉన్నానని చాలా బాధపడుతున్నాను.
ముకుంద: నా మార్పు నాటకం అని ఈయనకి నా మనసులో ఎప్పటికీ స్థానం దక్కదని అర్థం అయ్యేలా ఎలా చెప్పాలని మనసులో బాధపడుతుంది
కృష్ణ వాళ్ళు నాదగ్గరకి వచ్చినప్పుడే నువ్వు మారావని అర్థం అయ్యింది కానీ ఇంటికి వచ్చాక నీ ప్రవర్తన బట్టి మళ్ళీ అనుమానం వచ్చింది. నేనంటే ఇష్టం లేక ఇలా ప్రవర్తిస్తున్నావ్ అనుకున్నాను. అందుకే ఇన్నిసార్లు సోరి చెప్తున్నా. ఈసారి నీ ప్రవర్తనలో తేడా ఉంటే నామీద ఇష్టం లేదని పొరపాటున కూడా అనుకొనని చెప్పి వెళ్ళిపోతాడు.
మధు తిక్క కుదిర్చిన ఆదర్శ్, మురారి
మీరు కాదు నేను సోరి చెప్పాలి. నేను ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అర్థం కావడం లేదు. మీరు బాధపడతారని నిజం చెప్పలేక నాలో దాచుకోలేక నేను నలిగిపోతున్నానని బాధపడుతుంది. మధు సిట్టింగ్ పార్టీ ఏర్పాటు చేసి మురారి, ఆదర్శ్ ని పిలుస్తాడు. మళ్ళీ ఎలాగైనా తొండ మ్యాటర్ బయటకి కక్కించాలని అనుకుంటాడు. నేను తాగను ముకుంద గట్టిగా వార్నింగ్ ఇచ్చింది తనకి చెప్పకుండా తాగనని మాట ఇచ్చానని ఆదర్శ్ చెప్తాడు. మధు వాళ్ళని తాగించేలా చేయడం కోసం డ్రామా ఆడతాడు. బయటకి వెళ్లారు కదా కారు ఎవరు డ్రైవ్ చేశారు, పక్కన ఎవరు కూర్చున్నారని మధు అడుగుతాడు. నిజంగానే నీకు వేలు నలిగిందా ముకుంద నీకు నిజంగానే ఫుడ్ తినిపించిందా అని ఆదర్శ్ ని అడుగుతాడు.
మధు తిక్క కుదర్చాలని డిసైడ్ అయిన మురారి, ఆదర్శ్ తనకి బలవంతంగా మందు మొత్తం తాగించేస్తారు. కృష్ణ, ముకుంద డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారు. రేవతి మీ మొగుళ్ళు ఎక్కడని అడుగుతారు. మధు కనిపించడం లేదు ముగ్గురూ కలిసి ఎక్కడో మందు తాగుతూ ఉంటారని నందిని అంటుంది. తమకి చెప్పకుండా మందు తాగర్అని కృష్ణ, ముకుంద అంటారు. అప్పుడే మురారి వాళ్ళు వస్తారు. వాళ్ళు మందు తాగారో లేదో టెస్ట్ చేయమని నందిని అంటుంది. కృష్ణ మురారిని మందు తాగావా అని అడుగుతుంది. ఇద్దరూ తలలు అడ్డదిడ్డంగా ఊపుతూ బుక్ అయిపోతారు. ఆదర్శ్ తాగానని తల ఊపుతాడు నందిని ఒప్పుకున్నాడని అంటే లేదని మళ్ళీ అబద్ధం చెప్తాడు.
కృష్ణ అయితే టెస్ట్ చేస్తాను గాలి ఊదమని చెప్తుంది. మురారి మాత్రం గాలి ఊదమంటే ఎటో ఊదుతాడు. అక్కడ కాదు నా మొహం మీద అంటుంది. మురారి గాలి ఊదమంటే ఊపిరి లోపలికి పీల్చుకుంటాడు.
తరువాయి భాగంలో..
కృష్ణ చేతికి మురారి తొడిగిన ఉంగరం లేకపోవడాన్ని నందిని గమనించి అడుగుతుంది. అది చూసుకుని కృష్ణ కంగారుపడుతుంది. ముగ్గు వేసేటప్పుడు కూడా ఉందని అప్పుడే పడిపోయిందేమోనని వెతుకుతుంది. మురారిని కృష్ణకి తొడగమని నేనే కదా ఆ ఉంగరం ఇచ్చాను. ఇప్పుడు ప్రేమికుల రోజునే అది మిస్ అయ్యిందంటే నేను నా ప్రేమ మీద ఆశలు పెంచుకోవచ్చా అని ముకుంద మనసులో అనుకుంటుంది.