Bed Room Decoration : వాలెంటైన్స్ డే సందర్భంగా బెడ్‌రూమ్‌ను ఇలా రొమాంటిక్‌గా అలంకరించుకోండి
Bed Room Decoration : వాలెంటైన్స్ డే సందర్భాంగా భార్యభర్తలు బెడ్ రూమ్ ను అందంగా అలంకరించుకుంటే బాగుంటుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొంటారు, ప్రేమికులు మాత్రమే కాదు.. వివాహితులు కూడా ఈ వేడుకను నిర్వహించుకుంటారు. పెళ్లయిన వారు ప్రేమికుల దినోత్సవాన్ని పడక గదిలో రొమాంటిక్‌గా జరుపుకోవచ్చు. మీరు ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని అందంగా జరుపుకోవాలనుకుంటే.. ముందుగా మీ బెడ్‌రూమ్‌ను రొమాంటిక్‌గా అలంకరించుకోవాలి.
రెడ్ కలర్ తప్పనిసరి
ముఖ్యంగా ప్రేమను సూచించే ఎరుపు రంగుతో బెడ్‌రూమ్‌ని అలంకరిస్తే గది చాలా హాట్‌గా మారిపోతుంది. ఇది శృంగారాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. బెడ్‌రూమ్‌ని రొమాంటిక్‌గా అలంకరించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అలంకరించండి. వాలెంటైన్స్ డేని ఆనందించండి.
కొవ్వొత్తులు అందంగా ప్లాన్ చేయండి
బెడ్ రూమ్ చాలా రొమాంటిక్ గా ఉండాలంటే అక్కడ కొవ్వొత్తులు ఉండాలి. పడకగదిని ఎరుపు రంగు కొవ్వొత్తులతో అలంకరించండి. తెల్లని కొవ్వొత్తి మాత్రమే ఉన్నట్లయితే కొవ్వొత్తిపై ఎరుపు రిబ్బన్ను కట్టండి. ఇది చూసేందుకు చాలా అందంగా ఉంటుంది.
గులాబీ రేకులు
పడక గది మంచి వాసనతో ఉండాలంటే, సువాసన గల కొవ్వొత్తులతో పాటు బెడ్ రూమ్ ఫ్లోర్‌లో పొడి గులాబీ రేకులను చల్లుకోండి. ఇది సుగంధం, శృంగారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బెడ్ రూములో గులాబీ రేకుల వాసన మిమ్మల్ని మత్తెక్కించేలా చేస్తుంది.
రెడ్ కలర్ కర్టెన్లు ప్లాన్ చేయండి
పడకగదిలో కర్టెన్లను వేలాడదీయడం కూడా చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ముఖ్యంగా రెడ్ కలర్ లేస్ లేదా శాటిన్ కర్టెన్లను కొని వాడండి. ఇవి మీ జంటను మంచి మూడ్‌లోకి తీసుకెళ్తాయి. ఈ కర్టెన్లు మీరు ఎంజాయ్ చేసేలా ప్రేరేపిస్తాయి.
ఇలా సర్ ప్రైజ్ చేయండి
బెడ్‌రూమ్‌లో ఉన్న మీ భాగస్వామికి మీ ప్రేమను తెలియజేయడానికి, అందమైన రొమాంటిక్ పదబంధంతో కూడిన కార్డ్‌తో పాటు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాక్లెట్‌ల పెట్టెను బెడ్‌పై ఉంచండి. వారు పడకగదిలోకి ప్రవేశించినప్పుడు కూడా అది కనిపించేలా చేయండి. ఇది వారి హృదయంలో ప్రేమను పెంచుతుంది. మిమ్మల్ని ముద్దులతో ముంచెత్తుతారు.
వైన్ ఒక అద్భుతమైన కామోద్దీపన అని చెప్పుకోవచ్చు. బెడ్‌రూమ్‌ను అలంకరించేటప్పుడు ఒక బాటిల్ వైన్ తెచ్చి పెట్టండి. ఇద్దరికీ అలవాటు ఉంటే కాస్త తీసుకోండి. మీ మూడ్ మారిపోతుంది.
పడకగదిని అలంకరించడానికి అవసరమైన వస్తువులలో కుషన్ ఒకటి. ఎరుపు రంగు కుషన్లను కొని వాడండి. ఇది మీ ఇద్దరిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.
మంచం మీద గులాబీ రేకులు
మంచం మీద గులాబీ రేకులను వెదజల్లండి. రొమాన్స్ పెంచుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. ఇద్దరు ఎంచక్కా గులాబీ రేకుల వాసనలో మునిగిపోతారు.
వాలెంటైన్స్ డే కోసం బెడ్‌రూమ్‌ని అలంకరించేటప్పుడు, బెడ్‌రూమ్‌లో నేలపై మెరిసే శాటిన్ షీట్‌లను ఉపయోగించండి. ఇది రూమ్ మెుత్తాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.
క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి
మీ బెడ్‌రూమ్‌లో డైనింగ్ టేబుల్ లేకపోతే, వాలెంటైన్స్ డే రోజున డైనింగ్ టేబుల్‌ని సెటప్ చేసి, దానిపై క్యాండిల్‌లైట్ డిన్నర్ చేయండి. ఇది మరింత మెరుగ్గా ఉంటుంది. మీరు ఇద్దరు మాత్రమే ఉంటే ఒకరికొకరు తినిపించుకోవచ్చు. ఇది చాలా ప్రేమగా ఉంటుంది.