Krishna mukunda murari serial february 13th: కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారి.. జలస్ ఫీలయిన ముకుంద, అనుమానిస్తున్న ఆదర్శ్-krishna mukunda murari serial february 13th episode mukunda feels jealous of krishna murari closeness ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial February 13th: కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారి.. జలస్ ఫీలయిన ముకుంద, అనుమానిస్తున్న ఆదర్శ్

Krishna mukunda murari serial february 13th: కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారి.. జలస్ ఫీలయిన ముకుంద, అనుమానిస్తున్న ఆదర్శ్

Gunti Soundarya HT Telugu
Feb 13, 2024 07:11 AM IST

Krishna mukunda murari serial february 13th episode: ముకుంద, మురారి కలిసి ఉన్న ఫోటోస్ ఆదర్శ్ కంట పడతాయి. వాటిని చూడటంతో ముకుంద ఇంకా తన మనసు మార్చుకోలేదా అని ఆదర్శ్ కి అనుమానం రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial february 13th episode: మురారికి తెలియకుండా ముకుంద తనతో సెల్ఫీ తీసుకుంటుంది. ఆదర్శ్ కాబోర్డ్ ఓపెన్ చేయగానే అందులో ముకుంద, మురారి గతంలో దిగిన ఫోటో ఉంటుంది. వీళ్లిద్దరి ఫోటో ఇక్కడ ఉంది ఏంటని అనుకుంటాడు. డెకరేషన్ ఐటెమ్స్ తీసుకుని మురారి దగ్గరకి వస్తాడు. వాటిని చూసిన ముకుంద ఇవి ఎవరిచ్చారని అడుగుతుంది. నీ రూమ్ లో పాత కబోర్డ్ ఉంది కదా అందులోవి ఆదర్శ్ తీసి ఇచ్చాడని చెప్పడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. అయ్యో ఆ ఫోటోస్ చూసేసి ఉంటారా ని ముకుంద కంగారుగా పరిగెడుతుంది. అప్పటికే ఆదర్శ్ కబోర్డ్ లో ఉన్న మరొక ఫోటో చూస్తాడు. అందులో ఆదర్శ్ మొహం ఉన్నంత వరకు మడత పెట్టి ఉంటుంది. 

ముకుంద మీద అనుమానపడిన ఆదర్శ్ 

ఇదేంటి నేను ఉన్న పార్ట్ ఎందుకు మడత పెట్టి ఉందని అనుకుంటాడు. ముకుంద గతంలో మురారితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. బాధగా మళ్ళీ ఆ ఫోటోస్ అక్కడే పెట్టేస్తాడు. ముకుంద వచ్చేసరికి ఫోటోస్ అక్కడే ఉంటాయి. ఆదర్శ్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫోటోస్ ఎక్కడివి అక్కడే ఉన్నాయి ఆయన చూడలేదు. మళ్ళీ ఇవి ఆయన కంట పడకుండా జాగ్రత్త పడాలని వాటి తీసి వేరే చోట దాచి పెడుతుంది. ముకుంద ఇంకా మురారి గురించి ఆలోచిస్తుందా? లేదంటే నేను పొరపాటు పడుతున్నానా? ముకుంద మురారి ఫోటో అంటే పాతది కబోర్డ్ లో మర్చిపోయి ఉండవచ్చు. నేను మురారి ఉన్న ఫోటోలో నాసైడ్ ఎందుకు మడత పెట్టి ఉంచింది. కావాలని చేసిందా లేదంటే అనుకోకుండా మడత పడిందా?అని ఆలోచిస్తూ ఉంటాడు. 

కృష్ణ, మురారి డెకరేషన్ దగ్గర ఉంటారు. ఈ ప్రోగ్రామ్ తో ముకుంద మీద పెద్దత్తయ్యకి అనుమానం పోతుందని కృష్ణ అంటే తర్వాత మన శోభనం ముహూర్తం పెట్టేస్తారు కదా అని మురారి ఆత్రంగా అడుగుతాడు. కృష్ణ మళ్ళీ చేతిని చూసుకుని బాధపడుతుంది. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందామని అనుకున్నా పొద్దున మీరు ఇచ్చిన రింగ్ పోయిందని ఫీల్ అవుతుంది. 

కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారి 

రింగ్ పెట్టినవాడు పక్కనే ఉంటే దాని గురించి ఆలోచిస్తావ్ ఏంటి? దాని కంటే అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి హార్ట్ షేప్ బెలూన్ గులాబీ పువ్వు తీసుకుని మోకాళ్ళ మీద కృష్ణ ముందు ఉండి హ్యాపీ వాలెంటైన్స్ డే ఐలవ్యూ కృష్ణ అని చెప్తాడు. అది ముకుంద చూస్తుంది. అది నేను ఉండాల్సిన చోటు కదా నువ్వు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నీ నుంచి నన్ను దూరం చేసింది. నువ్వు చెప్పావే అనుకో నేను ఎందుకు ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే చేసుకొను అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తూ ఏడ్చే పరిస్థితి వచ్చేది కాదని బాధపడుతుంది. 

కృష్ణ సంతోషంగా మురారి ఇచ్చిన గులాబీ, బెలూన్ తీసుకుని ఐలవ్యూ చెప్తుంది. ఏమైంది నాకు నా ఆలోచనలు మారితే అవి కృష్ణకి కీడు చేస్తాయి. కృష్ణ, మురారి సంతోషంగా ఉండాలని ముకుంద అనుకుంటుంది. కృష్ణ వాళ్ళని మధుకర్ ఫోటోస్ తీస్తాడు. ముకుంద వచ్చి డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోస్ తీయి ఫ్రేమ్ చేయించి హాల్లో పెట్టుకుందామని అంటుంది. ముకుందకి ఆదర్శ్ మీద ప్రేమ లేదా? ఆదర్శ్ కి కూడా తనకి ఇలాగే ప్రపోజ్ చేయాలని కోరిక ఉండదా? అని ముకుందని ఆదర్శ్ నీకు ప్రపోజ్ చేస్తుంటే ఫోటోస్ తీస్తాం వెళ్ళి పిలుచుకుని రమ్మని చెప్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకని ముకుంద అంటే ఇష్టం లేదు కనుక అంటాడు. 

టెన్షన్ లో ముకుంద 

ఫోటో అంటే ఇష్టం లేదంటే ఆదర్శ్ అంటే ఇష్టం లేనట్టేనా తప్పుగా మాట్లాడొద్దని కృష్ణ మధుని తిడుతుంది. ఆదర్శ్ ఇష్టం లేదని నేను ఎప్పుడు అన్నాను కొంతమందికి ఫోటోస్ తీసుకోవడం ఇష్టం లేదు కదా ముకుందకి కూడా అలా ఇష్టం ఉండి ఉండదని అన్నానని చెప్తాడు. అయినా నువ్వు అలా అన్నావ్ అంటే నీకు ముకుంద మీద ఎక్కడో అనుమానం ఉన్నట్టు ఉందని అడుగుతాడు. ఇప్పుడు ఏంటి నేను ఆదర్శ్ తో కలిసి ఫోటోస్ దిగాలి అంతే కదా ఇప్పుడే ఆదర్శ్ ని పిలుస్తానని కోపంగా ముకుంద కమిట్ అవుతుంది. ఆదర్శ్ ఎక్కడ తీసుకురమ్మని మురారి మధుకి చెప్తాడు. ఆదర్శ్ ఎక్కడ ఉన్నాడు కొంపదీసి ఫోటోస్ చూశాడా ఏంటని ముకుంద టెన్షన్ పడుతుంది. 

ఆదర్శ్ ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటే మధు వచ్చి దూరంగా నిలబడి చూస్తాడు. ముకుంద అంటే ఇష్టం ఉంటే మురారిలాగా పెళ్ళాం వెనుక తిరగాలి కదా కానీ ఇక్కడ ఆదర్శ్ ఒంటరిగా నిలబడి ఏమ్ చేస్తున్నాడని కావాలని మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతున్నా కూడా ఆదర్శ్ పట్టనట్టుగా దీర్ఘాలోచనలో మునిగిపోతాడు. ముకుంద మీద నాకు వచ్చిన డౌట్ బ్రోకి కూడా వచ్చిందా? అదే నిజం అయితే ఆదర్శ్ ని ఇక్కడికి తీసుకురావడం పెద్ద పొరపాటు అవుతుందని అనుకుంటాడు. వెళ్ళి ఆదర్శ్ ని పలకరిస్తాడు. తన మీద చేయి వేయడంతో ఆదర్శ్ ఉలిక్కి పడతాడు. ఏంటి తొండ అనుకున్నావా అనేసరికి ఆదర్శ్ సీరియస్ అవుతాడు. 

కూపీ లాగడానికి ట్రై చేసిన మధుకర్ 

ఏమైంది ప్రాబ్లం ఏముంది? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావని మధు అడుగుతాడు. ఏమి లేదని ఆదర్శ్ జవాబు ఇస్తాడు. కానీ మధు మాత్రం కాదు ఏదో ఉంది ముకుంద మారిందని కశ్మీర్ నుంచి నువ్వు తిరిగి వచ్చావా? ముకుందతో హ్యాపీగానే ఉన్నావ్ కదా. ఉంటే ఈ టైమ్ లో ముకుంద దగ్గర ఉండాలి కదా ఒంటరిగా ఇక్కడ ఉన్నావ్ ఏంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సాల్వ్ చేస్తానని అడుగుతాడు. దీంతో ఆదర్శ్ సీరియస్ గా ఇంకోసారి అడిగితే చావగొడతానని తిడతాడు. 

నువ్వు ఏదో దాస్తున్నావ్ అన్నింటినీ బయటకి లాగుతానని మధు మనసులో అనుకుంటాడు. ఆదర్శ్ ప్రోగ్రామ్ జరిగే చోటుకి వస్తాడు. ఎక్కడికి వెళ్లిపోయావని కృష్ణ అంటే వేరే లోకంలో ఉన్నాడని మధు అంటాడు. పొద్దున్నే మొదలు పెట్టేశారా అని కృష్ణ అంటే మొదలు పెడదామనే అనుకున్నా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలంటే ధైర్యం కావాలి కదాని ఆదర్శ్ ముకుందని చూస్తూ చెప్తాడు. ఆ మాటకి అందరికీ అనుమానం వస్తుంది. ఫోటోస్ చూసినట్టు ఉన్నారు ఇన్ డైరెక్ట్ గా వాటి గురించే మాట్లాడుతున్నాడని ముకుందకి అర్థం అవుతుంది. 

తరువాయి భాగంలో.. 

వాలెంటైన్స్ డే ప్రోగ్రామ్ మొదలవుతుంది. జలజల పాతం సాంగ్ కి ముకుంద, మురారి డాన్స్ చేస్తారని మధు అంటాడు. మురారి బెలూన్ ఇవ్వగానే ముకుంద సంతోషంగా తీసుకుని తనతో కలిసి హ్యాపీగా డాన్స్ చేస్తుంది. వాళ్ళని కృష్ణ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ముకుంద కల అయి ఉంటుంది. 

Whats_app_banner