Rose Day 2024: వాలెంటైన్ వీక్‌‌లో మొదటి రోజు రోజ్ డే, ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం-rose day 2024 the first day of valentines week is rose day each color rose has a different meaning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rose Day 2024: వాలెంటైన్ వీక్‌‌లో మొదటి రోజు రోజ్ డే, ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం

Rose Day 2024: వాలెంటైన్ వీక్‌‌లో మొదటి రోజు రోజ్ డే, ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం

Haritha Chappa HT Telugu
Feb 07, 2024 02:40 PM IST

Rose Day 2024: వాలెంటైన్ వీక్ మొదలయ్యేది ‘రోజ్ డే’తోనే. గులాబీలు ఎన్నో రంగుల్లో పూస్తాయి. ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం ఉంటుంది. రోజ్ డే సందర్భంగా ఏ రంగు గులాబీ… ఎలా అర్థాన్ని వివరిస్తుందో తెలుసుకుందాం.

రోజ్ డే
రోజ్ డే (Pexels)

Rose Day 2024: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. వాలెంటైన్స్ వీక్ లో మొదటిరోజు ‘రోజ్ డే’. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ వీక్ ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. ప్రేమ వారోత్సవంలో ప్రేమికులు ఒకరికొకరు బహుమతుల వర్షం కురిపించుకుంటారు. వాలెంటైన్స్ వీక్ ప్రారంభాన్ని రోజ్ డే సూచిస్తుంది. రోజ్ డే… ఫిబ్రవరి 7న. గులాబీ పువ్వు ప్రేమ, అభిరుచి, స్వచ్ఛతను సూచిస్తుంది. కాబట్టి రోజ్ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. గులాబీలు ఎన్నో రంగుల్లో లభిస్తాయి. ఒక్కో రంగు గులాబీ ఒక్కో అర్థాన్ని సూచిస్తుంది. గులాబీల రంగులు, వాటి అర్థాల జాబితా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గులాబీల రంగులు చెప్పే అర్థాలు

ఎరుపు గులాబీ: ఎరుపు రంగు ప్రేమ, అభిరుచిని సూచిస్తుంది. ఎరుపు గులాబీని తరచుగా మనం ప్రేమించే వ్యక్తికి ప్రేమను ప్రపోజ్ చేయడానికి ఇస్తారు. ఇది శృంగార కోరికలను కూడా సూచిస్తుంది. వాలెంటైన్స్ వీక్ లోని మొదలిరోజైన రోజ్ డేలో ఎక్కువగా సేల్ అయ్యేది ఎర్రగులాబీలే.

తెలుపు గులాబీ: తెలుపు గులాబీలు ప్రేమ, గౌరవాన్ని సూచిస్తాయి. తెల్లగులాబీలు శాంతికి చిహ్నంగా చెప్పుకుంటారు. ఇంట్లో కంటి ఎదురుగా తెల్లగులాబీలు కనిపిస్తూ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో విలువైన వ్యక్తికి తెల్ల గులాబీని బహుమతిగా ఇస్తూ ఉంటారు.

పసుపు గులాబీ: ఈ గులాబీ స్నేహం, ఆప్యాయత, ఆనందాన్ని సూచిస్తుంది. తరచుగా స్నేహితులు ఒకరికొకరు పసుపు గులాబీలను బహుమతిగా ఇచ్చి వారి స్నేహం ఎంత ముఖ్యమో చెబుతారు. స్నేహితుల రోజు పసుపు గులాబీలు ఎక్కువగా అమ్ముడవుతాయి.

నీలం గులాబీ: నీలం సున్నితత్వాన్ని, భావోద్వేగాలను సూచిస్తుంది. నీలం బలాన్ని సూచించే రంగు. నీలి గులాబీలను మరొక వ్యక్తికి బహుమతిగా ఇవ్వడం వారి పట్ల మీకున్న భావోద్వేగాలను సూచిస్తుంది.

పీచ్ గులాబీ: పీచ్ రంగులో ఉండే గులాబీ సానుభూతి, వినయం, చిత్తశుద్ధిని సూచిస్తుంది. మీ బంధం తమ చిత్తశుద్ధిని చాటుకోవడానికి ప్రేమికులు తరచూ ఒకరికొకరు పీచ్ గులాబీలను బహుమతిగా ఇచ్చుకుంటారు.

పింక్ గులాబీ: ఈ గులాబీలు స్త్రీత్వాన్ని, సొగసును, సౌందర్యాన్ని సూచిస్తాయి. ఎవరికైనా పింగ్ గులాబీ ఇస్తే వారు చాలా అందంగా ఉన్నారని చెప్పకనే చెప్పినట్టు. మీకు ఎవరైనా అందంగా ఉన్నట్టు అనపిస్తే ఆ విషయాన్ని వారికి చెప్పడానికి పింక్ గులాబీలను ఇవ్వండి.

లావెండర్ రోజ్

ఇది ఊదారంగులో ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది మీకు ఇష్టమైన వారికి ఇస్తే... వారి పట్ల మీకు ఆకర్షణ ఉన్నట్టు అర్థం.

నారింజ రంగు గులాబీ

ఆరెంజ్ రంగులో ఉండే గులాబీ ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఉత్సాహానికి ప్రతీక. ఎదుటివారిని చూడగానే మీకు ఉత్సుకత, ఉత్సాహం పెరుగుతాయని చెప్పడానికి ఈ రంగు గులాబీని ఇవ్వవచ్చు.

ప్రపంచంలోని అందమైన పూవుల్లో గులాబీది అగ్రస్థానం. దీన్ని చూస్తూనే మైమరచిపోతుంటాం. అందుకే ఎన్నో వేల పూలు ఉండగా ప్రేమకు చిహ్నంగా గులాబీనే నిలిచింది. అందమైన రేకులతో, సుగంధంతో మనసును ఇది ఆకర్షిస్తుంది. ప్రేమించిన వారికి ఒక్క రోజా పువ్వు ఇచ్చినా చాలు… వారి మనసును దోచేసుకోవచ్చు.

Whats_app_banner