Rose Day 2024 : రోజ్ డే ప్రాముఖ్యత.. ఏ రంగు గులాబీ పువ్వు ఎందుకు ఇవ్వాలి?
Rose Day Importance : రోజ్ డే వచ్చేసింది. మీ ప్రియమైన వారికి గులాబీ పువ్వు ఇచ్చి వారిపై మీకు ఉన్న ప్రేమను వ్యక్తిపరచండి. మీరు ఎంతలా ప్రేమిస్తున్నారో.. ఏం చెప్పలనుకుంటున్నారో గులాబీలా ద్వారా చెప్పవచ్చు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకొంటారు. ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 14 వరకు వాలెంటైన్స్ వీక్. వివాహిత జంటలు, ప్రేమికులు ఈ వారంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇష్టమైన బహుమతులు ఇవ్వడం ద్వారా తమ ప్రియమైనవారితో సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న రోజ్ డేతో వాలెంటైన్ వీక్ మెుదలవుతుంది. ఇది ప్రేమికుల వారంలో మొదటి రోజు. ఈ రోజున తమ ప్రియమైన వారికి గులాబీ పువ్వులు ఇచ్చి.. తమ మదిలో ఉన్న విషయాన్ని అర్థమయ్యేలా చేస్తారు.
ఎవరిపైనైనా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పేందుకు ఈ రోజ్ డేని జరుపుకోవచ్చు. ప్రతి గులాబీ రంగుకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. గులాబీ రంగు భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. ఏ పువ్వు ఏ సందర్భానికి ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అలాగే ఎవరికి ఎలాంటి పూలు ఇవ్వాలో కూడా చూడండి. గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా ఎర్ర గులాబీ ప్రేమకు చిహ్నం. ఫిబ్రవరి 7న ప్రియమైన వారికి గులాబీ పువ్వులు ఇస్తారు.
ఎర్ర గులాబీని ఇవ్వడం వెనుక ప్రత్యేక అర్థం ఉంది. ఈ ఎరుపు గులాబీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇస్తారు. మీరు దీన్ని ఈ గులాబీని తీసుకుంటే ప్రేమను అంగీకరించినట్లు అర్థం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎర్ర గులాబీని ఇస్తారు. ఈ గులాబీ ప్రేమ, అందం, గౌరవం, శృంగారాన్ని సూచిస్తుంది. ఎరుపు గులాబీ ప్రేమకు చిహ్నంగా ఉండటానికి ఇదే కారణం.
తెల్ల గులాబీలు స్వచ్ఛమైన ప్రేమను సూచిస్తాయి. అవతలి వ్యక్తి మీ కోసం వారిని ఎంచుకున్నారని భావిస్తారు. అంతేకాకుండా మీకు, మీ భాగస్వామికి మధ్య ఏవైనా విభేదాలు ఉంటే, ఈ తెల్ల గులాబీ సంబంధాన్ని పునరుద్దరించటానికి కూడా సహాయపడుతుంది.
పసుపు రంగు గులాబీ స్నేహానికి చిహ్నంగా చెబుతారు. మీరు మీ స్నేహితులను ప్రేమిస్తున్నారని చెప్పాలనుకుంటే, మీరు వారికి పసుపు గులాబీలను ఇవ్వవచ్చు. ఈజీగా విషయం వారికి అర్థమవుతుంది.
పింక్ గులాబీ సంరక్షణ, ప్రేమను సూచిస్తుంది. ఈ గులాబీ ఆనందం, కృతజ్ఞత, సంబంధం అందాన్ని సూచిస్తుంది.
నీలం గులాబీలు చాలా అరుదు, అందుకే వాటిని రోజ్ డేనాడు ఎవరికైనా ఇవ్వడం ఆ వ్యక్తి మీకు ఎంత ప్రత్యేకమైనదో చూపిస్తుంది.
నారింజ రంగు గులాబీ అభిరుచికి చిహ్నం. జంటలు తమ ప్రేమలో అభిరుచిని సూచించడానికి నారింజ గులాబీలను ఇవ్వవచ్చు.
మీరు ఎవరినైనా ఇష్టపడితే, వారితో ప్రేమ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటే పసుపు, ఎరుపు కలిపిన గులాబీల కలయికతో పుష్పగుచ్ఛాన్ని రోజ్ డే నాడు ఇవ్వవచ్చు.
ఊదారంగు గులాబీ అంటే మొదటి చూపులోనే ప్రేమ. మీరు ఎవరికైనా ఈ విషయం చెప్పాలనుకుంటే వారికి ఒక పర్పుల్ గులాబీని రోజ్ డే నాడు ఇవ్వండి. ఎవరికైనా ఆకర్షితులైతే ఈ రంగు గులాబీలను కొని ఇవ్వండి.
సంబంధాన్ని ముగించడానికి లేదా అయిష్టతను వ్యక్తం చేయడానికి నల్ల గులాబీని ఇవ్వవచ్చు. నలుపు రంగు అశుభకరమైనదిగా పరిగణిస్తారు. కానీ వాలెంటైన్స్ డేకి నల్ల గులాబీలు అవసరం లేదు.
మీరు మీ ప్రియమైన వారికి రోజ్ డే సందర్భంగా ఎలాంటి గులాబీ ఇస్తారో డిసైడ్ అవ్వండి..