Rose Day 2024 : 10 రకాల గులాబీ పువ్వులు, వాటి అర్థాలు
- Roses and Meanings : ప్రేమ, అభిమానం, స్వచ్ఛత, స్నేహం మొదలైన భావాలను సూచించే గులాబీలతో ఫిబ్రవరి 7న రోజ్ డే వాలెంటైన్స్ వీక్‌ను ప్రారంభిస్తుంది. ఈరోజున రకరకాల రంగుల గులాబీలను మీ ప్రియమైన వారికి ఇవ్వొచ్చు.
- Roses and Meanings : ప్రేమ, అభిమానం, స్వచ్ఛత, స్నేహం మొదలైన భావాలను సూచించే గులాబీలతో ఫిబ్రవరి 7న రోజ్ డే వాలెంటైన్స్ వీక్‌ను ప్రారంభిస్తుంది. ఈరోజున రకరకాల రంగుల గులాబీలను మీ ప్రియమైన వారికి ఇవ్వొచ్చు.
(1 / 11)
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే. అయితే దీనికి ముందే వాలెంటైన్స్ వీక్ మెుదలవుతుంది. రోజ్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న జరుపుకునే వాలెంటైన్స్ వీక్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రేమికులు ఒకరికొకరు గులాబీలు ఇచ్చుకుని తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ ప్రియమైన వారికి గులాబీలను బహుమతిగా ఇస్తారు. అయితే గులాబీ పువ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి. గులాబీల వివిధ రంగుల వెనుక అర్థాలు ఉన్నాయి.
(2 / 11)
రెడ్ రోజ్ లోతైన ప్రేమకు ప్రతీకగా చెబుతారు. ఎరుపు గులాబీలు శృంగారానికి సంకేతంగా కూడా అంటారు. ఎరుపు గులాబీలు తీవ్రమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి.
(3 / 11)
తెలుపు గులాబీలు స్వచ్ఛత, కొత్త ప్రారంభాల గురించి తెలుపుతాయి. తెల్ల గులాబీలు అమాయకత్వానికి చిహ్నంగా చెబుతారు. అంటే మీ ప్రేమ, జీవితం స్వచ్ఛంగా ఉండాలని అర్థం.
(Unsplash)(4 / 11)
పింక్ కలర్ గులాబీ దయ, ప్రశంసలను తెలుపుతుంది. ఈ రంగు గులాబీలు ప్రశంసల గురించి చెబుతాయి. ఆప్యాయతను తెలియజేస్తాయి.
(Unsplash)(5 / 11)
ఈ రంగు గులాబీలు ఉత్సాహపూరితమైన, ఉద్వేగభరితమైన కోరికల గురించి చెప్పకనే చెబుతాయి. ఆకర్షణీయమైన భావాలను వ్యక్తపరుస్తాయి.
(Unsplash)(6 / 11)
నీలం గులాబీ అరుదైనవి. మీరు నాకు అరుదైనవారు అనే సంకేతం కూడా ఈ గులాబీ ద్వారా వెళ్తుంది. నీలిరంగు గులాబీలు రహస్యం, తెలియని వాటి పట్ల ఆకర్షణను కలిగిస్తాయని అర్థం.
(Unsplash)(7 / 11)
లావెండర్ గులాబీలు మంత్రముగ్ధులను చేస్తాయని అర్థం. రహస్యాన్ని దాచిపెడతాయని చెబుతుంటారు.
(Unsplash)(8 / 11)
ఈ రకం గులాబీలు ఆలోచనాత్మకతకు చిహ్నంగా అంటారు. క్రీమ్ గులాబీలు శుద్ధి, కొత్త భావాన్ని వెదజల్లుతాయి.
(Unsplash)(9 / 11)
పసుపు రంగు గులాబీ ఆనందం, స్నేహంతో ప్రకాశిస్తు ఉంటాయని అర్థం. పసుపు గులాబీలు ఇస్తే.. ఇద్దరి మధ్య ఆనందాన్ని వ్యాప్తి చేస్తాయని నమ్మకం.
(Unsplash)(10 / 11)
ఆరెంజ్ కలర్ గులాబీ శక్తి, ఉత్సాహానికి ప్రతీక. ఈ గులాబీలు జీవితం కోసం అభిరుచిని రేకెత్తిస్తాయి. ఉత్సాహంగా ఉండేందుకు సాయపడతాయని చెబుతారు.
(Unsplash)ఇతర గ్యాలరీలు