Krishna mukunda murari serial february 2nd: శోభనం జరగడానికి వీల్లేదన్న భవానీ.. కృష్ణ ప్లాన్ ఫెయిల్
Krishna mukunda murari serial today february 2nd episode: ముకుంద మీద అనుమానం రోజురోజుకీ పెరుగుతుందని భవానీ అనుకుంటుంది. ముకుంద గురించి ఆదర్శ్ కి తెలిస్తే ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడోనని భయపడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial today february 2nd episode: ముకుంద మారిపోయిందని ఆదర్శ్ పూర్తిగా నమ్మేస్తాడు. ఇక్కడ అత్తయ్య వాళ్ళని నమ్మించడం కోసం ఈయన్ని రప్పించాను కానీ నేను అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాడు. దీన్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎక్కువ రోజులు ఈయన్ని దూరంగా ఉంచలేను ఏడో ఒకటి చేయాలని అనుకుంటుంది. కృష్ణ రింగ్ చూసుకుని మురిసిపోతుంటే మురారి వచ్చి అడుగుతాడు. ముకుంద మీతో నా వేలికి ఉంగరం తొడిగించిందంటే తను మారింది అనడానికి ఇంతకుమించి ఇంకేం కావాలని కృష్ణ అంటుంది.
మురారి కూడా కృష్ణని సపోర్ట్ చేస్తాడు. కానీ పెద్దత్తయ్యకి ముకుంద మీద నమ్మకం కలిగిందో లేదో అని అనుమానంగా ఉందని చెప్తుంది. ఇంత జరిగిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటుంది. మన శోభనం అయిపోయాక్ పూర్తిగా నమ్మకం వచ్చేస్తుందని అంటాడు. పెళ్ళిలో ఉంగరం ఎందుకు తొడుగుతారో తెలుసా? ఉంగరానికి ఎక్కడ గ్యాప్ ఉండదు. ఈ ఉంగరం లాగే భార్యాభర్తలు కూడా గ్యాప్ లేకుండా కలిసి మెలిసి ఉండాలని అర్థం. ఈ ఉంగరం లాగే సంసారం కూడా స్మూత్ గా సాగిపోవాలని కోరుకుంటూ అలా చేస్తారని మురారి చెప్తాడు. అందరికీ పెళ్ళికి ముందు నిశ్చితార్థం జరిగితే మనకి మాత్రం పెళ్లి అయిన తర్వాత జరిగిందని అంటుంది.
ముకుంద మారకపోతే పరిస్థితి ఏంటి?
భవానీ ముకుంద ప్రవర్తన గురించి ఆలోచిస్తుంది. ముకుంద నిజంగానే కృష్ణ మీద అభిమానంతో చేసిందా లేదంటే ఆదర్శ్ తో రింగ్ పెట్టించుకోవడం ఇష్టం లేక అలా చేసిందా? కృష్ణ మీద లేనిపోని అభిమానం చూపిస్తుంది. అసలు తనని ఎలా అర్థం చేసుకోవాలి. ముకుంద ప్రవర్తన చూస్తుంటే రోజురోజుకీ అనుమానం పెరుగుతుంది కానీ నమ్మకం కలగడం లేదు. నా నమ్మకం నిజం అయితే ఎన్నో ఆశలతో తిరిగి వచ్చిన నా కొడుకు అసలు ఏమైపోతాడు. ముకుంద మారలేదని తెలిస్తే ఉంటాడా? ఈ సారి వెళ్తే జన్మలో కనిపిస్తాడా? ముకుంద మారకపోతే కృష్ణ జీవితంలో ఏ సమస్యలు మొదలవుతాయో ఏంటో? అని అనుకుంటూ ఉండగా రేవతి వస్తుంది.
పంతులు వచ్చి శోభనానికి ముహూర్తం లేవని చెప్పిన దగ్గర నుంచి మీలో మార్పు వచ్చింది. అందుకని పంతులుతో మాట్లాడి పెట్టుడు ముహూర్తం పెట్టించనా అని రేవతి అడుగుతుంది. రేపు ముహూర్తం ఉంది మీరు సరే అంటే మురారి వాళ్ళకి, ఆదర్శ్ వాళ్ళకి కార్యం జరిపించేస్తానని చెప్తుంది. పది పదిహేను రోజుల్లో ముహూర్తం ఉందని అన్నారు కదా మళ్ళీ పెట్టుడు ముహూర్తం పెట్టించడం దేనికని భవానీ కోపంగా అడుగుతుంది. ఇది అందరూ మామూలుగా చేసేదని రేవతి సర్ది చెప్తుంది. కానీ భవానీ మాత్రం పది రోజులు ఓపిక పట్టలేవా? కావాలంటే మురారి వాళ్ళకి పెట్టు ఆదర్శ్ వాళ్ళకి వద్ధని చెప్పేస్తుంది. పిల్లలకు లేని తొందర నీకెందుకని అడుగుతుంది.
శోభానినికి పెట్టుడు ముహూర్తం పెడదామన్న రేవతి
పెళ్లి అయి ఏడాది అవుతుంది పిల్లలు లేరు, భార్యాభర్తలుగా ఒకటి కాకపోతే జీవితం ఏముంటుందని రేవతి చెప్తుంది. భార్యాభర్తలు కావాలని నువ్వు ఆలోచిస్తున్నావ్ శోభనం జరిగితే వాళ్ళ జీవితం అంధకారం అవుతుందేమోనని నేను భయపడుతున్నానని భవానీ మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ అంటే ఇష్టం లేకుండా ముకుంద ఎన్నాళ్ళు నాటకం ఆడుతుంది. శోభనం రోజు బయట పడుతుంది కదా. అదే జరిగితే ఆదర్శ్ శాశ్వతంగా ఇంటికి దూరం అవుతాడు. అలా జరగకూడదని నేనే కావాలని ముహూర్తం లేదని శోభనాన్ని పొడిగిస్తున్నాను అది నికేలా చెప్పాలని భవానీ మనసులోనే మథన పడుతుంది.
పిల్లల కోసం మాత్రమే కాదు మీ గురించి ఆలోచించి కూడా శోభనం కోసం జరిపిద్దామని అంటుంది. అయినా నన్ను ఒప్పించడం కాదు వెళ్ళి కృష్ణ వాళ్ళని ఒప్పించు పెట్టుడు ముహూర్తం కోసం మంచి ముహూర్తానికి ఆదర్శ్ వాళ్ళకి జరిపిస్తానని చెప్తుంది. ముకుంద మనసులో ఏముందో తెలిసే వరకు మురారి తన మనసులో లేడని ఆదర్శ్ ని ఇష్టపడుతుందని తెలిసే వరకు శోభనానికి ముహూర్తం పెట్టేదె లేదని భవానీ నిర్ణయించుకుంటుంది. రేవతి దిగులుగా అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది. ముకుంద మారిపోయింది కదా ఇంకేం కావాలని అనుకుంటుంది. అప్పుడే కృష్ణ, మురారి వచ్చి రేవతిని పలకరిస్తారు. ఏమైందని కృష్ణ వాళ్ళు అడుగుతారు.
భవానీని ఒప్పించాలని చూసిన కృష్ణ
మీ పెద్దమ్మ సంగతి నాకేం అర్థం కావడం లేదు. మీ పెద్దత్తయ్య హ్యాపీగా లేరు. మీ శోభనానికి ముహూర్తాలు లేవని పెట్టుడు ముహూర్తాలు పెట్టించేదా అని అడిగాను కావాలంటే మురారి వాళ్ళకి పెట్టుకో ఆదర్శ్ వాళ్ళకి వద్దు అన్నారని చెప్తుంది. పెద్దత్తయ్యతో తను మాట్లాడతానని కృష్ణ అంటుంది. మురారి ఏమో పెట్టుడు ముహూర్తానికి ఎలాగైన పెద్దమ్మని ఒప్పించమని చెప్తాడు. కృష్ణ రేవతి మళ్ళీ భవానీ దగ్గరకి వెళతారు. ఏంటి రేవతి రికమండేషన్ తీసుకొచ్చావా అంటుంది. రేవతి మాట్లాడిన విషయమే నువ్వు మాట్లాడేటట్టు అయితే వద్దు అని తేల్చి చెప్తుంది. ఎందుకు కోపంగా ఉన్నారని కృష్ణ అడుగుతుంది.
మీకు ఇష్టం లేని పనులు ఇంట్లో ఎవరూ చేయరు. కానీ ఇప్పుడు అత్తయ్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఎలాగూ శోభన్ చేయించాలని అనుకుంటున్నారు కదా ఆ ముహూర్తం ఏదో రేపే ఉందని కృష్ణ అంటుంది. ఉంటే నీకు మీ ఆయనకి ఏర్పాటు చేసుకొండి అంతే కానీ ఆదర్శ్ వాళ్ళకి వద్దని భవానీ కోపంగా చెప్తుంది. మేమే అలా అనుకుంటే ఇంతవరకు ఆగుతామా వాళ్ళకి జరిగినప్పుడే మాకు జరగాలని ఇన్ని రోజులు వాయిదా వేశామని కృష్ణ అంటుంది. ఇప్పటి వరకు చేసింది చాలు కొత్త ప్రయోగాలు చేయకుండా మీ గురించి ఆలోచించుకోమని భవానీ సీరియస్ గా చెప్తుంది. ఇప్పటి వరకు నేను ఏం చేసినా సపోర్ట్ చేశారు అంతా బాగా జరుగుతుంది అనే టైమ్ కి ఎందుకు కాదు అంటున్నారు. ముకుంద మీద మీకింకా అనుమానం పోలేదా అని అడుగుతుంది.
శోభనం జరగడానికి వీల్లేదని తేల్చేసిన భవానీ
తనకి ఎవరి మీద అనుమానం లేదని చెప్తుంది. ముకుంద మారింది ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కృష్ణ మళ్ళీ చెప్తుంది. నాకు ఎలాంటి అనుమానాలు లేవు వాళ్ళు ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉండాలనే ఈ కార్యం వద్దని చెప్తున్నాను ఏ ముహూర్తాన పెళ్లి చేశానో అప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శోభనానికి పెట్టుడు ముహూర్తం పెట్టిస్తే ఏదైనా జరగరానిది జరిగితే భరించే ఓపిక నాకు లేదు. ఆ ముహూర్తం మీకు సరిపోతుందని అంటే మీరు ఏర్పాటు చేసుకోండని కృష్ణతో చెప్తుంది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేయము పంతులు పెట్టె ముహూర్తానికే మాకు జరగాలని కృష్ణ బాధగా వెళ్ళిపోతుంది.
కృష్ణ గదిలో సైలెంట్ గా కూర్చుని ఉంటుంది. పెద్దమ్మ ఏం చెప్పిందని మురారి అడుగుతాడు. అత్తయ్యకి చెప్పిందే తనకి చెప్పిందని అంటుంది. జాతకాలు కుదరాలి లేకపోతే జరగవని ఏవేవో కారణాలు చెప్తుంది. కానీ అది కారణం కాదని అర్థం అవుతుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా సంతోషంగానే కలిసి ఉన్నారు కదాని మురారి అంటాడు. మీ శోభనం మీరు చేసుకోమని చెప్పారు కదా మనం చేసేసుకుందామని అంటాడు.
తరువాయి భాగంలో..
మురారి డైనింగ్ టేబుల్ దగ్గర బెస్ట్ కపుల్ కాంపీటేషన్ లో ముకుంద ఆదర్శ్ పేర్లు ఇచ్చినట్టు చెప్తాడు. ముకుంద షాక్ అయిపోతుంది. ఇందులో మీరు పార్టిసిపెట్ చేస్తున్నారు. దీని వల్ల మీకు ఒకరి మీద మరొకరికి ఉన్న అపోహలు తొలగిపోతాయని కృష్ణ అంటుంది.