Krishna mukunda murari february 19th: కృష్ణని చంపేస్తానన్న దేవ్.. మధు మాటలతో టెన్షన్ పడుతున్న రేవతి, ఏం జరగబోతుంది?-krishna mukunda murari serial february 19th episode dev plans to eliminate krishna for mukunda well being ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 19th: కృష్ణని చంపేస్తానన్న దేవ్.. మధు మాటలతో టెన్షన్ పడుతున్న రేవతి, ఏం జరగబోతుంది?

Krishna mukunda murari february 19th: కృష్ణని చంపేస్తానన్న దేవ్.. మధు మాటలతో టెన్షన్ పడుతున్న రేవతి, ఏం జరగబోతుంది?

Gunti Soundarya HT Telugu
Feb 19, 2024 07:35 AM IST

Krishna mukunda murari serial february 19th episode: ఆదర్శ్ కి ఎలాగైన తన మనసులో ఉన్న మాట చెప్పాలని ముకుంద ప్లాన్ చేస్తుంది. కృష్ణని చంపేస్తానని చెప్పి దేవ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 19వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 19వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial february 19th episode: రెండు జంటలు రిసార్ట్ కి వస్తారు. రెండు సూట్ రూమ్స్ కావాలని అక్కడ రిసెప్షన్ లో అడుగుతారు. మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఆల్రెడీ రెండు సూట్ రూమ్స్ బుక్ అయ్యాయి. ఎవరో ముకుంద పేరు మీద బుక్ చేశారు డబ్బులు కూడా కట్టేశారని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఇక ముకుందనే రూమ్స్ బుక్ చేసిందని అందరూ నమ్మేస్తారు. నేను బుక్ చేయకుండా రూమ్స్ ఎలా బుక్ అయ్యాయని ముకుంద ఆలోచిస్తుంది. ఇక కృష్ణ తన పేరు మీద రూమ్స్ ఎలా బుక్ అయ్యాయా అని ఆలోచిస్తుంది నేనే బుక్ చేశానని తెలియదు పాపం. ఇంకా ముందు ముందు థ్రిల్ అయ్యే మ్యాటర్స్ చాలా ఉన్నాయని కృష్ణ మనసులో అనుకుంటుంది.

ముకుంద గురించి చెప్పిన మధు 

రేవతి దగ్గరకి మధు వచ్చి మళ్ళీ డౌట్ అంటాడు. ముకుంద పనిగట్టుకుని వాళ్ళని బయటకి ఎందుకు తీసుకెళ్లిందని అడుగుతాడు. వాళ్ళు ఏదో సరదాగా వెళ్లారు అందులో ఏముందని రేవతి అంటుంది. ముకుంద ఎప్పుడైనా ఇంత హుషారుగా ఉండటం చూశావా? ఆదర్శ్ వచ్చినప్పుడు కూడా ఇలా లేదని అంటాడు. ముకుంద ఇంత సడెన్ గా యాక్టివ్ అవడం వెనుక ఏదో కారణం ఉంది, వాళ్ళు తిరిగి వచ్చాక ఒక వార్త చెప్తారు. నా అనుమానం నిజం అయితే అది నెగటివ్ అవుతుంది లేదంటే పాజిటివ్ అవుతుందని చెప్తాడు. అక్కకి తన మీద కోపం పోకపోవడానికి కారణం తను మారలేదని కాదు తను చేసిన పనుల వల్ల అయినా నువ్వు ఎందుకు తనని నమ్మడం లేదని అడుగుతుంది.

ఎందుకంటే తన ప్రవర్తన అలా ఉంది. అందరూ ఉన్నప్పుడు ఒకలా ఎవరూ లేనప్పుడు మరోలా ఉంటుంది. ఈరోజు ముకుందలో ఒకరకమైన తెగింపు కనిపించింది. కావాలంటే నువ్వే చూడు వాళ్ళు తిరిగి వచ్చాక తెలుస్తుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. మురారి మళ్ళీ శోభనం అంటూ గోల మొదలుపెడతాడు. కృష్ణ మాత్రం అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దని చెప్తుంది. అసలు మనం బయటకి వెళ్లము ఈ గదిలోనే ఉంటాం తాళం కూడా లేదు. నేనే తాళం వేసి కిటికీలో నుంచి బయటకి విసిరేశానని చెప్పేసరికి కృష్ణ బిత్తరపోతుంది. రూమ్ బాయ్ వచ్చి రూమ్ క్లీన్ చేయాలని అంటే తాళం పోయిందని కృష్ణ గట్టిగా అరిచి చెప్తుంది. తమ దగ్గర ఇంకొక కిఈ ఉందని తీసుకొస్తామని చెప్పి వెళతాడు.

కృష్ణని చంపేస్తానన్న దేవ్ 

ముకుంద తన పేరు మీద రూమ్స్ ఎవరు బుక్ చేశారని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దేవ్ ఫోన్ చేస్తాడు. ఏంటి నీ మొగుడితో శోభనం చేసుకోవడానికి వచ్చావా అని అడుగుతాడు. పళ్ళు రాలిపోతాయి. నేను తనని మొగుడు అనుకోవాలి కదా అప్పటికి ఎప్పటికీ ఈ ముకుంద మనసు మారదని సీరియస్ గా చెప్తుంది. ఇక్కడ నా వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. ఇక్కడ నాపేరు మీద ఎవరో రూమ్స్ బుక్ చేశారని చెప్తుంది. ఇంకెవరూ ఆ కృష్ణ చేసింది. నీ జీవితానికి కృష్ణ పెద్ద అడ్డు. తనని తొలగిద్దామని అనుకుంటే అసలు కుదరడం లేదని అంటాడు. అది కుదిరే పని కాదు ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదని ముకుంద చెప్తుంది. అటు ఆదర్శ్ ఫోన్ మాట్లాడుకుంటూ గదికి వస్తాడు.

నువ్వు ఇలాగే ఆలోచిస్తావ్ కానీ నీ లొకేషన్ పంపించు వీలుంటే కృష్ణని చంపేస్తానని అంటాడు. ప్రాణాలు తీయడం లాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు నాకు అడ్డు పడకుండా ఉంటే చాలు కృష్ణ చాలా మంచిదని చెప్తూ ఉండగా ఆదర్శ్ వస్తాడు. తనని చూసి ముకుంద షాక్ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నవని అడుగుతాడు. తన అన్నయ్యతో మాట్లాడుతున్నానని చెప్తుంది. కృష్ణ గురించి చెప్తున్నావ్ కదా తను చెడ్డదని మీ అన్నయ్య అనుకుంటున్నాడా? అని అడుగుతాడు. అదేం లేదు మామూలుగానే చాలా మంచిదని చెప్తున్నానని అంటుంది.

ముకుందని చంపేస్తానన్న మధుకర్ 

తన ప్లాన్ మొత్తం పాడు చేశాడని మురారి తిట్టుకుంటాడు. కృష్ణ తనని ఆట పట్టిస్తుంది. ఆదర్శ్ వచ్చి ఏంటి చిరాకులో ఉన్నావని అడుగుతాడు. రూమ్ సర్వీస్ అని చెప్పి బయటకి పంపించారని తిట్టుకుంటాడు. ఇక తాగడం కోసం డ్రింక్స్ ఆర్డర్ పెడతారు. ముకుంద తాగితే ఒప్పుకోదని ఆదర్శ్ వద్దని అంటాడు. తను తాగితేనే నేను చెప్పే విషయం విని తట్టుకోగలడని ముకుంద మనసులో అనుకుని మందు తాగడానికి ఒప్పుకుంటుంది. విషయం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. మందు తాగితే ధైర్యం వస్తుందని మధు చెప్తూ ఉంటాడు కదా నేను కొంచెం తాగితే ఎలా ఉంటుందని ముకుంద ఆలోచిస్తుంది. రేవతి మధు చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ముకుంద ఇంకా మురారిని మర్చిపోలేదా? అదే జరిగితే నా బిడ్డల పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే అంతా చక్కబడుతుందని అనుకుంటే మళ్ళీ చిక్కులు పడుతున్నాయా? అని ఆలోచిస్తూ ఉండగా మధు వస్తాడు.

నువ్వు చెప్పేది నిజమైతే కృష్ణ, మురారి ఏమవుతాడు. పాపం ఆదర్శ్ ఇది మారిందని ఎన్నో ఆశలతో వచ్చాడు. ఇది మారలేదని తెలిస్తే తట్టుకోగలడా అని భయపడుతుంది. అసలు తట్టుకోలేడు అందుకే నా అనుమానం నిజం కాకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. నా అనుమానం నిజం అయితే ఆ ముకుందని బతకనివ్వనని మధు ఆవేశపడతాడు. ఒకసారి తప్పు చేసింది, మళ్ళీ అదే తప్పు చేస్తే ఊరుకుంటామా? తను మళ్ళీ అలాగే ఉంటే నేనే ప్రాణాలు తీస్తానని అంటాడు. అప్పుడు నీకు తన అన్నయ్య దేవ్ కి తేడా ఏం ఉంటుంది వీలైతే తన మనసు మార్చాలని రేవతి చెప్తుంది. ఏం చేసినా తన మనసు మారదు మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదని ఆవేశంగా వెళ్ళిపోతాడు.

ఆదర్శ్ కి చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు. చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఇలా అయిపోతున్నాను ఏంటని ముకుంద టెన్షన్ పడుతుంది. కృష్ణ గమనించి ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది. ఏం లేదని చెప్తుంది. ఆదర్శ్ కి ఎలాగైనా నిజం చెప్పాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆదర్శ్ కి ఫోన్ రావడంతో వెళ్ళిపోతాడు. మందు గ్లాస్ తీసుకుని వెళ్లిపొమ్మని మురారి చెప్తాడు. కానీ వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు.

తరువాయి భాగంలో..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందం టే.. కృష్ణ గదిలో శోభనం ఏర్పాట్లు చేస్తుంది. అది చూసి మురారి సంతోషంగా ఉంటాడు. ఆదర్శ్ ఫోన్ మాట్లాడుకుంటే తన వెనుక నిలబడి ఉంటుంది. నన్ను క్షమించు ఆది మురారి మాట కాదనలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు మన పెళ్లి ఇష్టం లేదు. ఇప్పటికే కాదు ఎప్పటికీ మీ మీద ఇష్టం కలగదని ముకుంద చెప్తుంది.

IPL_Entry_Point