Feng shui tips: ఫెంగ్ షూయి చిట్కాలు.. ఇలా చేశారంటే నెగటివ్ ఎనర్జీ పోయి సంపద పెరుగుతుంది-feng shui tips to get rid of negative energy at home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Feng Shui Tips: ఫెంగ్ షూయి చిట్కాలు.. ఇలా చేశారంటే నెగటివ్ ఎనర్జీ పోయి సంపద పెరుగుతుంది

Feng shui tips: ఫెంగ్ షూయి చిట్కాలు.. ఇలా చేశారంటే నెగటివ్ ఎనర్జీ పోయి సంపద పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu
Jan 30, 2024 11:31 AM IST

Feng shui tips: వాస్తు శాస్త్రం మాదిరిగానే ఫెంగ్ షూయి శాస్త్రం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫెంగ్ షూయి ప్రకారం కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తరిమేయవచ్చు.

నెగటివ్ ఎనర్జీని తొలగించే ఫెంగ్ షూయి చిట్కాలు
నెగటివ్ ఎనర్జీని తొలగించే ఫెంగ్ షూయి చిట్కాలు (pixabay)

Feng shui tips: ఇంట్లో తరచూ అశాంతి వాతావరణం నెలకొంటుందా? భార్యాభర్తల మధ్య తగాదాలు ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందంటే అందుకు కారణం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ. మనకి తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడం మొదలవుతుంది. దీని వల్ల మనిషి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మనసు కలత చెందుతుంది. గ్రహంలో తరచూ గృహోపకరణాలు సమస్యలు ఏర్పడతాయి. శుభకార్యాలు ఏవైనా తలపెడితే వాటిలో ఆటంకాలు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో ఫెంగ్ షూయి ప్రకారం కొన్ని ప్రత్యేకమైన విషయాలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లోని ప్రతికూలత నుంచి ఉపశమనం కలిగించి సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా చేసే ఈ ఫెంగ్ షూయి ప్రతికే చిట్కాలు మీకోసం. వీటిని పాటించారంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటంకాల నుంచి బయట పడొచ్చు.

విరిగిన పాత వస్తువులు ఉంచొద్దు

ఫెంగ్ షూయి ప్రకారం చాలా కాలంగా పనికి రాని వస్తువులని ఇంట్లో ఎప్పుడు ఉంచుకోకూడదు. ఎక్కువ మంది తమ ఇళ్ళలో స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకుని వినియోగించని వస్తువులు, విరిగిపోయిన పాత వస్తువులు ఆ గదిలో భద్రపరుస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదు. ఇంట్లో చెత్త ఎక్కువగా ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. దీని వల్ల మనసు కలత చెందుతుంది. ఇంట్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.

స్టవ్ క్లీన్ గా ఉండాలి

వంట గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్ గృహానికి గుండె లాంటిది. అందుకే వంట గది పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే గ్యాస్ స్టవ్ ని ఎప్పుడు మురికిగా ఉంచుకోకూడదు. వంట చేసిన ప్రతి సారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దుమ్ము, నూనె పేరుకుపోయి ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి రోజు స్టవ్ శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఆహారం వండాలి.

ఇంటి పరిశుభ్రత ముఖ్యమే

నెగటివ్ ఎనర్జీని వదిలించుకునేందుకు ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపర్చుకోవాలి. రోజు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని ఆ నీటితో ఇంటిని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారు.

వస్తువులు క్రమంగా సర్దు కోవాలి

పిల్లలు ఉండే ఇల్లు చిందరవందరగా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ వస్తువులు వేసేస్తూ ఉంటారు. కానీ వాటిని ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి. ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉందంటే అది ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంచిన వస్తువుల వల్ల కూడా కావచ్చు. అందుకే ఇంటి పరిశుభ్రత చాలా అవసరం. వస్తువులు చక్కగా క్రమబద్ధంగా ఉంచుకోవాలి.

ఆకుపచ్చని మొక్కలు నాటాలి

ఫెంగ్ షూయి ప్రకారం ఇంటి ఆగ్నేయం సంపద, ఆనందం, శ్రేయస్సుకి కారకంగా పరిగణించబడుతుంది. లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్ ఆగ్నేయ మూలలో పచ్చని మొక్కలు ఉండే కుండీలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని నమ్ముతారు.

ఉప్పు డబ్బా మూత పెట్టె ఉండాలి

కిచెన్ లో ఎప్పుడు ఉప్పు డబ్బా మీద మూత పెట్టుకుని ఉంచాలి. ఉప్పు నెగటివ్ ఎనర్జీని తొందరగా ఆకర్షిస్తుంది. అందుకే ఎప్పుడు ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా వదిలేయకూడదు. మూత లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఉప్పులోకి చేరి వంటలలో ఉపయోగించినప్పుడు అది మన శరీరంలోకి చేరిపోతుంది. అందుకే పొరపాటున కూడా మూత తీసి పెట్టకూడదు.

Whats_app_banner