Feng Shui Office Tips: ఫెంగ్ షూయి ప్రకారం ఆఫీసులో ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం మీ వెంటే-follow feng shui office tips for prosperity and success ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Follow Feng Shui Office Tips For Prosperity And Success

Feng Shui Office Tips: ఫెంగ్ షూయి ప్రకారం ఆఫీసులో ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం మీ వెంటే

Gunti Soundarya HT Telugu
Dec 08, 2023 01:47 PM IST

Feng shui office tips: ఫెంగ్ షూయి ఆఫీసు చిట్కాలు పాటించడం వల్ల వ్యాపారంలో, కార్యాలయంలో వృద్ధి సాధిస్తారు.

ఆఫీసు ఇలా ఉంటే అన్నింటా విజయమే
ఆఫీసు ఇలా ఉంటే అన్నింటా విజయమే (Pixabay)

ఎంత కష్టపడినా ఒక్కోసారి అదృష్టం చేతికి అందినట్టే అంది చేజారిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా ఆశించిన విజయం సాధించలేకపోతున్నారా? అయితే మీ ఆఫీసు ఫెంగ్ షూయి ఆఫీసు చిట్కాల ప్రకారం పెట్టుకున్నారంటే అన్నింటా విజయం మీదే అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఫెంగ్ షూయి అంటే ఏంటి?

ఫెంగ్ షూయి అనేది పురాతన చైనీస్ సంప్రదాయం. ఇది సానుకూల నెలకొల్పడంలో సహాయపడుతుంది. శ్రేయస్సు, అదృష్టం, ఆనందం కలగడానికి అవసరమైన వస్తువులు ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పురాతన చైనీస్ సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ అనేక మంది ఫాలో అవుతున్నాయి. ఫెంగ్ షూయు పద్ధతులు అనుసరించడం వల్ల జీవితంలో ఆశించిన స్థాయిలో మార్పులు జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. నర దిష్టి తగలకుండా ఎక్కువ మంది అనుసరిస్తున్న ఈవిల్ ఐ అనేది ఫెంగ్ షూయి సంప్రదాయం.

ఫెంగ్ షూయి ఆఫీసు చిట్కాలు

ఫెంగ్ షూయి ఆఫీసు చిట్కాలు పాటించడం వల్ల మీ వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఆఫీసులో ప్రధానంగా పవర్ డెస్క్ ముఖ్యమైన భాగం ఇక్కడి నుంచే మీరు ఉద్యోగుల పనితీరుని గమనిస్తూ ఉంటారు. ఈ డెస్క్ సహజ కాంతి లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు కూర్చునే సీటు పక్కన పెద్ద పెద్ద కిటికీలు ఉండే విధంగా చూసుకోవాలి.

చీకటి ప్రదేశంలో పనులు చేయడం వల్ల కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. మీలోని శక్తి సన్నగిల్లుతుంది. సహజ కాంతి మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఆఫీసు కార్యాలయం విశాలంగా ఉండేలా చూసుకోవాలి

ఫెంగ్ షూయి మొక్కలు

ఇంట్లో మాత్రమే కాదు ఆఫీసులోను మొక్కల కుండీలు పెట్టుకుంటే ఆ ప్రాంతం అందంగా కనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఫెంగ్ షూయి ప్రకారం ఆఫీసు డెస్క్ మీద జాడే సక్యూలెంట్ మొక్క పెట్టుకుంటే మంచిది. ఇది ఫెంగ్ షూయి మొక్కలలో ఉత్తమమైనది, పవిత్రమైనది.

ఫెంగ్ షూయి మొక్కలలో మరొకటి రబ్బర్ ప్లాంట్. ఆఫీసు వాయువ్య భాగంలో ఉంచితే మీ సంపద పెరుగుతుంది. వెదురు మొక్క కుండీ పెట్టుకోవచ్చు. సంపద, శ్రేయస్సు, అదృష్టానికి వెదురు చయిహంగా నిలుస్తుంది. ఈ మొక్కను కార్యాలయం ఈశాన్య మూలలో ఉంచాలి. దీనికి సూర్యరశ్మితో పని లేదు. ఎయిర్ కండిషన్ ఆఫీసులో కూడా బాగా పెరుగుతుంది.

పీస్ లిల్లీ గాలిని శుద్ధి చేసే లక్షణాలకి ప్రసిద్ది చెందింది. ఇది ఆఫీసులో పెట్టుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

డెస్క్ శుభ్రంగా ఉండాలి

టేబుల్ మీద వస్తువులు చిందరవందరగా ఉండకూడదు. అవి ప్రతికూలతని ఆకర్షిస్తాయి. డెస్క్ మీద రోజూ ఉపయోగించే వస్తువులు మాత్రమే ఉంచుకోవాలి. మీకు ఇష్టమైన దేవుడు లేదా ప్రియమైన వారి ఫోటో పెట్టుకోవచ్చు. అవసరం లేని వాటిని కబోర్డ్ లో పెట్టుకోవాలి. చిందరవందరగా ఉంటే మీ మనసు ఆలోచనలు కూడా గందరగోళానికి గురవుతుంది.

ఫెంగ్ షూయి కార్యాలయం ఎప్పుడు స్పూర్తిదాయకంగా ఉండాలి. డెస్క్ వెనుక గోడ మీద మంచి కొటేషన్స్ పెట్టుకోవాలి. ఆకర్షణీయమైన పోస్టర్స్ తగిలించాలి. ఈ కోట్స్ కార్యాలయంలో పని చేసే వారికి కనిపించేలా పెట్టాలి.

ఈ రంగులు మంచిది

ఫెంగ్ షూయి కార్యాలయంలో రంగులు ఉత్తమమైనవి ఎంచుకోవాలి. ఫ్లోరింగ్ దగ్గర నుంచి ఆఫీసులో ఉండే ఫర్నిచర్ వరకు కళ్ళకి ఇంపుగా ఉండే వాటిని అమర్చాలి. సృజనాత్మకంగా ఉండాలని అనుకుంటే ఎరుపు, పసుపు, నారింజ ఉపయోగించవచ్చు. నలుపు రంగు ఫర్నీచర్ తీసుకుంటే అదృష్టం, సంపదని తెస్తుంది. ఒత్తిడి లేకుండా కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే లేత రంగులు సహాయపడతాయి.

నీరు ఉండే వస్తువులు

ఫెంగ్ షూయి కార్యాలయ చిట్కాలలో అతి ముఖ్యమైనది నీరు. ఇది డబ్బుకి చిహ్నంగా భావిస్తారు. విజయం, అదృష్టం కోసం ఆఫీసులో గోల్డ్ ఫీస్ తో కూడిన చిన్న అక్వేరియం పెట్టుకోవచ్చు. లేదంటే చిన్న సైజులో ఉండే ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫెంగ్ షూయి వాటర్ ఫౌంటెన్ లో నీరు వేగంగా ప్రవహించకుండ ఉండేలా చూసుకోవాలి.

ఇంట్లో ఆఫీసు రూమ్ కోసం

కొంతమంది ఇళ్ళలోను ఉద్యోగం చేసుకునేందుకు గది ఏర్పాటు చేసుకుంటారు. హోమ్ ఆఫీసు పశ్చిమం లేదా నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. ఉత్తరం లేదా తూర్పు దిక్కున కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వంటి రంగాలలో పని చేసే వాళ్ళు ఇంట్లో ఆఫీసు పెట్టాలనుకుంటే ఉత్తరాన పెట్టడం మంచిది.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.