Krishna mukunda murari february 15th:బెస్ట్ కపుల్ గా మురారి, కృష్ణ.. కశ్మీర్ వెళ్లిపోదామన్న ఆదర్శ్, ముకుంద ప్లాన్ ఫెయిల్
Krishna mukunda murari february 15th episode: వాలెంటైన్స్ డే రోజు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో బెస్ట్ కపుల్ మురారి, కృష్ణ జంటని భవానీ ప్రకటిస్తుంది. వారికి గిఫ్ట్ ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari february 15th episode: వాలెంటైన్స్ డే ప్రోగ్రామ్ లో కృష్ణ వాళ్ళ పెర్ఫామెన్స్ ని అందరూ మెచ్చుకుంటారు. కానీ నందిని మాత్రం తాగి వచ్చినంత మాత్రాన ఇలా చేస్తారా? అది కరెక్ట్ కాదని అంటుంది. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు పెద్ద పెద్దమ్మ అంటాడు. అప్పుడే భవానీ గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వస్తుంది. ఇద్దరు కొడుకుల్ని బాగా చేశారని మెచ్చుకుంటుంది. బెస్ట్ కపుల్ కృష్ణ, మురారి అని భవానీ అనౌన్స్ చేసి గిఫ్ట్ వాళ్ళకి ఇస్తుంది. ఏయ్ తింగరి నువ్వు ఇలాగే తింగరి వేషాలు వేస్తూ మీ ఇద్దరూ కలకాలం కలిసి ఉండాలని భవానీ దీవిస్తుంది. ఆదర్శ్ వాళ్ళు మురారి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తారు. ఫీల్ అయ్యావా అని ఆదర్శ్ అంటే అలా ఏం లేదు ఎవరికి ఇస్తే ఏంటని ముకుంద అంటుంది. కానీ మనసులో మాత్రం నాకు తెలుసు అత్తయ్యకి అంత త్వరగా నా మీద ఇంప్రెషన్ పోదని అనుకుంటుంది.
వెళ్ళిపోయిన భవానీ
అందరికీ ఒక సీరియస్ విషయం చెప్పాలని భవానీ అంటుంది. తన గురించి చెప్తారేమోనని ముకుంద టెన్షన్ పడుతుంది. కానీ భవానీ తాను అమెరికా వెళ్తున్నట్టు చెప్తుంది. ఇంత సడెన్ గా ఎందుకని అడుగుతుంది. ఎప్పుడు బయల్దేరుతున్నారని కృష్ణ అంటే రేపేనని చెప్తుంది. ఈ విషయం ముందే చెప్పాలని అనుకున్నా కానీ నా గురించి ఆలోచించి మీరు ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టరని చెప్పలేదని అంటుంది. ఇక అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఏం చేయాలో చెప్తాను అప్పుడు చేయమని ఆదర్శ్ కి చెప్తుంది. ఇక మురారికి పై అధికారులతో మాట్లాడాను వన్ వీక్ లో పోస్టింగ్ వస్తుందని అంటుంది. కృష్ణ మాత్రం బాధగా మొహం పెట్టి అలుగుతుంది. మీ చిన్నాన్నతో మాట్లాడాను వన్ వీక్ లో వస్తారు రాగానే హాస్పిటల్ పనులు చూసుకోమని చెప్పాను నువ్వు కూడా చూసుకోమని చెప్తుంది. అందరికీ ఏమేం చేయాలో చెప్తుంది.
నేను ఉండటం లేదు కదా నా పోస్ట్ లో ఇక నుంచి నువ్వు ఉండాలని రేవతికి చెప్తుంది. ఇక వెళ్లిపోతుంటే ముకుంద పిలిచి నాకేం చెప్పరా అని అడుగుతుంది. నీకు చెప్పేది ఏముంది నువ్వు మారడం నిజమే కదా.. ఇన్నాళ్ళూ ఆదర్శ్ కోసం ఎదురుచూడటం నిజమే కదా. అయితే ఆదర్శ్ తో హ్యాపీగా ఉండు. నేను చేయాల్సింది చేశాను కదా ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది. ఏం చేయాలన్నా చెప్పాలన్నా ఇక మీరు మీరు చూసుకోండని చెప్తుంది. దీంతో ముకుంద మొహం మాడిపోతుంది. కృష్ణ మాత్రం పరుగున వెళ్ళి భవానీని హగ్ చేసుకుని బాధ పడుతుంది.
ముకుంద మంచి భార్య కాదన్న రేవతి
కృష్ణ గిఫ్ట్ బాక్స్ ముందు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. మురారి సెటైర్స్ వేస్తాడు. ముకుంద వాళ్ళు అంత బాగా డాన్స్ చేశారు కదా అలాంటిది వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వకుండా మనకి ఎందుకు ఇచ్చారని కృష్ణ అంటుంది. కదా నేను అదే అనుకుంటున్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని మురారి కూడా అంటాడు. పెద్దత్తయ్యకి ఇంకా ముకుంద మీద అనుమానం పోయినట్టు లేదని కృష్ణ చెప్తుంది. రేవతి వచ్చి వాళ్ళని మెచ్చుకుంటుంది. కొడుకు కోడల్ని చూసి మురిసిపోవడం తప్ప వేరే పని లేదా అత్తయ్య, ముకుంద వాళ్ళు అంత బాగా చేసినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇచ్చారు. ముకుంద మీద కోపంతో నాకు ఇచ్చారని మేము అనుకుంటుంటే మీరు బాగా జరిగిందని అంటారు ఏంటని అడుగుతుంది.
నీ మొహం మీరు బాగా చేశారు కాబట్టి ఇచ్చిందని రేవతి చెప్తుంది. మీ పెద్దమ్మ అంత పిచ్చిది ఏం కాదు నువ్వు భార్యగా బాగా నటించావని ఇచ్చిందని అంటుంది. నేను తాగొచ్చిన భర్తని బయటే పడుకోబెట్టాను కానీ ముకుంద ఇంట్లో కూర్చోబెట్టి మందు పోసి అన్నం కూడా తినిపించింది కదా తాను మంచి భార్య కదాని కృష్ణ అడుగుతుంది. మంచితనం అంటే తప్పు చేసిన వాడిని ప్రోత్సహించడం కాదు బయట తాగుతున్నాడని ఇంట్లో కూర్చోబెట్టి మందు పోయడం మంచితనం ఎందుకు అవుతుంది. అదే అలవాటు అయి అతను తాగి ఇంట్లో ఏ పని చేయకుండా పడుకుంటాడు. అందుకే ముకుంద మంచి భార్య కాదని రేవతి స్పష్టంగా చెప్తుంది. కానీ నువ్వు భర్తతో తాగుడు మాన్పించడం కోసం ఆ క్షణం కఠినంగా ఉన్నావ్ అందుకే నీకు అక్క గిఫ్ట్ ఇచ్చిందని చక్కగా చెప్తుంది.
కశ్మీర్ వెళ్లిపోదామని చెప్పిన ఆదర్శ్
ఆదర్శ్ ముకుంద తనతో డాన్స్ వేసింది, తనతో చనువుగా ఉన్న క్షణాలు గుర్తు చేసుకుని మురిసిపోతాడు. ఫోటోను చూసి మళ్ళీ ముకుందని అపార్థం చేసుకున్నాను అది పాతది అయి ఉంటుంది. అసలు ముకుందకి నేనంటే ఇష్టం లేకుండా ఇంకా మురారి గురించి ఆలోచిస్తూ ఉంటే నాతో అంతబాగా ఎలా డాన్స్ చేస్తుంది. నేను తనని నమ్ముతున్నా కానీ అంతలోనే అపార్థం చేసుకుంటున్నాను. ఇంకా తనని అపార్థం చేసుకున్నానని తెలిస్తే ఎంత బాధపడుతుందని ఫీల్ అవుతాడు. ముకుంద అని ప్రేమగా పిలుస్తే ఇదేంటి ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు మళ్ళీ ఏం చెప్తాడోనని టెన్షన్ పడుతుంది. ఇందాక స్కిట్ లో చేసింది నిజం చేయవా నీ చేత్తో మందు పోస్తే తాగాలని ఉందని అంటాడు.
అత్తయ్య మెప్పు కోసం మురారిని ఊహించుకుని అలా నటించాను కానీ ఈయన అందులో ప్రేమ వెతుక్కున్నారు. ఇప్పటికే ఒకసారి నావల్ల మనసు గాయపడి ఇంటికి దూరం అయ్యారు ఇప్పుడు ఇది నిజం కాదని తెలిస్తే ఏమైపోతారోనని భయపడుతుంది. ముకుంద ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఇష్టం లేదాని అడుగుతాడు. నీ చేత్తో మందు పోస్తుంటే చాలా ఆనందంగా ఉందని అంటాడు. దీంతో ముకుంద మందు పోసి ఆదర్శ్ ఇస్తుంది. మనం ఇద్దరం కశ్మీర్ వెళ్లిపోదామని ఆదర్శ్ చెప్తాడు. ఎందుకు అత్తయ్య మిమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారు కదా అంటుంది. అమ్మ అమెరికా నుంచి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్తాడు.
తరువాయి భాగంలో..
భవానీ ఇచ్చిన గిఫ్ట్ కృష్ణ ఇంట్లో అందరి ముందు ఓపెన్ చేస్తుంది. అందులో బుజ్జి పాపాయి బొమ్మ ఒక లెటర్ ఉంటుంది. తింగరి నీలో ఒక అమ్మ ఉంది నువ్వు నిజంగా అమ్మ అయితే చూడాలని ఉందని లెటర్ లో రాసి ఉంటుంది. అది విని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇది నా ఒక్కదానికే కాదు ముకుందకి కూడా అని అంటుంది.