Krishna mukunda murari february 16th: ఆదర్శ్ ని దూరం చేసుకునేందుకు ముకుంద ప్లాన్.. భవానీ కోరికని కృష్ణ నిజం చేస్తుందా?-krishna mukunda murari serial february 16th episode murari and krishna decide to start new family fo bhavani happiness ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 16th: ఆదర్శ్ ని దూరం చేసుకునేందుకు ముకుంద ప్లాన్.. భవానీ కోరికని కృష్ణ నిజం చేస్తుందా?

Krishna mukunda murari february 16th: ఆదర్శ్ ని దూరం చేసుకునేందుకు ముకుంద ప్లాన్.. భవానీ కోరికని కృష్ణ నిజం చేస్తుందా?

Gunti Soundarya HT Telugu
Feb 16, 2024 07:16 AM IST

Krishna mukunda murari serial february 16th episode: కృష్ణ అమ్మ కావాలని చెప్పి భవానీ దేవి కోరుకుంటుంది. అటు ఆదర్శ్ కి ఎలాగైనా నిజం చెప్పాలని ముకుంద డిసైడ్ అవుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 16వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 16వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial february 16th episode: ఇద్దరం కశ్మీర్ వెళ్లిపోదామని ఆదర్శ్ అడుగుతాడు. ఎందుకని అంటుంది. అక్కడి వాతావరణంలో మనం ఇద్దరం గడపాలి ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనని అంటాడు. నువ్వు అక్కడికి రావాలి ఆ అందాలు, ప్రశాంతత చూస్తే అసలు వదిలిపెట్టవని చెప్తాడు. నా మురారి ఉన్న చోట నాకు ప్రశాంత, తను లేని ప్రదేశం స్వర్గం అయినా సరే ప్రశాంతతని ఇవ్వదని మనసులో అనుకుంటుంది. అక్కడ బాగుంటుంది కానీ ఇక్కడ ఇంత మంచి ఇల్లు, అయిన వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్తాము. పైగా మీకు అక్కడ జాబ్ కూడా లేదు కదా. అత్తయ్య వచ్చిన తర్వాత ఇక్కడే ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చని ముకుంద చెప్తుంది. 

ఆదర్శ్ కి నిజం చెప్పాలనుకున్న ముకుంద 

అదేదో అక్కడ కూడా చేసుకోవచ్చు. మనసుకి నచ్చిన మనిషితో కలిసి బతకడం స్వర్గం. అదే మనిషితో స్వర్గంలాంటి ప్రదేశంలో బతికితే అది మహా స్వర్గం అంటాడు. రోజు రోజుకీ ఈయన నామీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటున్నారు బయటకి తీసుకెళ్ళి నిజం చెప్పాలని ముకుంద డిసైడ్ అవుతుంది. చిన్నాన్నని కలుద్దామా అని కృష్ణ మురారిని అడుగుతుంది. చూద్దాంలే అని అన్నాడని తన మీద గొడవ వేసుకుంటుంది. ఇంకోసారి ఇలా గొడవ చేస్తే బాగోదని మురారి అంటాడు. సరే అయితే మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేయాల్సింది నేను చేస్తానని అంటే ఏం చేస్తావ్ ఏంటని అడుగుతాడు. పెద్దత్తయ్యకి ఫోన్ చేసి ఏదో ఒక కారణం చెప్పి ఇంకొక నెల రోజులు మన శోభనం వాయిదా వెయిస్తానని అనేసరికి మురారి బిత్తరపోతాడు. 

అలా మాత్రం చేయకని దణ్ణం పెట్టేస్తాడు. ఎప్పుడూ నా దగ్గర గిఫ్ట్ తీసుకోవడమే కానీ ఎప్పుడైనా నాకు గిఫ్ట్ ఇచ్చావా అంటాడు. ఇస్తాను త్వరలోనే ఆ గిఫ్ట్ మీరు జీవితంలో మర్చిపోలేరని చెప్పి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. అందరూ హాల్లో ఉంటే కృష్ణ వాళ్ళు వస్తారు. రేవతి అక్క ఇచ్చిన గిఫ్ట్ ఏంటని అడుగుతుంది. చూడలేదని ముకుంద వాళ్ళ గురించి ఆలోచిస్తూ మర్చిపోయామని కృష్ణ చెప్తుంది. పక్కవాళ్ళ గురించి ఆలోచించడం మానేసి కాస్త మీ గురించి ఆలోచించుకోమని నీ పెళ్ళానికి చెప్పమని రేవతి కోపంగా తిడుతుంది. గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చి పెద్దత్తయ్య ఈ గిఫ్ట్ మాకు ఇచ్చిన మనందరికీ ఇచ్చినట్టేనని ముకుంద వాళ్ళతో అంటుంది. ఇది జన్మలో మారదని రేవతి తిడుతుంది.

భవానీ బహుమతి చూసి కృష్ణ ఎమోషనల్ 

గిఫ్ట్ బాక్స్ లో చంటి పాప బొమ్మ ఉంటుంది. అది చూసి కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఈ బొమ్మ చాలా బాగుందని అంటుంది. అందులో ఉన్న లెటర్ మురారి చదువుతాడు. తింగరి నీలో ఒక అమ్మ ఉంది నువ్వు నిజంగా ఒక అమ్మవి అయితే చూడాలని ఉందని రాసి ఉంటుంది. అలాగే నేను వెళ్ళాక ఈ ఇంటికి ఇన్ ఛార్జ్ నువ్వే నా బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకోవాలి. నేను తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సమస్యలు ఒక అమ్మలా నువ్వే పరిష్కరించాలని రాస్తుంది. ఇంతకు అమ్మవి ఎప్పుడు అవుతావని నందిని అడుగుతుంది. అయినా ఇది నా ఒక్కదానికి ఏం కాదు ముకుందకి కూడా అనేస్తుంది. మళ్ళీ నా దగ్గరకి వచ్చింది. ఇలాగే ఉంటే శోభనం పెట్టి పిల్లలని కనమనేలా ఉన్నారు వెంటనే ఆదర్శ్ కి నిజం చెప్పాలి. ఇక్కడ చెప్పడం కష్టం బయటకి ఎక్కడికైనా ప్లాన్ చేయాలని మనసులో అనుకుంటుంది. 

పెద్దత్తయ్య ఇది నీకోసం మాత్రమే తింగరి. ముందు నువ్వే బిడ్డని కనాలని ముకుంద తప్పించుకుంటుంది. తనని ఇంత ప్రేమగా తింగరి అని పిలిచావ్ నీలో మార్పుకి ఇదే నిదర్శనమని కృష్ణ అంటుంది. ఆది వచ్చాక ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామని అనుకుంటున్నా ఇప్పుడు వెళ్దామా అని ముకుంద అడుగుతుంది. కృష్ణ సంతోషంగా వెళ్దామని అంటుంది. అందరితో కలిసి బయటకి వెళ్ళడం ఇష్టం లేదు డస్ట్ అలర్జీ అన్నది కదా ఇప్పుడు తనే బయటకి వెళ్దామని ప్రపోజల్ పెట్టింది. ఫోటో విషయంలో నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? ముకుంద మనసులో నిజంగా నాకు చోటు ఉందా? అని ఆదర్శ్ మనసులో అనుకుంటాడు.

బహుమతి చూసి మురిసిపోయిన కృష్ణ 

కృష్ణ భవానీ ఇచ్చిన బొమ్మ చూసుకుని మురిసిపోతుంది. పెద్దత్తయ్యకి నేనంటే ఎంత ప్రేమ. ఇంట్లో ఇంతమంది ఉండగా ఇంటి బాధ్యత నాకు అప్పగించింది. వారసులు ఇమ్మని ఈ పాపాయి బొమ్మని బహుమతిగా ఇచ్చిందని అంటుంది. అవి ఖచ్చితంగా నెరవేర్చాలని మురారి అంటాడు. నేను ఇంటి బాధ్యతని బాగానే చూసుకుంటున్నాను కదాని చెప్తుంది. అందుకే నిన్ను తింగరి అనేది పాప గురించి ఆలోచించమని చెప్తాడు. ఇందులో ఆలోచించేది ఏముంది సంవత్సరం తిరిగే లోపు పెద్దత్తయ్య చేతిలో బుల్లి చిన్నత్తయ్యని పెడదామని సిగ్గుపడుతూ చెప్తుంది. నిజమా అయితే ఇప్పటి నుంచే కష్టపడదామని తెగ హడావుడి చేసేస్తాడు. హలో అంత లేదు ముహూర్తం పెట్టాలని చివర్లో ట్విస్ట్ ఇస్తుంది. 

Whats_app_banner