Happy Kiss Day 2024 : బంధం బలపడాలంటే ముద్దు కూడా ముఖ్యమే.. హ్యాపీ కిస్ డే-happy kiss day 2024 greetings quotes whatsapp status facebook messages types of kisses ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Kiss Day 2024 : బంధం బలపడాలంటే ముద్దు కూడా ముఖ్యమే.. హ్యాపీ కిస్ డే

Happy Kiss Day 2024 : బంధం బలపడాలంటే ముద్దు కూడా ముఖ్యమే.. హ్యాపీ కిస్ డే

Anand Sai HT Telugu

Happy Kiss Day 2024 : బంధం బలంగా ఉండాలంటే ప్రేమలో ముద్దు కూడా ఓ భాగమే. ఈ కిస్ డే రోజున మీ ప్రియమైన వారికి కింది విధంగా శుభాకాంక్షలు చెప్పండి.

హ్యాపీ కిస్ డే (Unsplash)

వాలెంటైన్స్ వీక్‌లో ఫిబ్రవరి 13న కిస్ డేగా జరుపుకొంటారు. బంధం బలపడాలంటే ముద్దు కూడా ముఖ్యం, నాలుగు పెదవులు కలిస్తే శరీరంలో లవ్ హార్మోన్లు, హ్యాపీ హార్మోన్లు విడుదలై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చే ముద్దులు చాలా రకాలుగా ఉంటాయి. నుదిటిపై ముద్దుపెట్టుకుంటే వారిపై మనకున్న ప్రేమ, చెంపపై ముద్దుపెట్టుకుంటే ప్రేమ అనురాగం మరింతగా ఉందని అర్థం. అయితే ఈ కిస్ డే సందర్భంగా మీరు ప్రేమించిన వారికి అందమైన శుభాకాంక్షలు పంపండి.

మన పెదలు కలిస్తే ఈ ప్రేమ మరింత మధురంగా ​​మారుతుంది.. హ్యాపీ కిస్ డే

నా పెదవులపై నువ్వు పెట్టే ముద్దుకి మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు నా ప్రియతమా Happy Kiss Day

నా కళ్ళు నిన్ను చూడాలని కోరుకుంటున్నాయి.. నా చెవులు నీ స్వరం వినాలని తహతహలాడుతున్నాయి.. నా పెదవులు నీ పెదవులపై ముద్రను వేసేందుకు వేచి ఉన్నాయి.. హ్యాపీ కిస్ డే

నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండాలని నాకు అనిపిస్తోంది.. నాకు నీతో గడపాలని ఉంది.. నీ పెదవులపై ముద్దు పెట్టాలని ఉంది.. హ్యాపీ కిస్ డే

రేపు అనేది లేనట్లుగా ఈరోజు ప్రేమించుకుందాం.. మన ముద్దులతో మన ప్రేమకు సాక్ష్యమిద్దాం.. హ్యాపీ కిస్ డే

అరచేతి మీద ముద్దు.. అరవిందం. నుదిటి మీద ముద్దు.. నీలాంబరం. మెడ మీద ముద్దు ముత్యాలహారం. కంటి మీద ముద్దు కనకాంబరం.. ముక్కు మీద ముద్దు.. ముద్ద మందారం.. హ్యాపీ కిస్ డే

తొలిముద్దు... తొలకరి జల్లు. పాపిటి మీద ముద్దు.. పన్నీటి జల్లు. పెదవి మీద ముద్దు.. పులకరింతల హరివిల్లు. ప్రియమైన ముద్దు.. పరవశాల విరి జల్లు.. Happy Kiss Day

నా గుండె చప్పుడు పెరిగెలా నవ్విచ్చిన తొలి ముద్దు..

నా మనసంతా మైకంలో ముంచివేసింది..

ఇద్దరు కాదు మనం ఒక్కరనే నిజాన్ని గుర్తుచేసింది..

నా సర్వస్వం నువ్వెనని చెప్పకనే చెప్పింది..

నా శ్వాసలో కలిసి నిన్ను నాలో చూడమంది..

Happy Kiss Day

ముద్దుల రకాలు.. వాటి అర్థాలు

ముద్దుల్లో వివిధ రకాలు ఉంటాయి. ఒక్కో ముద్దు ఒక్కో అర్థాన్ని సూచిస్తుంది. చెంప మీద ముద్దు సాన్నిహిత్యం, ఆప్యాయతను చెబుతుంది. పిల్లల్ని చూడగానే ప్రేమగా బుగ్గమీద ముద్దులు పెట్టుకుంటాం, అమ్మా నాన్న చెంపమీద ముద్దులు పెడతాం. ఈ ముద్దు మధురమైన అనుబంధాన్ని సూచిస్తుంది. అలాగే మన భాగస్వామి చెంపపై ముద్దు పెట్టుకున్నప్పుడు అది సాన్నిహిత్యాన్ని కూడా సూచిస్తుంది.

నుదిటిపై ముద్దు ఆప్యాయత, ప్రశంసలను సూచిస్తుంది. మన ప్రియమైన వారిని నుదిటిపై ముద్దు పెట్టుకుంటాం. ఒక తల్లి నిద్రిస్తున్నప్పుడు పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుంది. కొడుకు/కూతురు ఏదైనా సాధించినప్పుడు నాన్న కౌగిలించుకుని నుదిటిపై ముద్దులు పెడతాడు. ఈ ముద్దులో ఆప్యాయత ప్రత్యేకంగా నిలుస్తుంది. మీరు మీ భాగస్వామిని నుదిటిపై ప్రేమతో ముద్దుపెట్టుకున్నప్పుడు, అది భద్రతా భావాన్ని సృష్టిస్తుంది. శృంగారానికి నాంది కూడా ఈ ముద్దుతో ప్రారంభమవుతుంది.

చేతి మీద ముద్దులు మొదట యూరోపియన్ దేశాలలో ప్రారంభమయ్యాయి. ఇది గౌరవం, సాన్నిహిత్యానికి చిహ్నం. ఇప్పుడు చేతిపై ముద్దుకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒక వ్యక్తి స్త్రీ చేతిని ముద్దుపెట్టుకున్నప్పుడు, అతను ఆమె పట్ల శ్రద్ధ చూపుతున్నాడని, ఆసక్తిని కలిగి ఉన్నాడని సూచిస్తుంది.

ఫ్రెంచ్ కిస్.. అదే లిప్ టు లిప్ కిస్ ప్రేమ భావానికి పరాకాష్టను సూచిస్తుంది. ఈ రకమైన ముద్దు లైంగిక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ముద్దులో ప్రేమ, కామం అన్నీ కలగలిసి ఉన్నాయి.

చెవిపై ముద్దు పెట్టుకోవడం లైంగిక ప్రేరేపణ. రొమాన్స్ మూడ్‌ని పెంచే ముద్దు ఇది. ఇలా ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటికి వివిధ అర్థాలు కూడా ఉన్నాయి.