Krishna mukunda murari february 29: నేను విన్నాను.. నేను ఉన్నానన్న కృష్ణ.. ఆదర్శ్ కి బ్రేక్ ఫాస్ట్ పెట్టనన్న ముకుంద
Krishna mukunda murari serial february 29th episode: ముకుంద మాటలు మొత్తం కృష్ణ కూడా వినేస్తుంది. దీంతో తన తిక్క కుదర్చడం కోసం కృష్ణ, మురారి కలిసి ప్లాన్ చేయాలని డిసైడ్ అవుతారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial february 29th episode: తాను ఏ తప్పు చేయడం లేదని ముకుంద మురారిని బతిమలాడుకుంటుంది. కృష్ణకి మన విషయం తెలుస్తుందని బాధపడుతున్నావ్ కదా. తెలియనివ్వు ఈరోజు కాకపోతే రేపు అయినా తెలియాలి కదా. నిన్ను నాకు అప్పగించి ఎలా వచ్చిందో అలా నీ జీవితం నుంచి వెళ్లిపోవాల్సిందే కదా అంటుంది. కలలో కూడా అది జరగదని మురారి చెప్తాడు. జరగాలి. మన జీవితంలోకి ఎవరైతే రావడం వల్ల మనం దూరం అయ్యారో వాళ్ళు వెళ్లిపోవాలని అంటుంది. ఇప్పుడు నీ ముందు ఉన్న ఆప్షన్స్ రెండు.. ఆదర్శ్ ని ఎలాగైనా ఒప్పించి ఇంట్లో నుంచి బయటకి పంపించడం, రెండు ఇప్పుడే ఇక్కడే గొడవ చేసి ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తే ఆ బాధ తట్టుకోలేక తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఒకటి కావడమని చెప్తుంది.
మనం ఒక్కటి కావాల్సిందే మురారి
ఈ రెండింటిలో ఆదర్శ్ వెళ్ళడం కామన్ అనుకుంటున్నావ్ ఏమో కాదు ఏది జరిగినా మనం ఒకటి కావడం కామన్. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. నేను వేసే ఉల్లిపాయ దోస తిని శోభనం ఎలా ఆపాలి, ఆదర్శ్ ని ఎలా పంపించాలో ఆలోచించమని చెప్తుంది. ముకుంద మాటలకు కృష్ణ, మురారి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. గార్డెన్ లో కృష్ణ కోపంగా మొక్కలకి నీళ్ళు పోస్తుంటే రేవతి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఇక్కడ ఉన్నావ్ ఏంటని అంటుంది. ఈరోజు వంట మనిషిని మార్చాను ముకుందని చేయమని చెప్పానని చెప్తుంది. అయినా మీ సొంత కోడలు నేనా ముకుంద అనేసరికి వెంటనే చెవి మెలిపెట్టేస్తుంది. అలా కాదు నీకు అయితే ఎవరికి ఏం కావాలో బాగా తెలుసని అంటుంది.
మురారి హడావుడిగా వెళ్తుంటే ఎక్కడికని కృష్ణ అడుగుతుంది. ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. మీరు ఎందుకు బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళ్తున్నారో ముకుంద మనసులో ఏముందో మొత్తం తెలిసిపోయింది. ఫుల్ క్లారిటీ వచ్చింది. తన మనసులో మీరు ఉన్నా మీ మనసులో తను లేదుగా ఆలోచిద్దామని అనుకుంటుంది. టిఫిన్ రెడీ అని ముకుంద మురారిని పిలుస్తాడు. వెంటనే మధు కోపంగా చూస్తాడు. వేడి వేడిగా ఆనియన్ దోస అనేసరికి మధు వెంటనే అది మురారికి ఇష్టమైనది కదా ఆదర్శ్ కి ఇష్టమైనది చేయలేదా అని అడిగేస్తాడు. నాకు ఆనియన్ దోస అంటే ఇష్టమేనని ఆదర్శ్ చెప్తాడు. వాడికి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టమని అంటాడు. అందరూ వస్తే కలిసి తిందామని చెప్తుంది. మురారి ఆఫీసుకి వెళ్లిపోయాడని రేవతి చెప్తుంది.
మురారికి వేసిన టిఫిన్ నీకు పెట్టనన్న ముకుంద
మురారి కోపంగా వెళ్ళిపోతాడు. పూర్తిగా మతి పోయింది, తను చేస్తుంది కరెక్ట్ అనుకుంటుంది. రాత్రి వరకే టైమ్ ఉంది ఈలోగా ఏదో ఒకటి చేయాలి. ముకుంద మనసులో నుంచి పిచ్చి ఆలోచనలు పారిపోయేలా చేయాలని అనుకుంటాడు. మురారి వెళ్లిపోవడంతో ఎందుకు ఇలా చేశావ్ ఈ శోభనం జరగకుండా నువ్వే చూడాలని ముకుంద అనుకుంటుంది. కృష్ణ కూడా ఇంట్లో ఉండదు. తను వెళ్లిపోవడానికి నేను చేసిన టిఫిన్ కారణమా? అంటే నా గురించి మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ఇంకా హ్యాపీ. అందరికీ తెలిసిపోతుంది శోభనం ఏమీ ఉండదని సంబరపడుతుంది. ఆదర్శ్ కి టిఫిన్ పెట్టకుండా ఉంటుంది. నా మురారి కోసం ఇష్టంగా చేసింది నీకెందుకు పెడతానని అనుకుంటుంది. ఆదర్శ్ కి పెట్టవా అని మధు అడిగితే పెట్టనని, తనకి ఉప్మా పెసరట్టు ఇష్టం కదా అదే చేసి పెడతానని కవర్ చేస్తుంది.
తను చేయకుండా వంట మనిషితో వేసి పంపిస్తానని అనుకుంటుంది. తనకోసం ఇష్టమైన ఫుడ్ తీసుకొస్తుందని ఆదర్శ్ సంబరపడతాడు. నిన్ను ఉప్మా గాడిని చేసి వెళ్ళిపోయింది. మురారి కోసం చేసిన టిఫిన్ డస్ట్ బిన్ లో అయినా వేస్తాను కానీ నీకు పెట్టనని చెప్పేసింది నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని మధు అనుకుంటాడు. మురారి గోపి దగ్గరకి వచ్చి తన గోడు వెళ్లబోసుకుంటాడు. కృష్ణ తనని గమనిస్తుంది. ముకుంద మారలేదు ఇన్నాళ్ళూ మారినట్టు నటించింది. రేపు శోభనం అనగా ఇప్పుడు అసలు రంగు బయట పెట్టింది. తాను మారిందని కదా ఆదర్శ్ ని తీసుకొచ్చాము ఇప్పుడు పంపించమంటే ఎలా? కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటాడు.
తనకంతా తెలుసన్న కృష్ణ
ప్రేమ అంతే మర్చిపోయినట్టే అనుకుంటాం కానీ మర్చిపోలేమని గోపి చెప్తాడు. నేను ప్రేమించలేదా ముకుంద నన్ను ఎంతగా ప్రేమించిందో నేను అంతగా ప్రేమించాను. తను ఆదర్శ్ ని పెళ్లి చేసుకుంది నా జీవితంలోకి కృష్ణ వచ్చింది. మా జీవితాలు వేర్వేరు అయిపోయాయి. ఇక మనసులో పెట్టుకుని ఉన్న బంధాలు నాశనం చేసుకుంటే ఎలా? అన్ని మర్చిపోయి మంచు కొండలలో ఉన్నవాడు ముకుంద మారిందని ఇంటికి తిరిగొచ్చాడు. తన గురించి తెలిస్తే కుటుంబం మొత్తం అల్లకల్లోలంగా అయిపోతుంది. బాగా ఆలోచించు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని అంటాడు. బయటకి మురారి రాగానే వెనుక కృష్ణ వచ్చి పిలుస్తుంది. నేను విన్నాను, నేను ఉన్నాను ఏం టెన్షన్ వద్దని చెప్తుంది.
కృష్ణ తనకి మొత్తం నిజం తెలిసిందని చెప్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం అదే దొరుకుతుందని అంటుంది. కిచెన్ లో మీతో ముకుంద అలా మాట్లాడుతుంటే గుండెల్లో వణుకు వచ్చేసిందని చెప్తుంది. టెన్షన్ పడి ఆలోచించడం మానేస్తే ఆలోచనలు రావు. రిసార్ట్ లో శోభనం తప్పించుకోవడానికి కాలు బెణికిందని అబద్ధం చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చిందని అంటుంది. అవునా అది అబద్దమా అయితే నిజంగా కాలు బెణకలేదా అడుగుతాడు. లేదని చెప్తుంది.