తెలుగు న్యూస్ / ఫోటో /
Winter Tourism | మంచు కురిసే దారుల్లో అడ్వెంచర్లకు మీరు సిద్ధమేనా?
Winter tourism: శీతాకాలం ప్రారంభమైంది, ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మంచు కురవడం ప్రారంభమవుతుంది. మంచుతో ఆటలు, స్కీయింగ్ నుండి స్నోబోర్డింగ్ వరకు, ఈ వింటర్ సీజన్‌లో మీరు తప్పక ప్రయత్నించాల్సిన అడ్వెంచర్లు, ఇక్కడ తెలుసుకోండి.
(1 / 8)
మీరు మంచులో ఎంజాయ్ చేయడానికి సిద్ధమా? అయితే ఈ శీతాకాలంలో వెంటనే భారతదేశంలోనే హిమాలయా పర్వతశ్రేణుల బాట పట్టండి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లలో మంచుకురవడం ప్రారంభమైంది. (pixabay)
(2 / 8)
Skiing: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన శీతాకాలపు క్రీడ స్కీయింగ్. భారతదేశంలో ఔలీ, గుల్మార్గ్‌లలో ఈ స్కీయింగ్ కార్యకలాపాలు చాలా జరుగుతాయి. (Twitter/JandKTourism)
(3 / 8)
Trekking: వీకెండ్ వచ్చిందంటే చాలా మంది తమకు దగ్గర్లో ఉన్న కొండ ప్రాంతాలకు ట్రెక్కింగ్ వెళ్తారు. ఆ కొండలు మంచుకొండలైతే అప్పుడెలా ఉంటుంది. అయితే వీటిలో కొంత శ్రమ, రిస్క్ కూడా ఉంటుంది. శీతల గాలులు, చలిని తట్టుకునేలా మీరు కూడా సన్నద్ధమై ఉండాలి. హిమాలయా పర్వత శ్రేణులలో ట్రెకింగ్ ఒక మరపురాని అనుభూతి. (Unsplash)
(4 / 8)
Snowboarding: భారతదేశంలో ఈ శీతాకాలపు క్రీడ ఇప్పుడిప్పుడే జనాదరణ పొందుతోంది. థ్రిల్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. మౌంటెడ్ షూని ధరించి మీ పాదాలకు బిగించిన ఫైబర్‌గ్లాస్ బోర్డ్‌తో మంచుతో కప్పబడిన కొండ నుంచి కిందికి సర్రున జారిపోయే రైడ్ కు రెడీ అయిపోండి. స్నోబోర్డింగ్ ఎంజాయ్ చేయండి. (Photo: Ramesh Iyer)
(5 / 8)
Ice skating: రోలర్ స్కేటింగ్ మాదిరిగానే, ఐస్ స్కేటింగ్ కూడా మెరిసే మంచు పొరలపై గ్లైడింగ్ చేసే ఉల్లాసాన్ని అందిస్తుంది. భారతదేశంలో ఈ అడ్వ్ంచర్ కుఫ్రి, ఔలీ, నరకంద, మనాలి, గుల్మార్గ్‌లలో చేయవచ్చు.(pexels )
(6 / 8)
Ice climbing: అత్యంత కఠినమైన, సవాళ్లతో కూడిన అడ్వెంచర్ ఇది. ప్రమాదం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించవచ్చు. ఇది రాక్ క్లైంబింగ్‌ను పోలి ఉన్నప్పటికీ, ఉపరితలం రాతిగా కాకుండా జారే విధంగా ఉంటుంది కాబట్టి మంచు అధిరోహణ చాలా కష్టం. సాహసయాత్రకు బయలుదేరే ముందు, అధిరోహకులు తగిన శిక్షణను పొందాలి, తగినంత నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.(Unsplash)
(7 / 8)
Snow sledding: భారతదేశంలోని ప్రసిద్ధ శీతాకాలపు క్రీడలలో ఇది కూడా ఒకటి, దీనిని తరచుగా డాగ్-స్లెడ్డింగ్ అని పిలుస్తారు. రోహ్‌తంగ్, నాథాటాప్, ఔలీ, గుల్‌మార్గ్‌లలో ఐస్ స్లెడ్డింగ్ ఎంజాయ్ చేయవచ్చు. (Unsplash)
ఇతర గ్యాలరీలు