Krishna mukunda murari february 26th: ఆదర్శ్ ని పంపించకపోతే చచ్చిపోతానన్న ముకుంద.. కృష్ణకి షాక్ ఇచ్చిన మురారి!
Krishna mukunda murari serial february 26th episode: ఎట్టకేలకు ముకుంద మురారి దగ్గరకి వెళ్ళి నిజం చెప్పేస్తుంది. ఆదర్శ్ ని ఇంట్లో నుంచి పంపించకపోతే చనిపోతానని బెదిరిస్తుంది. దీంతో మురారి షాక్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial february 26th episode: ముకుంద ఫోన్లో మురారి పేరు మార్చేస్తుంది. కృష్ణ వచ్చి తెచ్చిన చీరలు కట్టుకున్నావా అని అడుగుతుంది. తనని వాష్ రూమ్ కి పంపిస్తుంది. ముకుంద ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళగానే ఇప్పుడు ఏపీసీ సర్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను మురారి అని వస్తుందో నా మొగుడు అని వస్తుందో చెక్ చేయాలని అనుకుంటుంది. ఏసీపీ సర్ నా మొగుడు ముకుందకి కలలో కూడా ఆ ఆలోచన రాకూడదని టెన్షన్ పడుతూనే ఫోన్ చేస్తుంది. ముకుంద ఫోన్లో మురారి అని పడుతుంది. నేను భయపడినట్టు ఏమి లేదు ఆదర్శ్ తోనే మాట్లాడుతుందని ఊపిరి పీల్చుకుంటుంది.
ముకుందని మర్చిపోలేపోతున్న కృష్ణ
ముకుంద వచ్చేసరికి కృష్ణ ఉండదు. ఫోన్లో మురారి మిస్డ్ కాల్ చూసుకుంటుంది. ఇందాక ఫోన్లో నా మొగుడు అని చూసేసరికి కృష్ణకి డౌట్ వచ్చింది అది చెక్ చేసుకోవడానికి చీర వంకతో ఇక్కడికి వచ్చింది. నేను పేరు మార్చాను కాబట్టి సరిపోయింది లేదంటే మొత్తం బయట పడిపోయేది ఎవరికి అనుమానం వచ్చినా పరవాలేదు కానీ కృష్ణకి అనుమానం రాకూడదని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది. ముకుంద ఫోన్ కి ఎందుకు ఫోన్ చేశారని కృష్ణ నిలదీస్తుంది. ఏదో అలవాటు ప్రకారం ఫోన్ చేశానని చెప్తాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత నీ దగ్గర దాచాలని అనుకోవడం లేదు.
నేను ముకుందని మర్చిపోలేకపోతున్నాను. ఆదర్శ్ ప్రేమ కోసం నా ప్రేమని త్యాగం చేసి ముకుందని వదిలేశాను. నిన్ను పెళ్లి చేసుకున్నాక ముకుందకి చోటు లేదు అనుకున్నాను కానీ మొదటి ప్రేమ అంత త్వరగా మర్చిపోలేను. ఎంత వదిలేద్దామని అనుకుంటున్నా అవడం లేదు. అసలు నువ్వు పక్కన ఉన్నా నీలో కూడా ముకుంద కనిపిస్తుంది. ఈ విషయం చెప్పలేక నిజం దాచుకోలేక ఎంత నలిగిపోయానో నాకు మాత్రమే తెలుసు. సోరి నాకు మాత్రమే కాదు ముకుందకి కూడా తెలుసు. ఇద్దరం బయట పడలేక ఒకరినొకరు విడిచి ఉండలేక ఇలా ఫోన్లో మాట్లాడుకంటున్నామని చెప్పేసరికి కృష్ణ గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
మురారికి సోరి చెప్పిన కృష్ణ
మురారి ఏడుస్తున్న తన దగ్గరకి వచ్చి ఒక్క దెబ్బ వేశానంటే బుర్రకి పట్టిన చెదలు అంతా వదిలిపోతుంది నామీద నీకు అనుమానమా? నీ ఫోన్ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఎక్కడ వదిలేశావ్ తెలియదు కదా ఇక్కడే ఉంది ముందు నీకే ఫోన్ చేశాను ఇక్కడే ఉంది కావాలంటే చెక్ చేసుకో. నీ ఫోన్ ఇక్కడ ఉంది నీతో మాట్లాడాలి మరి ఎవరికి చేయాలి. నువ్వు ముకుంద దగ్గరకి వెళ్ళావ్ కాబట్టి తనకి చేశానని చెప్తాడు. కృష్ణ వెంటనే మురారిని హగ్ చేసుకుని సోరి చెప్తుంది. మురారి వాకింగ్ కి వస్తే ముకుంద వచ్చి పిలుస్తుంది. నువ్వు ఏంటి ఇక్కడ ఆదర్శ్ ఎక్కడ తను రాలేదా అని అడుగుతాడు. ముకుంద ఏడుస్తుంది. ఆదర్శ్ కి ఏం కాలేదు కదా మురారి కంగారుగా అడుగుతాడు. స్టాపిడ్ అని గట్టిగా అరుస్తుంది.
ముకుంద: ఆదర్శ్ పేరుతో ఎందుకు నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. నీ కళ్ళ ముందు నేను ప్రాణాలతో ఉండటం ఇష్టం లేదా?
మురారి: ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ఏమైంది నీకు
ఆదర్శ్ ని పంపించకపోతే నా శవం చూస్తావ్
ముకుంద: మొత్తం నువ్వే చేశావ్. నాకు ఇష్టం లేని జీవితంలోకి నన్ను నెట్టేశావ్. నన్ను బతుకుతున్న శవంలా మార్చేశావ్. మనసులో లేని మనిషితో బతుకు పంచుకోవడం నరకంగా ఉంటుంది. ఆ నరకంలో నుంచి బయట పడదామని అనుకునే ప్రతిసారి తిరిగి అదే నరకంలోకి నెడతన్నారు. మీరు ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు. చెప్పకూడదు అనుకున్నా కానీ నా వల్ల కావడం లేదు. తెగించి చెప్తున్నా ఆదర్శ్ అనే పేరు నా జీవితంలో ఉండకూడదు. అసలు తను నా ఎదురుగా ఉండకూడదు
మురారి: ఏం మాట్లాడుతున్నావ్ నీకు ఆదర్శ్ అంటే ఇష్టమే కదా మనసు మార్చుకున్నావ్ కదా
ముకుంద: లేదు నేను మనసు మార్చుకోలేదు మనసు చంపుకుని బతుకుతున్నా. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో ఉంది నువ్వే. నేను ప్రేమించేది నిన్నే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా , నాతో లేకపోయినా కృష్ణతో నా ఎదురుగా ఉంటున్నా ఎందుకు ప్రాణాలతో ఉన్నానో తెలుసా? కనీసం నిన్ను చూస్తే బతికే అవకాశం ఉందని. ఇంకా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ అవకాశం ఎక్కడ దూరం అవుతుందో, ఇంట్లో నుంచి తరిమేస్తారోననే భయంతో నా మనసు చంపుకున్నాను కానీ నేను ఇంత కూడా మారలేదు. నువ్వే ఉన్నావ్ నా మనసులో, నా ఆలోచనలో నువ్వే ఉన్నావ్. నీకు ఆ విషయం అర్థం కాలేదు. ఆదర్శ్ కోసం తహతహలాడుతున్నానని ఎక్కడో ప్రశాంతంగా ఉన్న మనిషిని తెచ్చి నా పక్కన పడేశారు. అతనికి ప్రేమ పంచలేక, ప్రేమలేదని చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను.
ఇంక నా వల్ల కాదు. నువ్వు ఏం చేస్తావో ఏం చెప్పి పంపిస్తావో నాకు అనవసరం. ఆదర్శ్ నా కళ్ళ ముందు ఉండకూడదు. అతన్ని నువ్వే పంపించేయాలి. ఈ విషయం ఆదర్శ్ కి చెప్పాలని అనుకుంటే ధైర్యం సరిపోలేదు. అత్తయ్యకి చెప్దామంటే బయటకి గెంటేస్తారు. అందుకే నీకే చెప్తున్నా నేను ప్రేమించింది నిన్ను. నేను చెప్పింది చేయకుండా ఇంట్లో ఎవరికైనా చెప్తే నేను ప్రాణాలతో ఉండను. నీ కళ్ళెదురుగా నా ఊపిరి వదిలేస్తాను తర్వాత నీ ఇష్టం. రేపు రాత్రికి శోభనం ఆ గదిలోకి నేను పాల గ్లాసుతో అడుగుపెడితే నేను ప్రాణాలతో బయటకి రాను. దాన్ని ఎలా అపుతావో, ఆదర్శ్ ని ఎలా పంపిస్తావో నీ ఇష్టం అనేసి వెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర కృష్ణ మురారి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
తరువాయి భాగంలో..
మురారి ఇంటికి వచ్చేసరికి ఆదర్శ్ శోభనం గురించి సంతోషంగా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అది విని మురారి బాధపడతాడు. ఆదర్శ్, ముకుంద కూర్చుని ఉంటే కృష్ణ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. తనకే ఇవ్వమని ఆదర్శ్ అంటాడు సరే అయితే ఒకే కాఫీని ఇద్దరు షేర్ చేసుకొండని కృష్ణ అంటుంది.