Krishna mukunda murari february 23rd: ముకుంద డ్రామా బయట పెట్టేందుకు సూపర్ ప్లాన్ వేసిన కృష్ణ.. బిత్తరపోయిన మురారి-krishna mukunda murari serial february 23rd episode krishna makes request to priest about mukunda adarsh nupital nite ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 23rd: ముకుంద డ్రామా బయట పెట్టేందుకు సూపర్ ప్లాన్ వేసిన కృష్ణ.. బిత్తరపోయిన మురారి

Krishna mukunda murari february 23rd: ముకుంద డ్రామా బయట పెట్టేందుకు సూపర్ ప్లాన్ వేసిన కృష్ణ.. బిత్తరపోయిన మురారి

Gunti Soundarya HT Telugu
Feb 23, 2024 07:22 AM IST

Krishna mukunda murari serial february 23rd episode: ముకుంద మారిందో లేదో తెలుసుకునేందుకు కృష్ణ సూపర్ ప్లాన్ వేస్తుంది. వాళ్ళ జంటకు మాత్రమే శోభనం ముహూర్తం పెట్టించడంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 23వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 23వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial february 23rd episode: ముకుంద ఫోన్లో మురారితో తీసుకున్న సెల్ఫీలు చూసుకుంటూ ఉంటుంది. బయటకి వెళ్ళి ఆదర్శ్ కి నిజం చెప్పేద్దామని అనుకుంటే అక్కడ శోభనం ఏర్పాట్లు చేశారు. ఎవరో చేసి నేను చేశానని నామీద పెట్టారు. అసలు చేసింది ఎవరు. సర్ ప్రైజ్ ఇద్దామని చేశారా? నామీద అనుమానంతో చేశారా? ఏం చేసినా ఆ టైమ్ లో ఏదో ఐడియా వచ్చి తప్పించుకున్నాను లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది. నా వల్ల కాదు మురారి ఆదర్శ్ కి అంతా చెప్పేస్తాను అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ ముకుంద కోసం జ్యూస్ పట్టుకుని వస్తాడు. ముకుంద ఫోన్ లో ఫోటో చూస్తూ ఉంటుంది.

ఆదర్శ్ ప్రేమ చూసి బాధపడ్డ ముకుంద

ముకుంద మీద చాలా ప్రేమ చూపిస్తాడు. సాయంత్రంలోపు తగ్గకపోతే హాస్పిటల్ కి వెళ్దామని అంటాడు. నీకు ఏం కావాలన్నా ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వు క్షణాల్లో నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. రాత్రి జరిగిన దానికి బాధపడకు. నేనేమీ డిసప్పాయింట్ అవలేదు. రాత్రి ఏమి జరగపోయిన మనం కలిసి ఉండాలనే ఆలోచన నీకు వచ్చింది చూడు అది చాలు నాకు అని చెప్పి సంతోషంగా వెళతాడు. ఒక మనిషి ప్రేమ ఇంతలా బాధ కలిగిస్తుందని జీవితంలో మొదటి సారి అనుభవంలోకి వస్తుంది. తొందరగా ఈ బాధ నుంచి నాకు విముక్తి కలిగించమని దేవుడిని మనసులోనే వేడుకుంటుంది.

రేవతి దగ్గరకి కృష్ణ వచ్చి సరదాగా మాట్లాడుతుంది. ముకుంద పరిస్థితి ఎలా ఉందని రేవతి అడుగుతుంది. బాగానే ఉంది కానీ పెద్దత్తయ్య ఎన్నో సార్లు ఊరు వెళ్లారు మరి ఈసారి నాకు మాత్రమే ఎందుకు బాధ్యత అప్పగించారని కృష్ణ అంటుంది. ఎందుకంటే నీమీద నమ్మకం ఉందని రేవతి చెప్తుంది. అది కాదు ఏదో కారణం ఉంది. ముకుంద వాళ్ళు అంత బాగా చేసినా ప్రైజ్ మాకే ఇచ్చారు బాధ్యత కూడా నాకే ఎందుకు అప్పగించారు నేను కనిపెట్టాలని చెప్తుంది. అక్కకి ముకుంద మీద అనుమానం ఉంది తను మారింది అంటే అసలు నమ్మడం లేదు.

రేవతి ప్రశ్నలకు ఆలోచనలో పడిన కృష్ణ

ముకుంద మంచిదని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నావ్ తప్ప ఒక్కసారైన అక్క ఎందుకు అనుమానిస్తుందో నువ్వు ఆలోచించావా? ఆదర్శ్ ముకుందని కలపాలని నీ ఉద్దేశం మంచిదే. కానీ ఆదర్శ్ తిరిగి వచ్చాక వాళ్ళు ఒక్కటి అయ్యారని సంతోషించకుండా ఇంకా ముకుంద మీద అనుమానంతో ఎందుకు ఉంది? అది ఆలోచించు. ముకుంద మారిపోయిందంటే నువ్వు నమ్ముతున్నావా? ఎక్కడ ఇంత అనుమానం రాలేదా? అని రేవతి అడుగుతుంది. కృష్ణ ఆలోచనలో పడుతుంది. ఈ ట్రిప్ కి వెళ్లకపోయి ఉంటే అసలు అనుమానం వచ్చి ఉండేది కాదు. రేపు తేలుస్తాను అసలు పెద్దత్తయ్య అనుమానం నిజమో కాదోనని కృష్ణ మనసులో అనుకుంటుంది.

ఇంటికి పంతులు వస్తాడు. కృష్ణ తనే రమ్మన్నానఅని చెప్తుంది. పెద్దత్తయ్య ముహూర్తం పెట్టమంటే పది రోజులు ఆగమన్నారు కదా ఇప్పుడు ఆ పది రోజులు అయిపోయాయి. అందుకే ముహూర్తం పెట్టించడానికి రమ్మన్నానని చెప్తుంది. శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని కృష్ణ పంతులికి చెప్తుంది. ముకుంద టెన్షన్ పడుతుంది. కాలు బెణికిందని అక్కడ తప్పించుకుంటే ఇక్కడ ఇంటికి రాగానే ముహూర్తాలు పెట్టిస్తున్నారని ముకుంద కంగారుపడుతుంది. నీ కంగారు ఎందుకు ఈ శోభనం తప్పించాలని చూస్తున్నావా లేదంటే ముహూర్తం తప్పించాలని చూస్తున్నావని కృష్ణ అనుకుంటుంది. మురారి తన దగ్గరకి వచ్చి తెగ సంతోషపడతాడు.

ముకుంద, ఆదర్శ్ జంటకు శోభనం

రాత్రి బయట కాబట్టి తప్పించుకున్నాను. ఇప్పుడు ఇంట్లో ఎలా తప్పించుకోవాలి. ఊపిరి తీసుకొనివ్వకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ టెన్షన్లు ఏంటని ముకుంద భయపడిపోతుంది. మధు ముకుంద టెన్షన్ పడుతుంటే ఫోటో తీస్తాడు. ముహూర్తం ఒకరికి కుదిరితే మరొకరికి కుదరడం లేదని అంటాడు. ఎవరి జాతకాలు తగినట్టుగా ఎవరి ముహూర్తాలు వాళ్ళకి పెట్టమని కృష్ణ చెప్తుంది. ఒక జంటకి రేపు మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. ఎవరికని మురారి ఆత్రంగా అడుగుతాడు. ముకుంద, ఆదర్శ్ దంపతులకని పంతులు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఆదర్శ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎలా తప్పించుకోవాలని ముకుంద ఆలోచనలో పడుతుంది.

కృష్ణ, మురారి కొంత కాలం వేచి చూడక తప్పదు. ఇంకో మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని అనేసరికి మురారి బిత్తరపోతాడు. కృష్ణ నవ్వుకుంటుంది. ఇప్పుడు ఇదంతా ఏం వద్దు తర్వాత చూసుకుందామని ముకుంద కృష్ణతో అంటుంది. ఎందుకు వద్దని అడుగుతుంది. రాత్రి నువ్వే కదా అక్కడ ఏర్పాట్లు చేసింది అక్కడ కాలు బెణికి క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ అవే ఏర్పాట్లు చేస్తే ఎందుకు వద్దని అంటున్నావని కృష్ణ అడుగుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం ఇప్పుడు అన్ని కుదిరితే నువ్వు ఎందుకు వద్దని అంటున్నావని రేవతి కూడా అడుగుతుంది. కృష్ణ వాళ్ళు మీకోసమే శోభనం వాయిదా వేసుకుంటున్నారు. అయినా మీ సమస్య ఏంటని సుమలత, రేవతి అడుగుతాడు. కాలు బెణికింది కదా ఇప్పుడు ఎందుకని ముకుంద అంటుంది.

పంతులుతో అబద్దం చెప్పించిన కృష్ణ

పెద్ద దెబ్బ ఏం కాదు సాయంత్రానికి సెట్ అయిపోతుందని కృష్ణ చెప్తుంది. నాకు నిజంగా దెబ్బ తగల్లేదని కృష్ణ కనిపెట్టేసిందాని ముకుంద టెన్షన్ పడుతుంది. రేపటి ముహూర్తం ఖాయం చేయమని కృష్ణ అంటుంది. ఒక్క జంటకి మాత్రమే శోభనం పెట్టాలని కృష్ణ పంతుల్ని అడుగుతుంది. ఎందుకమ్మా అప్పుడు కూడా ముహూర్తాలు ఉన్నాయి కానీ భవానీ దేవి కొద్ది రోజులు వాయిదా వేయమని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక జంటకి ముహూర్తం పెట్టమంటున్నారని పంతులు అడుగుతాడు. కుటుంబం మంచి కోసమేనని కృష్ణ చెప్తుంది. మంచి జరుగుతుందంటే ఏం చేయమన్నా చేస్తానని పంతులు మాట ఇస్తాడు. ముకుంద వాళ్ళకి రేపే ముహూర్తం ఉందని చెప్పండి మాకు మాత్రం రెండు మూడు నెలల వరకు లేవని చెప్పమని చెప్తుంది.

శోభనానికి ఏర్పాట్లు చేయిస్తున్నాను రిసార్ట్ లో చెడగొట్టినట్టే ఈసారి కూడా చెడగొడితే ఆదర్శ్ అంటే ఇష్టం లేదు. ఇంకా ఏసీపీ సర్ గురించి ఆలోచిస్తున్నట్టే. ముకుంద ఏమైంది నీకు నువ్వు మారిపోయావు అనుకుంటే మళ్ళీ ఎందుకు నీ మనసులో పాడు ఆలోచనలు వస్తున్నాయని కృష్ణ అనుకుంటుంది. మురారి గదిలోకి వచ్చినా కృష్ణ పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది.

తరువాయి భాగంలో..

కృష్ణ ముకుంద దగ్గరకి వచ్చి ఏంటి ఏదోలా ఉన్నావ్ మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమని చెప్తుంది. అప్పుడే ముకుందకి ఫోన్ వస్తుంది. అందులో నా మొగుడు అని పడుతుంది. అది కృష్ణ కూడా చూస్తుంది. ముకుంద టెన్షన్ గా ఫోన్ తీసుకుంటుంది. మురారి కృష్ణతో ముకుందకి ఫోన్ చేశానని చెప్తాడు. ఎప్పుడని కృష్ణ అనుమానంగా అడుగుతుంది. ఇప్పుడే నువ్వు రాకముందని మురారి చెప్పడంతో కృష్ణ షాక్ అవుతుంది.

IPL_Entry_Point