Krishna mukunda murari february 21st: ముకుంద నాటకాన్ని పసిగట్టిన కృష్ణ.. నిజం రాబట్టేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిన తింగరి
Krishna mukunda murari serial february 21st episode: శోభనం ఆగిపోయేలా చేసేందుకు కాలికి దెబ్బ తగిలినట్టు ముకుంద డ్రామా ఆడుతుంది. ముకుంద ఆడుతున్న నాటకాన్ని కృష్ణ పసిగట్టేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial february 21st episode: శోభనం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ముకుంద ఆలోచిస్తుంది. ఇలా ఇంకెన్నాళ్ళు తప్పించుకుని బతకాలి, ఇంకెన్నాళ్ళు అందరినీ మోసం చేస్తూ బతకాలి. అయినా నేను ఎవరినీ మోసం చేయడం లేదు. నా ప్రేమని బతికించుకోవడానికి చేస్తున్నాను. నేను మురారిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నానో ఆ భగవంతుడికి తెలుసు. నా ప్రేమ గొప్పది మాత్రమే కాబట్టి మురారి రూపం మారినా తనమీద నా ప్రేమ చావలేదు. ఇది చాలు నా ప్రేమ ఎంత స్వచ్చమైనదో చెప్పడానికి, అంత స్వచ్చమైన ప్రేమని నేను ఎందుకు వదులుకోవాలి. ఎవరి కోసమో నా ప్రేమని వదులుకోనని అనుకుంటుంది.
కృష్ణ కిడ్నాప్ చేసేందుకు దేవ్ ప్లాన్
ముకుందని తీసుకురావడానికి ఆదర్శ్, మురారి బయటకి వస్తారు. ముకుంద పిచ్చి కాకపోతే ఈ టైమ్ లో పువ్వు కోసం బయటకి వెళ్తుందా, అయినా ఇది మంచిదే ఆదర్శ్ కి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని కృష్ణ అనుకుంటుంది. ఆదర్శ్ వాళ్ళు రావడం చూసి ముకుంద కావాలని పువ్వు కోస్తునట్టు నటించి కింద పడిపోతుంది. ఆదర్శ్ వాళ్ళు వచ్చి తనని చూసి కంగారుపడతారు. రూమ్ కి వెళ్దాం పద అంటే వద్దని అంటుంది. కానీ మురారి తను నడిచే పొజిషన్ లో లేదని చెప్పి ఆదర్శ్ ని ఎత్తుకోమని చెప్తాడు. ఆదర్శ్ ఎత్తుకుంటే మురారి ఎత్తుకున్నట్టు ఊహించుకుంటుంది.
కృష్ణ గదిలో ఉండగా రౌడీలు పవర్ ఆఫ్ చేస్తారు. దేవ్ సర్ చెప్పినట్టు కృష్ణని కిడ్నాప్ చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లాలని మాట్లాడుకుంటారు. రౌడీలు తలుపు తెరిచేసారికి పవర్ వచ్చేస్తుంది. తలుపు చప్పుడు అయ్యేసరికి కృష్ణ ఎవరని గట్టిగా అరుస్తుంది. రౌడీలు కృష్ణకి కనిపించకుండా వెళ్లిపోతారు. మధు చెప్పిన దగ్గర నుంచి మనసు మనసులో లేదు. నా బిడ్డలు జీవితాలు ఏమవుతాయోనని భయంగా ఉంది. ముకుంద మనసులో ఎలాంటి పాడు ఆలోచనలు లేకుండా చూడు, ఎలాంటి అపశృతులు జరగకుండా చూడామని రేవతి దేవుడిని మొక్కుకుంటుంది. మధు వచ్చి కృష్ణ ఫోన్ చేసిందా అని అడుగుతాడు. కృష్ణ వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకోలేనని మధు బాధపడతాడు.
ముకుంద డ్రామా కనిపెట్టేసిన కృష్ణ
ఆదర్శ్ ని ముకుంద గదికి తీసుకొస్తాడు. కృష్ణ తన కాలు చెక్ చేస్తుంటే నొప్పిగా ఉందని అంటుంది. ఒక్కదానివే ఎందుకు వెళ్ళావని అడుగుతుంది. ఆదికి పువ్వు ఇవ్వాలని ఆశ పడ్డాను కానీ కొస్తుంటే జారీ పడ్డాను సోరి అంటుంది. నీ కాలు బాగా నొప్పిగా ఉందా అని ఆదర్శ్ పట్టుకోబోతుంటే గట్టిగా అరిచి పక్కకి వెళ్ళిపోతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పటి వరకు చేసిన సేవలు చాలు నా కాలు పట్టుకుంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కవర్ చేస్తుంది. ఇప్పటికే మోసం చేస్తున్నాననే గిల్ట్ ఫీలింగ్ తో చచ్చిపోతున్నాను ఇక సేవలు చేయించుకోవడం కూడానా అని ముకుంద మనసులో తిట్టుకుంటుంది.
కాలికి పెద్ద దెబ్బ తగిలిందేమోనని చూడమని చెప్తారు. కృష్ణ చెక్ చేస్తుంటే నొప్పిగా ఉన్నట్టు నటిస్తుంది. ముకుందకి నిజంగానే దెబ్బ తగిలిందా లేదంటే ఆదర్శ్ తో ఒకే గదిలో రాత్రంతా కలిసి ఉండటం ఇష్టం లేక కాలు బెణికినట్టు నాటకం ఆడుతుందాని కృష్ణ అనుమానపడుతుంది. ముకుంద ప్రవర్తన కృష్ణ అనుమానాన్ని మరింత పెంచుతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాల్సిన పని లేదని వేడి నీళ్ళ కాపడం పెడితే సరిపోతుందని చెప్తుంది. కృష్ణ వాళ్ళు వెళ్లబోతుంటే నువ్వు వెళ్లకు ఇక్కడే ఉండమని అడుగుతుంది. ఆదర్శ్ ఉన్నాడని అంటే ఏదైనా అవసరం అయితే ఆదితో చేయించుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. మురారి, ఆదర్శ్ వేరే గదిలో పడుకుంటామని వెళ్లిపోతారు.
ముకుంద గురించి ఫీలయిన మురారి
ఇంటికి వెళ్ళే వరకు కృష్ణని వదులుకోకూడదని ముకుంద మనసులో అనుకుంటుంది. కృష్ణ పక్కకి వెళ్ళగానే తనకి ఫోన్ రావడం చూసి లేచి తీసుకుంటుంది. అది కృష్ణ గమనించేసరికి కాలు నొప్పిగా ఉన్నట్టు మళ్ళీ నటిస్తుంది. కృష్ణ తనని చూసి షాక్ అవుతుంది. కాలు దెబ్బ తగిలిందని మర్చిపోయి అలవాటు ప్రకారం లేచానని కవర్ చేస్తుంది. మురారి దగ్గరకి కృష్ణ వస్తే ముకుందకి ఎలా ఉందని అడుగుతాడు. బాగానే ఉందని అంటుంది. అసలు దెబ్బ తగిలితే కదా రాత్రి తనకి దెబ్బ తగల్లేదు. కానీ అంతలా ఎందుకు నటిస్తుందో అర్థం కావడం లేదు. శోభనం జరగకుండా తప్పించుకోవడానికా అని మనసులో అనుకుంటుంది.
హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలా అని మురారి అంటే అవసరం లేదు ముకుంద ఎప్పుడు తగ్గిపోవాలని అనుకుంటే అప్పుడు తగ్గిపోతుందని చెప్తుంది. అదేంటని అంటే కృష్ణ ఏదో చెప్పి కవర్ చేస్తుంది. ఈ అనుమానం చెప్పకూడదు చెప్తే డిస్ట్రబ్ అవుతారని అనుకుంటుంది. శోభనం జరగనుందుకు సోరి చెప్తుంది. ముకుందే ఇన్ని చేసి తనకి ఇలా జరగడం బాధగా ఉంది. చాలా కాలం వాళ్ళు దూరంగా ఉన్నారు కదా ఇప్పుడు ఒకటి కావాలని అనుకున్నప్పుడు ఇలా జరిగితే అదొక బ్యాడ్ సెంటిమెంట్ గా మిగిలిపోతుందని మురారి ఫీల్ అవుతాడు. వాళ్ళు ఒకటి కావడం దేవుడికి ఇష్టం లేక ఇలా జరిగిందని ముకుంద డిప్రెషన్ లోకి వెళ్లిపోతుందని అంటాడు.
రంగంలోకి దిగిన కృష్ణ
చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారని అంటుంది. నిజంగా ప్రమాదం జరిగి దెబ్బ తగిలి ఉంటే బాధపడేది కానీ తను నాటకం ఆడుతుంది. శోభనం ఇష్టం లేక ఇలా చేసిందా అసలు ఆదర్శ్ అంటే ఇష్టం లేక ఇలా చేసిందా అర్థం కావడం లేదు. శోభనం ఏర్పాటు చేసి మంచి పని జరిగిందని అనుకుంటుంది. ముహూర్తాలు అందుకే చూస్తారని కృష్ణ అంటుంది. అప్పుడే ఆదర్శ్ ముకుందని పట్టుకుని తీసుకొస్తాడు. ముకుంద ప్రవర్తన చూస్తే నాటకం ఆడుతుందని అర్థం అవుతుంది. అయినా ఇప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు. తనకి ఇంకొన్ని పరీక్షలు పెట్టి నా అనుమానం నిజమా కాదో తేల్చుకోవాలని కృష్ణ అనుకుంటుంది. ముకుంద ఇంటికి వెళ్లిపోదామని అంటుందని ఆదర్శ్ అంటాడు. అవును వెళ్లిపోదాం ఇష్టం లేనిచోట ఉండటం కష్టంగా ఉంటుందని కృష్ణ సెటైర్ వేస్తుంది.
కారులో ఆదర్శ్, ముకుందని వెనుక కూర్చోమని కృష్ణ చెప్తుంది. ఇద్దరూ దూరంగా కూర్చుంటారు. కృష్ణ అది చూసి దూరంగా కూర్చున్నావ్ ఏంటి ఆదర్శ్ కి దగ్గరగా కూర్చోమని అంటుంది. తనకి ఇలాగే బాగుందని చిరాకుగా చెప్తుంది.
తరువాయి భాగంలో..
కృష్ణ పంతుల్ని పిలిపించి శోభనానికి ముహూర్తం పెట్టమని చెప్తుంది. ముందుగా ఆయన్ని కలిసి ఒక జంటకే శోభనం ముహూర్తం పెట్టమని అంటుంది. తను చెప్పినట్టుగానే పంతులు ఒక జంటకి శోభనానికి ముహూర్తం ఉందని అంటాడు. మురారి ఆత్రంగా ఎవరికని అంటే ముకుంద, ఆదర్శ్ జంటకని చెప్తాడు. దీంతో ముకుంద షాక్ అవుతుంది.