Brahmamudi: రాజ్‌కు ట్విస్ట్ ఇచ్చిన సీతారామయ్య.. పిచ్చిదానిలా వసుధార.. ముకుంద బ్లాక్ మెయిల్-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial february 26th episode promo bava twist to raj valentines day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: రాజ్‌కు ట్విస్ట్ ఇచ్చిన సీతారామయ్య.. పిచ్చిదానిలా వసుధార.. ముకుంద బ్లాక్ మెయిల్

Brahmamudi: రాజ్‌కు ట్విస్ట్ ఇచ్చిన సీతారామయ్య.. పిచ్చిదానిలా వసుధార.. ముకుంద బ్లాక్ మెయిల్

Sanjiv Kumar HT Telugu
Feb 25, 2024 07:01 AM IST

Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..

రాజ్‌కు ట్విస్ట్ ఇచ్చిన సీతారామయ్య.. పిచ్చిదానిలా వసుధార.. మురారితో ముకుంద బ్లాక్ మెయిల్
రాజ్‌కు ట్విస్ట్ ఇచ్చిన సీతారామయ్య.. పిచ్చిదానిలా వసుధార.. మురారితో ముకుంద బ్లాక్ మెయిల్

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్ ప్రోమోలో కావ్యను ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్తాడు బావ. వాళ్ల వెనుకే ఫాలో అయి శ్వేతతో కలిసి వస్తాడు రాజ్. అతన్ని చూసిన బావ వెయిటర్ దగ్గరికి వెళ్లి ఏదో చెబుతాడు. తర్వాత ఆ వెయిటర్‌ను తను ఏం చెప్పాడు అని అడుగుతాడు రాజ్. దానికి ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ సార్. ఒక కేక్, ఒక చాట్, ఒక ఫ్లవర్ బుకే తెమ్మన్నారు అని వెయిటర్ చెబుతాడు. ఎందుకు అని రాజ్ అడిగితే.. ఇవాళ వాలంటైన్స్ డే కదా సార్ అని వెయిటర్ అంటాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు.

yearly horoscope entry point

ఊహించని విధంగా

దాంతో ఏదో ఒకటి తేల్చుకుందామని కావ్య బావ దగ్గరికి రాజ్ వెళ్తాడు. కానీ, ఊహించని విధంగా అక్కడికి రాజ్ తాతయ్య సీతరామయ్య వస్తాడు. అక్కడ చుట్టూ లవ్ షేప్ బెలూన్స్, వాలంటైన్స్ వాతావరణం చూసి కావ్యకు లవ్ ప్రపోజ్ చేద్దామని వచ్చావా అని రాజ్‌ను సీతారామయ్య అడుగుతాడు. దాంతో తాతయ్య ఉన్నాడని అవును తాతయ్య.. ఈరోజు వాలంటైన్స్ డే కదా అని రాజ్ అంటాడు. దానికి కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది.

చాలా ప్రేమగా

మరి ఆలస్యం ఎందుకు మొదలుపెట్టరా అని సీతారామయ్య అంటాడు. దాంతో కాస్తా తటపటాయించిన రాజ్ కొద్దిసేపటికీ ఫ్లవర్ బుకే తీసుకుని కావ్యకు ఇస్తూ హ్యాపీ వాలంటైన్స్ డే అంటాడు. దానికి కావ్య తన సంతోషాన్ని కళ్లలోనే చూపిస్తుంది. ఆ తర్వాత ఫ్లవర్ బుకేలోని ఓ రెడ్ రోజ్ తీసుకుని రాజ్‌కు ఇస్తూ హ్యాపీ వాలంటైన్స్ డే అని చాలా ప్రేమగా చెబుతుంది కావ్య. దాంతో కాస్తా అయోమయంగా ఆ రోజ్ తీసుకుంటాడు రాజ్. బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే సాంగ్ బీజీఎమ్ బాగుంటుంది. ఇలా కావ్యకు లవ్ ప్రపోజ్ చేసేలా బావ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఒంటరిగా రా

Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధారకు శైలేంద్రకు గొడవ జరిగేలా శైలేంద్ర, దేవయాని ప్లాన్ చేస్తారు. అది కూడా ఫణీంద్ర ద్వారా అమలు చేయిస్తారు. మహేంద్రకు కాల్ చేసి ఫణీంద్ర ఒంటరిగా రమ్మని, ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెబుతాడు. కాలేజీలో వద్దు ఇంట్లో ఉన్నాను. ఇంటికే రా, ఒంటరిగా రా అని ఫణీంద్ర అంటాడు. దాంతో ఎందుకు అన్నయ్య ఒంటరిగా రమ్మంటున్నారు. ఏంటా ముఖ్యమైన విషయం అని మహేంద్ర ఆలోచిస్తుంటాడు.

ఆఫీస్‌కు అందరం కలిసి వెళ్దామని వసుధార అంటుంది. దాంతో తాను ఆఫీస్‌కు కాదు. అన్నయ్య ఇంటికి వెళ్తున్నాను. నాకు కాల్ చేసి రమ్మన్నారు. నేను వెళ్లి వస్తాను అని మహేంద్ర అంటాడు. దాంతో నేను కూడా వస్తానని వసుధార అంటుంది. లేదు, నన్ను ఒంటరిగా రమ్మన్నారు అని మహేంద్ర అంటాడు. ఏదైనా ఉంటే ఫోన్‌లో చెప్పొచ్చు కదా మావయ్య. ఎందుకు ఒంటరిగా రమ్మంటున్నారు. నాకు ఏదో అనుమానంగా ఉంది అని వసుధార అంటుంది.

పిచ్చిపట్టిందని

మనం కాలేజీకి వెళ్లకుండా ఇంటికి వెళ్తే కాలేజీ పనులు ఎవరు చూసుకుంటారు. అది డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు అలా చెప్పారేమో. ఏదైనా సరే నేను చూసుకుంటాను అని శైలేంద్ర వెళ్లిపోతాడు. ఫణీంద్ర సార్ అలా ఎందుకు రమ్మన్నారు. ఇది శైలేంద్ర కుట్రనా అని డౌట్ పడుతుంది వసుధార. మరోవైపు రిషికి కర్మకాండలు జరిపిద్దామని ఫణీంద్ర అంటాడు. దాంతో షాక్ అయిన మహేంద్ర సైలెంట్‌గా ఉండిపోతాడు. నేను అయితే రేపే రిషికి కర్మకాండలు జరిపిద్దామని అనుకుంటున్నాను అని ఫణీంద్ర అంటాడు.

దాంతో మహేంద్ర మరింత షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే, రిషికి మహేంద్రతో కర్మకాండలు జరిపించి అతనిపై వసుధారకు కోపం పెరిగేలా చేయాలని శైలేంద్ర, దేవయాని ప్లాన్ చేస్తారు. దాంతో మహేంద్రపై వసుధార అరిస్తే.. తనకు పిచ్చిపట్టిందని ఎండీ సీటు నుంచి తప్పించాలనేది శైలేంద్ర ప్లాన్‌ అని ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.

ఆదర్శ్ ఉండకూడదు

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్ ప్రోమోలో రేవతికి కాఫీ ఇస్తూ ఈ ఏబీసీడీల అబ్బాయి ఇంకా రాలేదేంటీ అని కృష్ణ అంటుంది. మరోవైపు నా మనసు మారినట్లు నటించానే గానీ ఇంత.. ఇంత కూడా మారలేదు అని మురారితో అసలు విషయం చెబుతుంది ముకుంద. దాంతో మురారి షాక్ అవుతాడు. నువ్ ఏం చెప్పి పంపిస్తావో నాకు తెలియదు. ఆదర్శ్ నా కళ్ల ముందు ఉండకూడదు అని ముకుంద అంటుంది.

దానికి మరింత షాక్ అవుతాడు మురారి. సైలెంట్‌గా ఉండిపోతాడు. రేపు రాత్రికే శోభనం. ఆ గదిలోకి నేను పాల గ్లాసుతో అడుగుపెడితే తిరిగి ప్రాణాలతో బయటకు రాను. దాన్ని ఎలా ఆపుతావో.. ఆదర్శ్‌ని పంపుతావో అది నీ ఇష్టం అని ముకుంద బాధగా బ్లాక్ మెయిల్‌లా అంటుంది. దానికి అయోమయంలో పడిపోతాడు మురారి. మరోవైపు నా మొగుడు అని ముకుంద సేవ్ చేసుకుంది మురారి నెంబరే అని కృష్ణకు తెలిసిపోయినట్లుగా అనిపిస్తోంది.

Whats_app_banner