Krishna mukunda murari serial february 24th: కీలక మలుపు, ముకుందని పట్టించిన ‘నా మొగుడు’.. అయోమయంలో కృష్ణ
Krishna mukunda murari serial february 24th episode: ఆదర్శ్ అంటే తనకి ఇష్టం లేదనే విషయం ముకుంద మురారికి చెప్పేస్తుంది. తనని ఇంట్లో నుంచి పంపించకపోతే చచ్చిపోతానని బెదిరించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Krishna mukunda murari serial february 24th episode: మురారి గదిలోకి వచ్చింది కూడా పట్టించుకోకుండా కృష్ణ తెగ ఆలోచిస్తూ ఉంటుంది. కోపంగా తన మీదకి దిండు విసిరేస్తాడు. ఏంటి కోపం వచ్చిందా? అంటే మురారి సలసలా మరుగుతూ ఉంటాడు. మన శోభనం గురించి ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు కాదు రెండు జంటలకి ఒకేసారి ముహూర్తం పెట్టిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి మాత్రమే పెట్టిస్తే అర్థం ఏంటి? నేనంటే ఇష్టం లేదని అంటాడు. అలా అనకు ముహూర్తాలు వాళ్ళ జాతకాలని బట్టి పెడతారని చెప్తుంది. అసలు పంతులు ఫోన్ నెంబర్ ఇవ్వు ముహూర్తాలు ఎందుకు లేవు అనేది అడుగుతానని అంటాడు.
భవానీకి నిజం చెప్పాలనుకున్న ముకుంద
సరే మనకి కూడా అదే ముహూర్తానికి శోభనానికి ఏర్పాట్లు చేయమని చెప్తాను. రేపు మన పిల్లలు ఏ దొంగో రౌడీ అయితే పర్వాలేదా?సరైన ముహూర్తం లేకపోతే అలాంటి పిల్లలే పుడతారు. అసలే పెద్దత్తయ్యకి మంచి వాళ్ళని చేతిలో పెడదామని అంటే మురారి దెబ్బకి నోరు మూస్తాడు. ముకుంద వాళ్ళకి శోభనం జరిగిపోతే ఇక మనకి ఏ అడ్డు లేదు కదా నెక్ట్స్ ఏ ముహూర్తం ఉంటే మనకి అప్పుడే శోభనమని చెప్పి మురారిని కూల్ చేస్తుంది.
రిసార్ట్ లో శోభనం ప్లాన్ చేసింది కూడా కృష్ణ. అక్కడ శోభనం జరగకుండా చేశానని ఇక్కడ ఇంటికి రాగానే ఏర్పాట్లు చేసింది. పైగా నేను ఏదో ఏర్పాటు చేసినట్టు నామీదకి నెట్టేసింది. దగ్గరుండి పాల గ్లాసుతో శోభనం గదిలోకి పంపే వరకు నిద్రపోదు. నామీద ఎంత నమ్మకం ఉన్నా నేను మురారిని కోరుకుంటున్నాను అనే భయం మనసులో ఏదో ఒక మూలన ఉంటుంది. అసలు నాకు కృష్ణకి అన్యాయం చేయాలనే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేదాన్ని కదా.. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి. ఆదర్శ్ కి చెప్తే ముహూర్తం పెట్టాక నీ అసలు రంగు బయట పెడతావా అని గొడవ చేస్తాడు. ఏం చేయాలి? ఎవరికి చెప్పాలని ముకుంద ఆలోచిస్తుంది.
షాపింగ్ ఇష్టం లేదన్న ముకుంద
అత్తయ్యకి నా మనసులో ఉన్నది చెప్పేస్తాను ఆవిడ తప్ప ఎవరూ నన్ను కాపాడలేరని మనసులో అనుకుని వెంటనే ఫోన్ చేస్తుంది. అప్పుడే కృష్ణ వాళ్ళు తన దగ్గరకి వస్తారు. ఏంటి టెన్షన్ లో ఉన్నావ్? ఈ శోభనం వద్దని అనుకుంటున్నావా? అని అడిగేస్తుంది. అంటే మన రెండు జంటల శోభనాలు జరగాలని రిసార్ట్ లో ప్లాన్ చేశావ్ కదా ఇప్పుడు మీ ఒక్కరికే ముహూర్తం కుదిరిందని మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా?అని అంటుంది. మాగురించి ఆలోచించకు ముహూర్తం లేకుండా రౌడీలని ఎక్కడ కంటామని మురారి అంటాడు. మీరు ఏమంటే అదే మీరు మా గురించి చాలా ఆలోచిస్తున్నారని ఆదర్శ్ ఎంట్రీ ఇస్తాడు.
పెద్దత్తయ్య కూడా ఇదే మాట అన్నారు ఆవిడ లేకపోయినా ఆ బాధ్యత నాకు అప్పగించి శోభనం జరిపించమన్నారు. బట్టలు కూడా కొనిపించమన్నారని ముకుంద వైపు చూస్తూ చెప్తుంది. టెన్షన్ గా ఉంటుంది. శోభనానికి తెల్ల చీర, తెల్ల పంచె కొనాలి కదా పదండి వెళ్దామని అంటుంది. ఇప్పుడు తనకి ఓపిక లేదని ముకుంద తప్పించుకుంటుంది. మాకు ఏవి బాగుంటాయో మీకు తెలుసు కదా మీరే తీసుకురండని అనేసరికి మురారి ఒకే అంటాడు. దీంతో ముకుంద మొహం హ్యాపీగా ఉండటం కృష్ణ గమనిస్తుంది. శోభనం తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అత్తయ్యతో మాట్లాడతానని అనుకుని తనతో మాట్లాడితే అర్థం చేసుకుంటుందా? నన్ను ఇంట్లో ఉండనిస్తుందా? అనుకుంటుంది. వాళ్ళతో వీళ్ళతో కాదు డైరెక్ట్ గా మురారితో చెప్పేయాలని డిసైడ్ అవుతుంది.
ముకుందని పట్టించిన ‘నా మొగుడు’
మధు ముకుంద ఫోటోస్ తీసుకొచ్చి రేవతికి చూపిస్తాడు. శోభనం ముహూర్తం పెట్టేటప్పుడు తన మొహం చూడు ఎలా మాడ్చుకుందో, తన ఫీలింగ్స్ మారిపోయాయి. నా అనుమానం నిజం ఆదర్శ్ అంటే ఇష్టం లేదు ఇదంతా నాటకమని అంటాడు. కానీ రేవతి మాత్రం ముకుంద ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పేస్తుందని అంటుంది. అది ఇంతక ముందు ఇప్పుడు తను నటిస్తుందని చెప్తాడు. కృష్ణ వాళ్ళు షాపింగ్ చేసి ఇంటికి వస్తారు. వాటిని ఇవ్వడం కోసం ముకుంద దగ్గరకి వెళ్తుంది. మురారికి విషయం చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు. గుండెల్లో దాచుకుంటాడా? లేదంటే అందరికీ చెప్పి అల్లరి చేస్తాడా అని ఆలోచిస్తుంది. కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. నిన్నటి ఎఫెక్ట్ నుంచి నేను పూర్తిగా కొలుకోలేదు. నువ్వు శోభనం అంటున్నావని ఆపేందుకు ట్రై చేస్తుంది.
మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు ఏదైనా ఉంటే తనతో చెప్పమని కృష్ణ అడుగుతుంది. అప్పుడే ముకుందకి ఫోన్ వస్తుంది. అందులో నా మొగుడు అని పడుతుంది. నా మొగుడు అంటే ఆదర్శ్ ఫోన్ చేస్తున్నాడు ఇంట్లోనే ఉన్నాడు కదా ఎందుకు ఫోన్ చేస్తున్నాడని కృష్ణ అనుకుని మాట్లాడమని చెప్పి వెళ్ళిపోతుంది. కృష్ణ ఆదర్శ్ ఫోన్ మాట్లాడటం చూసి ముకుందతోనే మాట్లాడుతున్నాడని అనుకుంటుంది. కృష్ణ గదికి రాగానే కాఫీ ఏదని మురారి అడుగుతాడు. అయ్యో మర్చిపోయానని చెప్తుంది. నువ్వు మర్చిపోతావ్ అందుకే ఇందాక ముకుందకి ఫోన్ చేశానని చెప్తాడు. తనకి ఎప్పుడు ఫోన్ చేశారని అంటే నువ్వు రాక ముందని చెప్తాడు.
ఫోన్ చేసింది ఏసీపీ సర్. నా మొగుడని ఫీడ్ చేసుకుందా? అసలు ఏం ఆలోచిస్తుంది ఈ ముకుంద అని కోపంగా అనుకుంటుంది. నా మొగుడు అని ఎవరి పేరు ఫీడ్ చేసుకుందో కృష్ణ తెలుసుకోవాలని అనుకుని మురారి ఫోన్ తీసుకుంటుంది.
తరువాయి భాగంలో..
ముకుంద అనుకునట్టుగా మురారికి నిజం చెప్పేస్తుంది. నా మనసు మారినట్టు నటిస్తున్నాను కానీ ఇంత కూడా మారలేదు. నువ్వు ఏం చేస్తావో ఏం చెప్పి పంపిస్తావో నాకు అనవసరం. ఆదర్శ్ నా కళ్ళ ముందు ఉండకూడదు. రేపు రాత్రి శోభనం నేను గదిలోకి పాల గ్లాసుతో అడుగుపెడితే నేను ప్రాణాలతో బయటకి రాను. ఈ శోభనం ఎలా అపుతావో, ఆదర్శ్ ని ఎలా పంపిస్తావో నీ ఇష్టమని మురారికి వార్నింగ్ ఇస్తుంది.