Maguva O Maguva Serial: అత్త ప్రేమ కూడా శాపంగా మారితే.. త్వరలో సరికొత్త సీరియల్ మగువ ఓ మగువ-maguva o maguva serial starting on february 19 on star maa channel maguva o maguva telecast date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maguva O Maguva Serial: అత్త ప్రేమ కూడా శాపంగా మారితే.. త్వరలో సరికొత్త సీరియల్ మగువ ఓ మగువ

Maguva O Maguva Serial: అత్త ప్రేమ కూడా శాపంగా మారితే.. త్వరలో సరికొత్త సీరియల్ మగువ ఓ మగువ

Sanjiv Kumar HT Telugu
Feb 16, 2024 06:36 AM IST

Maguva O Maguva Serial Telecast Date: ఇప్పటీకీ స్టార్ మా ఛానెల్‌లో ఎన్నో పాపులర్ సీరియల్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వాటిలోకి మరో సీరియల్ యాడ్ కానుంది. స్టార్ మా ఛానెల్‌లో త్వరలో సరికొత్త సీరియల్ మగువ ఓ మగువ ప్రారంభం కానుంది.

అత్త ప్రేమ కూడా శాపంగా మారితే.. త్వరలో సరికొత్త సీరియల్ మగువ ఓ మగువ
అత్త ప్రేమ కూడా శాపంగా మారితే.. త్వరలో సరికొత్త సీరియల్ మగువ ఓ మగువ

Maguva O Maguva Serial Streaming Date: తల్లీ కొడుకుల ప్రేమ అద్భుతం. ఆ అనుబంధం సృష్టిలోనే అపురూపం. ఆ బంధానికి, ఆ అనురాగానికి అద్దం పట్టే కథతో స్టార్ మా "మగువ ఓ మగువ" పేరుతో సరికొత్త సీరియల్ ప్రారంభిస్తోంది. జీవితంలోని ఓ కొత్త కోణాన్ని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మధ్యాహ్నం 1 గం.కు ప్రసారమయ్యే ఈ ధారావాహికను సోమవారం నుంచి శనివారం వరకు చూడవచ్చు.

కొడుకు ఇష్టపడిన ప్రతి వస్తువుని అపురూపంగా దాచి అందులో కొడుకు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకునే ఒక అత్తకి, ఆ వస్తువుల్లో ఒక వస్తువుగా ఆ ఇంట్లోనే ఉండిపోవాల్సిన ఒక కోడలికి మధ్య ఊహలకు అందని కథ ఇది. అత్తిల్లు అంటే ఒక కొత్త కోడలు అడుగుపెట్టే ఒక కొత్త ప్రపంచం కావాలి గానీ అది బందిఖానా లానో, పంజరంలానో మారిపోతే ఆమె పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకి సమాధానమే ఈ ధారావాహిక మగువ ఓ మగువ.

అంతా సంతోషంగా ఆనందంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో జరగరాని సంఘటన అటు తల్లినీ, ఇటు భార్యనీ కలవరపెట్టింది. తరవాత ఎదురయ్యే పర్యవసానాలను అత్త, కోడలు ఎలా ఎదుర్కొన్నారో మనసుని తట్టేలా చెబుతుంది మగువ ఓ మగువ కథ. దేవుడు ఒక దారి మూస్తే, మరో దారి చూపిస్తాడన్న పెద్దలు చెప్పినట్టు.. కోడలికి ఒక ఆశ కనిపిస్తుందేమో అని ఎదురుచూసిన చోట.. కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

ఇదో ఓ మగువ కథ. ఆమె జీవితంలో ఊహించని సంఘటనల మధ్య జరిగిన ప్రయాణం చేసిన కథ. అత్తగారి నుంచి ప్రేమ దొరకడం లేదు అని ఎందరో కోడళ్లు కుమిలిపోతున్న ఈ రోజుల్లో ఈ కథలో కోడలికి దొరికిన ప్రేమ ఆమెకి ఇబ్బందిగా, సమస్యగా, శాపంగా మారిపోతే ఆమె జీవితం ఏమవుతుందన్నదే పెద్ద ప్రశ్న. కనికరించని పరిస్థితులు, కలిసిరాని అనుబంధాల మధ్య ఈ తరం మగువ ఎలా నెగ్గుకొచ్చిందో తెలుసుకోవాలంటే "మగువ ఓ మగువ" చూడాల్సిందే అని మేకర్స్ చెబుతున్నారు.

స్టార్ మా ఛానెల్‌లో ఈ నెల 19న ప్రారంభం కాబోతోంది మగువ ఓ మగువ సీరియల్. మధ్యాహ్నం 1 గం.కు ప్రసారం కానున్న ఈ సరికొత్త సీరియల్ స్టార్ మా ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీరియల్‌లో కృతిక మెయిన్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడకు చెందిన కృతిక ఈ సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ నటి నేత్రాజ్ యాదవ్ అత్త పాత్రలో నటిస్తోంది. ఆమె ఇదివరకు తెలుగులో లక్ష్యం, రావోయి చందమామ కన్నడలో సుందరి సీరియల్స్‌లో నటించింది.

మగువ ఓ మగువ సీరియల్‌లో శ్రవణ్ అనే ప్రముఖ నటుడు నటిస్తున్నాడు. అత్తారింటికి దారేది, కస్తూరి, పల్లకిలో పెళ్లికూతురు సీరియల్స్‌లో నటించాడు శ్రవణ్. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీవల్లి సీరియల్స్‌లో నటించిన పూర్ణ సాయి నటిస్తున్నాడు. అలాగే సీనియర్ నటుడు రామ్మోహన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆడపిల్ల, భార్యామణి, యమలీల, కుంకుమపువు, చెల్లెలి కాపురం వంటి చాలా సీరియల్స్‌లో రామ్మోహన్ నటించారు.

ఇదిలా ఉంటే, ఇప్పటికే స్టార్ మా ఛానెల్‌లో ఎన్నో పాపులర్ సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్రహ్మముడి సీరియల్. ప్రేమ, అనుబంధాలు, కుటుంబ బాధ్యతలు, గౌరవం, పరపతి, మోసాలు, ఈర్శ్య వంటి అన్ని రకాల మేళవింపుతో బ్రహ్మముడి టాప్ సీరియల్‌లో ఒకటిగా నిలిచింది. అలాగే గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ సైతం మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

Whats_app_banner